పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-593-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మనుజేంద్ర! నీ కతంబున
నుపమ ఘన బ్రహ్మదండ తుఁ డత్యఘ వ
ర్తనుఁడు నగునట్టి వేనుం
యము నరకంబు వలన ర్థిఁ దరించెన్.

టీకా:

మనుజేంద్ర = రాజా {మను జేంద్రుడు - మనుజులలో ఇంద్రునివంటివాడు, రాజు}; నీ = నీ; కతంబునన్ = కారణముచే; అనుపమ = సాటిలేని; ఘన = గొప్ప; బ్రహ్మదండ = తప్పస్సంపన్నుల శాపంఏ వలన; హతుడు = చంపబడినవాడు; అతి = మిక్కిలి; అఘ = పాపపు; వర్తనుడు = నడవడిక కలవాడు; అగున్ = అయిన; అట్టి = అటువంటి; వేనుండు = వేనుడు; అనయమున్ = ఎల్లప్పుడు; నరకంబు = నరకము; వలన = నుండి; అర్థిన్ = కోరి; తరించెన్ = విముక్తు డాయెను.

భావము:

“రాజా! పాపవర్తనుడై బ్రాహ్మణశాపం చేత నిహతుడైన నీ తండ్రి వేనుడు ని న్ను పుత్రునిగా పొందటం చేత నరకలోకం నుండి తరించాడు.