పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని రాజ్యపాలన

  •  
  •  
  •  

4-564.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్కుఁ గల్గిన ప్రజ కెల్ల దండధరునిఁ
బోలి వర్తించుచును గొంతకా మరుగఁ
విలి యొకనాడు దీర్ఘసత్త్రంబు చేయ
ర్థిఁ గైకొని దీక్షితుం య్యె; నందు.

టీకా:

రంగత్ = నాట్యమాడుతున్న; ఉత్తుంగ = ఎత్తైన; తరంగ = అలలుగల; గంగా = గంగానది; యమునా = యమునానది; మధ్యము = నడుమప్రదేశము; అందున్ = లో; ఉన్నతిన్ = అతిశయముతో; వసించి = ఉండి; కైకొని = పూని; ప్రారబ్ధకర్మ = ప్రారంభమైనకర్మఫలము; క్షయ = క్షీణింపచేయుట; అర్థము = కోసము; ఐ = అయ్యి; అఖిల = సమస్తమైన; పుణ్యంబులన్ = పుణ్యములను; అనుభవించుచునున్ = అనుభవిస్తూ; సర్వ = అన్ని; దేశంబులనున్ = దేశములను; తన = తన యొక్క; ఆఙ్ఞ = ఆఙ్ఞ; అప్రతిహతము = ఎదురులేని; సత్ = మంచి; ప్రతాపమునన్ = శౌర్యము; చెల్లన్ = చెల్లునట్లు; పూని = పూని; సర్వ = అఖిల; ద్వీపముల్ = ద్వీపముల; కున్ = కు; తాన్ = తాను; ఒక్కండ = ఒకడే యయ్యి; వైష్ణవ = వైష్ణవులైన; భూసుర = బ్రాహ్మణ; ఆవళి = సమాజము; కిన్ = కి; తక్క = తప్పించి; తక్కున్ = ఇంకా; కల్గిన = ఉన్నట్టి;
ప్రజ = జనుల; కిన్ = కి; ఎల్లన్ = అందరకి; దండధరుని = యముని; పోలి = వలె; వర్తించుచును = నడుస్తూ; కొంత = కొంత; కాలమున్ = కాలము; అరుగన్ = జరుగగా; తవిలి = పూని; ఒక = ఒక; నాడు = దినమున; దీర్ఘ = చిరకాలముజరిగెడి; సత్రంబున్ = యాగమును; చేయన్ = చేయవలెనని; అర్థిన్ = కోరి; కైకొని = చేపట్టి; దీక్షితుండు = దీక్షవహించినవాడు; అయ్యెన్ = అయ్యెను; అందున్ = దానిలో.

భావము:

ఉత్తుంగ తరంగాలు పొంగి పొరలే గంగా యమునా నదుల మధ్యప్రదేశంలో మహోన్నత స్థానంలో విరాజిల్లాడు. పురాకృత సుకృతం వల్ల సంప్రాప్తమైన భోగభాగ్యాలను అనుభవించాడు. అడ్డులేని ప్రతాపంతో అన్ని ప్రదేశాలలో తన ఆజ్ఞ చెల్లించుకుంటూ బ్రాహ్మణులకు, విష్ణుభక్తులకు తప్ప దుండగు లందరికీ దండధరుడై సప్తద్వీప పరీతమైన రాజ్యాన్ని పాలించాడు. ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఒకనాడు దీర్ఘసత్రమనే యాగం చేయాలని సంకల్పించి దీక్ష వహించాడు. ఆ దీర్ఘసత్రంలో…