పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-562-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునినాథ; విను పృథు పాలచంద్రుండు-
సొబఁగొప్ప మేదినీసురులచేత
రాజ్యాభిషేక సంపూజ్యుఁడై దేవతా-
ముచే లబ్ధార్హ గుణుఁడు నగుచు
వైష్ణవతేజంబు లనొప్ప ధరియించి-
ర్థి నేయే కర్మ మాచరించె
ది నాకు నెఱిఁగింపు నఘాత్మ; భూమి యే-
రూఢి గవాకృతి రూఢ యెవని

4-562.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విక్రమోద్దీప్తమై యొప్పి వెలయునట్టి
ర్మమున నిప్డు రాజన్య ణము బ్రతుకు
ట్టి పృథుకీర్తి ధరలోన తి వివేకి
విలి యెవ్వఁడు వినకుండు న్యచరిత;

టీకా:

ముని = మునులలో; నాథుడు = శ్రేష్టుడు; విను = వినుము; పృథు = పృథువు అనెడి; జనపాల = రాజులలో; చంద్రుడు = చంద్రునివంటివాడు; సొబగు = సౌందర్యము; ఒప్పన్ = అతిశయించగ; మేదినీసురుల్ = బ్రాహ్మణుల {మేదినీసురులు - మేదిని (భూమి)కి సురులు, బ్రాహణులు}; చేతన్ = చేత; రాజ్యాభిషేక = పట్టాభిషేకముచేత; సంపూజ్యుడు = చక్కగగౌరవింపబడినవాడు; ఐ = అయ్యి; దేవతా = దేవతల; గణము = సమూహము; చేన్ = వలన; లబ్ద = పొందిన; అర్హ = తగిన; గుణుడు = ఫలితములుకలవాడు; అగుచున్ = అవుతూ; వైష్ణవ = వైష్ణవము యొక్క; తేజంబున్ = తేజస్సును; వలనొప్ప = తగినవిధముగ; ధరియించి = తాల్చి; అర్థిన్ = కోరి; ఏయే = ఏయే; కర్మమున్ = కర్మములను; ఆచరించెన్ = ఒనర్చెను; అది = అది; నాకున్ = నాకు; ఎఱిగింపుము = తెలుపుము; అనఘాత్మ = పుణ్యాత్మా; భూమి = భూదేవి; ఏ = ఏ; రూఢిన్ = విధముగ; గవ = గోవు; ఆకృతిన్ = రూపముతో; రూఢన్ = స్థిరపడి; ఎవని = ఎవని.
విక్రమ = పరాక్రమముచే; ఉద్దీప్తము = ప్రకాశించెడిది; ఐ = అయ్యి; ఒప్పి = చక్కనై; వెలయున్ = విలసిల్లెడిది; అట్టి = అయినట్టి; కర్మమునన్ = కర్మములతో; ఇప్డు = ఇప్పుడు; రాజన్య = రాజుల; గణము = సమూహము; బ్రతుకు = బతుకుతున్నదో; అట్టి = అటువంటి; పృథు = గొప్ప; కీర్తి = కీర్తిని; ధర = భూప్రపంచము; లోనన్ = లో; అతి = మిక్కిలి; వివేకి = వివేకముకలవాడు; తవిలి = కోరి; ఎవ్వడున్ = ఎవడు; వినకుండు = వినకుండావుండును; ధన్య = సార్థకమైన; చరిత = నడవడికకలవాడ.

భావము:

“మునీంద్రా! విను. బ్రాహ్మణుల చేత మహారాజుగా పట్టాభిషిక్తుడై దేవతల వల్ల యోగ్యమైన వరాలను పొంది వైష్ణవతేజంతో విరాజిల్లుతున్న పృథుచక్రవర్తి చేసిన పనులను నాకు వివరించి చెప్పు. గోరూపం ధరించిన భూదేవి నుండి కోరికలను పిదికిన పృథువు పరాక్రమోపేతమైన అనుగ్రహాన్ని ఆధారంగా చేసికొని కదా ఇప్పుడు రాజులు బ్రతుకుతున్నారు! అటువంటి పృథు చక్రవర్తి కీర్తి గాథలను వివేకి అయినవాడు ఎవ్వడూ వినకుండా ఉండలేడు.”