పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-573-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక యీ జగద్వైచిత్ర్యంబు కర్తయైన యీశ్వరుండు లేకున్నం గర్మవశంబునం జేసి యుపపన్నంబగు నంటిరేని.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; జగత్ = సృష్టి యందలి; వైచిత్ర్యంబున్ = విచిత్రములకు; కర్త = ఆచరించినవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరుండు = పరమేశ్వరుడు; లేకున్నన్ = లేకపోయినను; కర్మ = కర్మలకు, కర్మసూత్రమునకు {కర్మసూత్రము - కర్మమునకు ఫలితము ఉండును అనెడి సూత్రము}; వశంబునను = లోబడుట; చేసి = వలన; ఉపపన్నంబున్ = అంగీకారము; అగున్ = అగును; అంటిరేని = అన్నచో;

భావము:

అంతేకాక కర్త అయిన ఈశ్వరుడు లేకున్నప్పటికీ ఈ విచిత్ర జగత్తు కర్మవశాన పుడుతుందని మీరు అన్నట్లైతే….