పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-575-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్టి విద్వ దనుభవంబున భువన హితుండగు వాసుదేవుండు లేఁడనుట యుపపన్నంబు గా; దదియునుం గాక.

టీకా:

ఇట్టి = ఇటువంటి; విద్వత్ = విజ్ఞుల, జ్ఞాన పూర్వక; అనుభవంబునన్ = అనుభవమువలన; భువన = లోకములకు; హితుండు = మేలుకోరెడివాడు; అగు = అయిన; వాసుదేవుండు = హరి; లేడు = లేడు; అనుట = అనెడి వాదనకు; ఉపపన్నంబున్ = ఉపపత్తి కలది, అంగీకారయోగ్యము; కాదు = కాదు; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

ఇటువంటి పెద్దల అనుభవాలను బట్టి విచారిస్తే భగవంతుడు లేడనడం పొసగని మాట. అంతేకాక…