పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-583.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తియు మఱి జ్యోతిష్టోమ వనముఖ్య
నామత బహు విశేష గుతను మెఱయు
ట్టి యధ్వరరూపమై ఖిల జగము
నందు ననిశంబుఁ బ్రఖ్యాతి నొందుచుండు.

టీకా:

రూఢిన్ = నిశ్చయముగా; ఈశ్వరుడు = హరి; స్వ = తన; రూపంబునన్ = రూపము; చేసి = వలన; పూని = ధరించిన; విశుద్ధ = పరిశుద్దమైన; విజ్ఞాన = విజ్ఞానమైన; ఘనుడున్ = గొప్పవాడు; అగుణుండు = త్రిగుణాతీతుడు; అయిన = అయినట్టి; తాన్ = అతను; అరయని = పరిశీలింపరాని; కర్మమార్గమున్ = యజ్ఞకర్మమార్గము; అందున్ = లో; వ్రీహ = గోధుమలు; ఆది = మొదలగు; ద్రవ్యములను = పదార్థములును; శుక్ల = తెలుపు; ఆది = మొదలైన; గుణమున్ = గుణములును; విస్పురత్ = వికసించిన; అవఘాత = దంచుట; ఆది = మొదలగు; సత్ = మంచి; క్రియలును = పనులును; మంత్ర = మంత్రముల; సంచయంబున్ = సమూహము; సంకల్పమునున్ = సంకల్పము; యాగ = యజ్ఞము వలన; సాధ్యము = సాధ్యము; ఐనట్టి = అగునట్టి; అఖండ = నిరంతరాయమైనట్టి; ఉపకారంబున్ = ప్రయోజనములు; ఘన = గొప్ప; పదార్థ = పదార్థములు.
శక్తియు = శక్తి; మఱి = ఇంక; జ్యోతిష్టోమసవన = జ్యోతిష్టోమయాగము; ముఖ్య = మొదలైన; నామతన్ = పేర్లతోను; బహు = మిక్కలి; విశేష = విస్తారమైన; గుణతను = గుణములుకలిగి యుండుటతోను; మెఱయునట్టి = ప్రకాశించునట్టి; అధ్వర = యజ్ఞము యొక్క; రూపమై = స్వరూపమై; అఖిల = సమస్తమైన; జగమున్ = లోకములు; అందున్ = లోను; అనిశంబున్ = ఎల్లప్పుడు; ప్రఖ్యాతిన్ = ప్రసిద్దిను; ఒందుచుండు = పొందుతుండును.

భావము:

ఈశ్వరుడు స్వచ్ఛమైన విజ్ఞానమే స్వరూపంగా కలవాడు. ఆయన నిర్గుణుడే అయినా నానా విశేష గుణాలు కలిగిన యజ్ఞం భగవంతుని స్వరూపమే. కర్మమార్గంలోనే వ్రీహి మొదలైన ద్రవ్యాలు, తెలుపు మొదలైన గుణాలు, దంచుట మొదలైన క్రియలు, మంత్రసమూహం, సంకల్పం, సాధింపదగిన మహోపకారం, గొప్ప పదార్థాలు, శక్తి, జ్యోతిష్టోమం మొదలైన నామాలు ఇటువంటి అనేక గుణాలతో ఏర్పడే యజ్ఞం భగవంతుని స్వరూపంగా సమస్త జగత్తులో ప్రఖ్యాతి గాంచింది.