పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-579-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణుండు జగదా
ధారుండగు నీశ్వరుండు; లఁప నతనికిన్
లేరెందు సములు నధికులు
ధీరోత్తముఁ డతఁడు నద్వితీయుం డగుటన్.

టీకా:

నారాయణుండు = హరి; జగదాధారుండున్ = విష్ణుమూర్తి {జగ దాధారుండు - జగత్ (విశ్వము)నకు ఆధారమైనవాడు, విష్ణువు}; అగు = అయిన; ఈశ్వరుండు = విష్ణుమూర్తి; తలపన్ = తరచిచూసిన; లేరు = లేరు; ఎందున్ = ఏవిధముగను; సములు = సమానమైనవారు; అధికులు = గొప్పవారు; ధీరోత్తముడు = విష్ణుమూర్తి {ధీరోత్తముడు - ధీరులు (జ్ఞానులు)లో ఉత్తముడు, విష్ణువు}; అతడు = అతడు; అద్వితీయుండు = ద్వితీయ మన్నది లేనివాడు.

భావము:

నారాయణుడు జగత్తుకు ఆధారమైన భగవంతుడు. ఆయనతో సమానులు కాని, ఆయన కంటె అధికులైనవారు కాని లేరు. ఆయన మహాధీరుడు, అద్వితీయుడు.