పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-589.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్ని ముఖమునకంటె ధరామరేంద్ర
ముఖము పరిశుద్ధ మత్యంతముఖ్య మనఁగఁ
నరు నది గాన భూసురార్చనము సకల
నులుఁ గావింపఁ దగు నార్యనములార!

టీకా:

విజ్ఞాన = చక్కటిజ్ఞానముకలిగిన; ఘనుడున్ = గొప్పవాడు; అనన్ = అనగా; వెలయు = ప్రసిద్ధచెందిన; ఈశ్వరుడు = నారాయణుడు; తత్త్వ = తత్త్వము యొక్క; జ్ఞాన = జ్ఞానముతో; యుతులు = కలవారు; ఐన = అయిన; వారి = వారి; చేతన్ = చేత; దీపింపన్ = ప్రకాశిస్తుండగా; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మొదలగు; దేవతా = దేవతలను; ఉద్దేశ్యంబునను = ఉద్దేశించి; భూమిసుర = బ్రాహ్మణుల; ముఖంబునన్ = ద్వారా; హుతంబున్ = సమర్పించబడినది; అగు = అయిన; = హవిస్సులన్ = హోమముచేయుద్రవ్యములుచే {హవిస్సులు - అగ్నిహోత్రమున హోమముచేయుద్రవ్యములు (ఇగర్చబెట్టినఅన్నము నెయ్యి)}; తృప్తిన్ = తృప్తిని; అందిన = చెందిన; గతిన్ = విధముగా; అచేతనమాన = జడపదార్థమైన; = ఆ = ఆ; హుతాశన = అగ్నిహోత్రుని {హుతాశనుడు - హుతముచేయబడినవానిని భుజించువాడు, అగ్ని}; ముఖంబువలన = ద్వారా; వేల్చిన = హోమముచేయబడిన; హవిస్సులన్ = హోమముచేయుద్రవ్యములు; చేతన్ = వలన; తృప్తుండు = తృప్తిండెందినవాడు; కాకుండు = కాడు; కావునన్ = అందుచేత; లోకమున్ = లోకము; అందున్ = లో; అగ్ని = అగ్నిహోత్రుని.
ముఖమున = నోరు; కంటెన్ = కంటె; ధరామర = బ్రాహ్మణ; ముఖమున్ = మోము; పరిశుద్దము = స్వచ్ఛమైనది; అత్యంత = మిక్కలి; ముఖ్యమున్ = ముఖ్యమైనది; అనగన్ = అనగా; తనరున్ = అతిశయించును; అదిగాన = అందుచేత; భూసుర = బ్రహ్మణుల {భూసురుడు - భూమికి దేవత, బ్రాహ్మణుడు}; అర్చనము = సేవించుట; సకల = సమస్తమైన; జనులున్ = వారును; కావింపన్ = చేయుటకు; తగున్ = తగినది; ఆర్యజనములారా = ఉత్తములారా.

భావము:

ఆర్యమహాజనులారా! తత్త్వజ్ఞాన సంపన్నులైనవారు ఇంద్రాది దేవతల నుద్దేశించి బ్రాహ్మణముఖంగా అర్పించే అన్నం వల్ల తృప్తి చెందినట్లు, అచేతనమైన అగ్నిలో వేల్చిన హవిస్సు వల్ల ఈశ్వరుడు తృప్తి పొందడు. కాబట్టి లోకంలో అగ్నిముఖం కంటె బ్రాహ్మణుల ముఖం పరిశుద్ధమైనది. అత్యంత ప్రధానమైనది. అందువల్ల సకల జనులూ బ్రాహ్మణులకు సమర్పించాలి.