పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-587.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేగమున నంతరంగంబు విశద మగుటఁ
జేసి కైవల్య పదమును జెందు; నట్లు
గాన లోకులు భూదేవతానికరముఁ
గిలి భజియింప వలయు నుదాత్త మతిని.

టీకా:

ఏ = ఏ; వసుధామర = బ్రాహ్మణులను; సేవనున్ = సేవించుటను; చేసి = వలన; అశేష = సమస్తమైన; గుణ = గుణములు; ఆన్విత = కలిగియుండెడి; స్థితిన్ = స్థితిని; తనర్చు = అతిశయించు; సర్వేశ్వరుడు = విష్ణమూర్తి; మఱి = మిక్కిలి; సంతుష్టుడు = సంతృప్తిచెందినవాడు; అగున్ = అగునో; అట్టి = అటువంటి; ధరణిదివిజులన్ = బ్రాహ్మణులను {ధరణిదివిజులు - ధరణి (భూమి)కి దివిజులు (దేవతల), బ్రాహ్మణులు}; తత్ = ఆ వేదమార్గ; ధర్మ = ధర్మమునందు; పరులున్ = నిష్టకలవారు; అలఘు = గొప్ప; వినీతులు = వినయముకలవారు; అవశ్యంబును = తప్పక; సేవింపరే = సేవించెదరు; ధరాదేవ = బ్రాహ్మణులను; నిత్య = నిత్యము; సేవన్ = సేవించుట; చేన్ = చేత; పురుషుడు = మానవుడు; చిరతర = అత్యధికమైన {చిరము - చిరతరము - చిరతమము}; జ్ఞాన = జ్ఞానము; విద్యా = విద్యలను; అభ్యాసి = చదివినవాడు; కాకున్నన్ = కాకపోయినవాడు; ఐనన్ = అయినప్పటికిని; అతడు = అతడు.
వేగమునన్ = తొందరలోనే; అంతరంగంబున్ = మనసును; విశదము = స్వచ్చమైనది, నిర్మలమైనది; అగుటన్ = అగుట; చేసి = వలన; కైవల్యపదమును = మోక్షమును; చెందున్ = పొందును; అట్లుగాన = అందుచేత; లోకులు = ప్రజలు; భూదేవతా = బ్రాహ్మణుల; నికరమున్ = సమూహమును; తగిలి = పూని; భజియింపవలయున్ = సేవింపవలెను; ఉదాత్త = ఉత్తమమైన; మతిన్ = బుద్ధితో.

భావము:

బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులను సేవిస్తే సకల గుణ సంపన్నుడైన సర్వేశ్వరుడు సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి బ్రాహ్మణులను ధర్మపరులై వినయ వినమ్రులై అవశ్యం సేవించండి. బ్రాహ్మణులను నిత్యం సేవించేవాడు గొప్ప జ్ఞాని, పండితుడు కాకపోయినా నిర్మల హృదయం కలవాడై మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి లోకులు ఉదాత్త బుద్ధితో బ్రాహ్మణులను సేవించాలి.