పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : స్వాయంభువు వంశ విస్తారము

  •  
  •  
  •  

4-3.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నకు సంతాన విస్తరార్థంబు గాఁగఁ
బుత్రికాధర్మ మొంది యా పువ్వుఁబోఁడిఁ
బ్రకటమూర్తి రుచిప్రజాతికి నిచ్చె
నువు ముదమొంది శతరూప నుమతింప.

టీకా:

జననాథ = రాజ {జననాథుడు - జన (ప్రజల) కు నాథుడు (ప్రభువు), రాజు}; విను = వినుము; విదురున్ = విదురుని; కును = కి; మైత్రేయ = మైత్రేయుడను; ముని = ముని; నాథ = ముఖ్యులలో; చంద్రుడు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మరల = మరి; స్వాయంభువున్ = స్వాయంభువుని {స్వాయంభువుడు - స్వయంభువుని (తనంతతాను ఉద్భవించినవాని, బ్రహ్మదేవుని) పుత్రుడు}; కిన్ = కి; అర్థిన్ = కోరి; శతరూప = శతరూప; వలనను = యందు; కూతులు = పుత్రికలు; మువ్వురు = ముగ్గురు (3); ఆకూతి = ఆకూతి {ఆకూతి - కుతూహలము}; దేవహూతి = దేవహూతి; ప్రసూతులున్ = ప్రసూతులును; ఒనరన్ = పొందికగ; ప్రియవ్రత = ప్రియవ్రతుడు; ఉత్తానపాదులున్ = ఉత్తానపాదులును; అను = అనెడి; తనయ = కొడుకులు; యుగము = ఇద్దరు; జనియింప = పుట్టగ; అందు = వారిలో; అగ్ర = ముందు; సంభవ = పుట్టినామె; ఐన = అయినట్టి; ఆకూతిని = ఆకూతిని; సు = మంచి; మహిత = గొప్ప; భాతృమతినిన్ = సోదరులు కలదానిని; తన = తన; కున్ = కు;
సంతానవిస్తరార్థంబున్ = వంశవృద్ధి {సంతానవిస్తరార్థము - కుమా రులున్నను ఇంకను కుమారులు పొందుటకు}; కాఁగ = జరుగుటకు; పుత్రికాధర్మమున్ = పుత్రికాధర్మము {పుత్రికాధర్మము - ఈమె యందు జన్మించువాడు నా పుత్రుడు కాగలడు అను నియమముతో కన్యాదానము చేయుట}; ఒంది = స్వీకరించి; ఆ = ఆ; పువ్వుబోడిన్ = స్త్రీని; ప్రకటమూర్తి = ప్రసిద్ధుడగు; రుచి = రుచి అనెడి {రుచి - ప్రకాశము, వెలుగు}; ప్రజాపతి = ప్రజాపతి; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; మనువు = స్వాయంభువ మనువు; ముదము = సంతోషమును; ఒంది = కలిగి; శతరూప = శతరూప; అనుమతింప = అనుమతించగా.

భావము:

రాజా! విను. విదురునితో మైత్రేయ మునీశ్వరుడు మళ్ళీ ఇలా అన్నాడు. “స్వాయంభువ మనువునకు శతరూప అనే భార్యవల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో పెద్దదైన ఆకూతిని మనువు పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెండ్లి చేశాడు. ఆకూతికి సోదరులు ఉన్నప్పటికీ తన సంతానం విస్తరిల్లటంకోసం స్వాయంభువమనువు పుత్రికా ధర్మాన్ని పాటించాడు. అందుకు మనువు భార్య శతరూప ఆనందంతో అంగీకరించింది.