పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-581-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మవశంబునన్ జగము ల్గును హెచ్చు నడంగు నన్నచో
ర్మముఁ బుద్ధిఁ జూడ జడకార్యము; గాని ప్రపంచ కల్పనా
ర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁ జాల; దీ జగ
త్కర్మక కార్య కారణము గావున నీశుఁడు విష్ణుఁ డారయన్.

టీకా:

కర్మ = కర్మసూత్రము {కర్మసూత్రము - ప్రతికర్మ (పని)కి ఫలితం ఉంటుంది; ఎలాగంటే కార్య కారణ సిద్ధాంతము (ప్రతి కార్యానికి కారణము ఉండును) వలెనె, పునర్జన్మలు ఈ కర్మసిద్దాంతం ప్రకారమే కలుగుతాయి అంటారు}; వశంబునన్ = వశమై, అనుసరించి; జగము = విశ్వము; కల్గును = పుట్టును; హెచ్చున్ = పెరుగును; అడంగును = అణగిపోవును; అన్నచో = అంటే; కర్మమున్ = కర్మమును; బుద్ధిన్ = ఆలోచించి; చూడన్ = చూసినచో; జడ = చైతన్యములేనిది; కార్యము = కర్మము; కాని = అంతే కాని; ప్రపంచ = ప్రపంచమును; కల్పనా = సృష్టించెడి; కర్మమున్ = పని; అందున్ = లో; కర్త = పనిచేసినది, కారణము; అనగా = అన; విలసిల్లగ = ప్రసిద్దమగుటకు; చాలదు = సరిపడదు; ఈ = ఈ; జగత్ = భువనము; కర్మక = సృష్టించెడికర్మ అనెడి; కార్య = కార్యమునకు; కారణము = కర్త, చేసినవాడు; కావునన్ = కనుక; విష్ణుడు = విష్ణుమూర్తి; అరయన్ = తరచిచూసిన.

భావము:

కర్మవశం చేతనే ఈ లోకం జన్మిస్తుంది, పెంపొందుతుంది, నశిస్తుందని మీరు అంటారేమో? అది కుదరని మాట. కర్మ జడపదార్థం. కాబట్టి ప్రపంచ సృష్టికి అది కర్త కాజాలదు. ఈ జగత్తు అనే కార్యానికి విష్ణువు కారణం. అందువల్ల ఆయనే భగవంతుడు, పరమేశ్వరుడు.