పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-568-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వినుఁడీ సభ్యులు ధర్మము
యము నెఱుఁగంగఁ గోరు ట్టి జనుఁడు దాఁ
తలఁపునఁగల యర్థముఁ
ను నెఱిఁగింపంగ ధీర త్పురుషులకున్.

టీకా:

వినుడీ = వినండి; సభ్యులు = సదస్యులు; ధర్మమున్ = ధర్మమును; అనయమున్ = అవశ్యము; ఎఱుగంగన్ = తెలిసికొన; కోరునట్టి = కోరెడి; జనుడు = వాడు; తాన్ = తను; తన = తన; తలపున = మనసున; కల = ఉన్నట్టి; అర్థమున్ = ప్రయోజనమును; చనున్ = తగును; ఎఱిగింపంగ = తెలుపుట; ధీర = ధీబుద్ధి కలిగిన; సత్పురుషులు = మంచివారి; కున్ = కి.

భావము:

“సభ్యులారా! దయచేసి వినండి. ధర్మాన్ని తెలుసుకోవాలని కోరేవాడు తన మనస్సులోని అభిప్రాయాన్ని ధీరులైన సత్పురుషులకు నివేదించడం మంచిది.