పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-572.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డుచు నున్నది; యిట్టి ప్రపంచ రచిత
ర్మ వైచిత్ర్య మమ్మేటి లుగకున్న
మరు నను తదుక్తు లుపపన్నములు కావు;
కాన నవ్వాసుదేవుండు లఁడు మఱియు.

టీకా:

అనన్ = అనగ; విని = విని; వారి = వారి; కిన్ = కి; మనుజేశ్వరుడు = రాజు; అను = అనెను; అర్హతములార = అత్యంతయోగ్యులారా {అర్హులు - అర్హతరులు - అర్హతములు}; వినుడు = వినండి; అయ్య = తండ్రులు; తవిలి = తగిలి; మీరు = మీరు; యజ్ఞాధిపతి = యజ్ఞములకధిపతి; ఐన = అయిన; అఖిలేశ్వరుడు = హరి {అఖిలేశ్వరుడు - సమస్తమునకు ఈశుడు, విష్ణువు}; కొన్ని = కొందరి; మతములన్ = వాదనలలో; కలడు = ఉన్నాడు; ధీమంతులార = ధీశక్తికలవారలారా; అట్లు = ఆ విధముగ; అయినన్ = అయియుండగ; మీరలు = మీరు; అందుకు = దానికి; విప్రతిపత్తి = విరుద్ధవాదనమున; కలుగుటను = ఉండుటచేత; ప్రపన్నమున్ = భక్తినిచూపుట; అరయన్ = తరచిచూసిన; కాదు = సరికాదు; అంటిరేని = అన్నచో; ఆ = ఆ; = ఘనునిన్ = గొప్పవాని; చేన్ = చేత; రచితము = సృష్టింపబడినది; ఐ = అయ్యి; కాంతివంతము = ప్రకాశవంతము; అగు = అయిన; జగంబున్ = ప్రపంచము; కానబడుచున్నది = కనపడుతున్నది.
ఇట్టి = ఇటువంటి; ప్రపంచ = లోకములందు; రచిత = సృష్టింపబడిన; కర్మ = కర్మల; వైచిత్ర్యము = చిత్రవిచిత్రములు; ఆ = ఆ; మేటి = గొప్పవాడు; కలుగకున్నన్ = లేనిచో; అమరున్ = కుదురును; అను = అనెడి; తత్ = ఆ; ఉక్తులు = మాటలు; ఉపపన్నములు = అంగీకారయోగ్యములు; కావు = కావు; కానన్ = కావున; ఆ = ఆ; వాసుదేవుడు = నారాయణుడు; కలడు = ఉన్నాడు; మఱియున్ = ఇంకను.

భావము:

సభ్యుల ప్రశ్నను విని పృథుచక్రవర్తి వారితో ఇలా అన్నాడు “యోగ్యులైన బుద్ధిమంతులారా! వినండి. యజ్ఞాధిపతి అయిన సర్వేశ్వరుడు ఉన్నాడు. అందుకు మీరు అంగీకరింపకపోతే ఆయన సృజించిన లోకం కన్నుల ముందు స్పష్టంగా కనిపిస్తున్నది కదా! వాసుదేవుడు లేకపోతే ఈ చిత్రవిచిత్రమైన జగత్తు ఎలా పుట్టింది? అందువల్ల ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకోక తప్పదు.