పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-561-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లెఱింగించి వెండియు నిట్లనియె "నివ్విధంబున నశేష గుణ విజృంభితంబును, నిర్దోషంబును, సత్పురుష సత్కృతంబును నగు పృథుచక్రవర్తి యశంబును బ్రకటంబుగాఁ జేయంజాలు మైత్రేయునిం జూచి మహా భాగవతుం డైన విదురుం డిట్లనియె.

టీకా:

అట్లు = ఆ విధముగ; ఎఱింగించి = తెలిపి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; ఇవిధంబునన్ = ఈ విధముగ; అశేష = సమస్తమైన; గుణ = సుగుణములచేత; విజృంభితంబును = విజృంభించినది; నిర్దోషంబును = దోషములు లేనిది; సత్పురుష = మంచివారిచేత; సత్కృతంబునున్ = మన్ననలను పొందినది; అగు = అయిన; పృథుచక్రవర్తి = పృథుచక్రవర్తి యొక్క; యశంబును = కీర్తిని; ప్రకటంబుగాన్ = ప్రసిద్దమగునట్లు; చేయంజాలు = చేయగలిగిన; మైత్రేయున్ = మైత్రేయుని; చూచి = చూసి; మహా = గొప్ప; భాగవతుండు = భాగవతుడు; ఐన = అయిన; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఆ విధంగా చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు “ఈ విధంగా అనంత గుణవంతం, నిర్దోషం, సజ్జన సంస్తుతం అయిన పృథు చక్రవర్తి కీర్తిని వెల్లడింపగలిగిన మహనీయుణ్ణి మైత్రేయుణ్ణి చూచి విష్ణు భక్తుడైన విదురుడు ఇలా అన్నాడు.