పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-566-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నతోన్నతుఁడు సముత్తుంగ భుజుఁడు స-
న్మహనీయతర శోభమాన ముఖుఁడుఁ
జారుసంఫుల్ల కంజారుణేక్షణుఁడు సు-
నాసాపుటుండు మంస్మితుండు
క్రసూక్ష్మస్నిగ్ధ రనీల కేశుండుఁ-
మనీయరుచి కంబు కంధరుండు
సుభగ విశాల వక్షుండును ద్రివళి శో-
భిత మధ్యభాగుండుఁ బృథునితంబ

4-566.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మండలుండు నావర్త సమాన నాభి
వివరుఁడును గాంచనస్తంభ విలసదూరు
రాజితుండును నరుణచణుఁడును ధృత
వ దుకూ లోత్తరీయుఁ డున్నతయశుండు

టీకా:

ఉన్నతోన్నతుడు = మిక్కలిపొడగరి; సమ = మిక్కలి; ఉత్తుంగ = ఎత్తైన; భుజుడు = భుజములుకలవాడు; సత్ = స్వచ్చమై; మహనీయతర = మిక్కలిగొప్పగా {మహనీయము - మహనీయతరము - మహనీయకమము}; శోభాయమాన = శోభిల్లుతున్న; ముఖుండు = ముఖముకలవాడు; చారు = అందముగా; సంపుల్ల = వికసించిన; కంజ = పద్మము వంటి; అరుణ = ఎర్రని; ఈక్షణుడు = కన్నులుకలవాడు; సు = మంచి; నాసాపుటుండు = ముక్కుపుటములుకలవాడు; మందస్మితుండు = చిరునవ్వుకలవాడు; వక్ర = ఉంగరాలుతిరిగిన; సూక్ష్మ = సన్నని; స్నిగ్ద = చిక్కనైన; నీల = నల్లని; కేశుండు = శిరోజములు కలవాడు; కమనీయ = మనోహరమైన; రుచి = కాంతివంతమైన; కంబు = శంఖమువంటి; కంధరుండు = కంఠముకలవాడు; సుభగ = సౌభాగ్యకరమైన; విశాల = విశాలమైన; వక్షుండునున్ = వక్షస్థలముకలవాడు; త్రి = మూడు (3); వళి = ముడుతలుతో; శోభిత = శోభిల్లుతున్న; మధ్యభాగుండు = నడుముకలవాడు; పృథు = పెద్ద; నితంబ = పిరుదులు; మండలుండు = గుండ్రముగాకలవాడు; ఆవర్త = సుడిగుండమునకు.
సమాన = సమానమైన; నాభివివరుండడును = బొడ్డుకలవాడు; కాంచన = బంగారు; స్తంభ = స్తంభములవలె; విలసత్ = విలసిల్లెడి; ఊరు = తొడలచే; రాజితుండును = విరాజిల్లుతున్నవాడు; అరుణ = ఎర్రని; చరణుండును = పాదములుకలవాడు; ధృత = ధరించిన; నవ = కొత్త; దుకూల = తెల్లని వస్త్రము; ఉత్తరీయుండును = ఉత్తరయముగా కలవాడు; ఉన్నత = గొప్ప; యశుండును = కీర్తికలవాడును.

భావము:

పృథుచక్రవర్తి మిక్కిలి పొడవైనవాడు. ఎగుబుజాలవాడు. మహత్తర శోభావైభవంతో ప్రకాశించే ముఖం కలవాడు. చక్కగా వికసించిన కమలదళాలవంటి ఎర్రని కన్నులు కలవాడు. అందమైన ముక్కు కలవాడు. ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతుండే పెదవులు కలవాడు. ఉంగరాలు తిరిగి నునుపుదేరిన నల్లని తల వెండ్రుకలు కలవాడు. శంఖంవంటి తొడలు గలవాడు. వెడద రొమ్మువాడు. మూడు ముడతలతో శోభిల్లే నడుము కలవాడు. బలిసిన పిరుదులు గలవాడు. సుడిగుండం వలె లోతైన పొక్కిలి కలవాడు. బంగారు స్తంభాలవంటి తొడలు గలవాడు. అరుణకాంతులు గల చరణాలు కలవాడు. నిగనిగ మెరిసే క్రొత్త పట్టుబట్టను ఉత్తరీయంగా ధరించినవాడు. అన్ని చోట్లా పేరెన్నిక గన్నవాడు.