పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-582-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున మీర లవ్వాసుదేవుని నధికారానుసారంబున నిశ్చితార్థ ఫలసిద్ధి గల వారలై మనోవాక్కాయకర్మంబుల నిష్కపటవృత్తిం దగిలి వినుతి నతి పరిచర్యా పూర్వకంబుగాఁ గామదుఘంబు లయిన యతని పాదపంకజంబులు భజియింపుం; డదియునుం గాక.

టీకా:

కావునన్ = అందుచేత; మీరలు = మీరు; ఆ = ఆ; వాసుదేవుని = విష్ణుమూర్తిని; అధికార = అర్హతలను; అనుసారంబునన్ = అనుసరించి; నిశ్చిత = నిశ్చయించుకొనిన; ఫల = పలితముల; సిద్ధి = పొందుట; కలవారలు = ఉన్నవారు; ఐ = అయ్యి; మనః = మనస్సు; వాక్ = మాట; కాయ = దేహము; కర్మంబులన్ = కర్మములను; నిష్కపట = మర్మములేని; వృత్తిన్ = విధముగ; తగిలి = నిశ్చయముతో; వినుతిన్ = చక్కగ స్తుతించుట; అతి = గట్టి; పరిచర్య = సేవలు; పూర్వకంబుగా = కలిగిన విధముగా; కామ = కామితములను; దుఘములు = పితుకునవి, తీర్చునవి {కామదుఘములు – కామధేనువులు వంటివి}; అతని = అతని; పాద = పాదములు అనెడి; పంకజంబులు = పద్మములు {పంకజము - పంకము (నీరు, బురద) యందు జము (పుట్టునది), పద్మము}; భజియింపుడు = సేవించండి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

కాబట్టి మీరు మీ మీ శక్తికి తగినట్లుగా నిశ్చితమైన ఫలసిద్ధి, త్రికరణశుద్ధి, నిష్కపటమైన బుద్ధి కలవారై స్తుతి నమస్కార సేవల ద్వారా భక్తాభీష్టప్రదాలైన ఆ దేవదేవుని పాద పద్మాలను సేవించండి. అంతేకాక…