పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-571-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"జనాయక! ప్రజ లిర వొం
ది ధర్మము లెల్ల వాసుదేవార్పణ బు
ద్ధినిఁ జేయవలయు నంటివి
యంబును వాసుదేవుఁ నఁ గలఁడె మహిన్? "

టీకా:

జననాయక = రాజ; ప్రజలు = ప్రజలకి; ఇరవొందిన = అమరిన; ధర్మముల్ = ధర్మములు; ఎల్లన్ = సమస్తము; వాసుదేవ = నారాయణదేవునికి; అర్పణంబున్ = సమర్పణము చేయు; బుద్ధినిన్ = భావముతో; చేయవలెన్ = చేయవలెను; అంటివి = అన్నావు; = అనయంబునున్ = ఎల్లప్పుడును; వాసుదేవుడు = విష్ణుమూర్తి; అనన్ = అనెడివాడు; కలడె = ఉన్నాడ; మహిన్ = భూమ్మీద.

భావము:

“మహారాజా! వాసుదేవార్పణ బుద్ధితో ప్రజలు ధర్మకార్యాలను ఆచరించాలని నీవు చెప్పావు. అసలు వాసుదేవు డనేవాడు అంటూ ఒకడున్నాడా?"