పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-557-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధ చారణ సు ముని గంధర్వ-
కిన్నర పితృ సాధ్య న్నగులును
ఖిల జనంబులు రిపార్శ్వవర్తులు-
నానంద మగ్నాంగు గుచు; వేడ్క
జ్ఞేశ చింతనుం డైన యా పృథువుచే-
త్కారములఁ బొంది; మ్మదమునఁ
నిరి నిజాధివాములకు; భగవంతుఁ-
డైన నారాయణుం చ్యుతుండు

4-557.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ నుపాధ్యాయ సహితుఁడై నరు పృథుని
విలమతు లయి చూచుచు రవరులు
న్ను జయజయ కలిత శబ్దములఁ బొగడఁ
నియె నప్పుడు వైకుంఠ దనమునకు.

టీకా:

నర = నరులు; సిద్ధ = సిద్దుల; చారణ = చారణులు; సుర = దేవతలు; ముని = మునులు; గంధర్వ = గంధర్వులు; కిన్నర = కిన్నరలు; పితృ = పితరులు; సాధ్య = సాధ్యులు; పన్నగులునున్ = నాగులు; అఖిల = సమస్తమైన; జనంబులున్ = వారు; హరి = విష్ణుమూర్తి; పార్శ్వవర్తులున్ = అనుచరులు {పార్శ్వవర్తులు - పక్కన నడచెడివారు, అనుచరులు}; ఆనంద = ఆనందమున; మగ్న = మునిగిన; అంగులు = దేహములుకలవారు; అగుచున్ = అవుతూ; వేడ్కన్ = కుతూహలముతో; యజ్ఞేశ = నారాయణుని {యజ్ఞేశుడు - యాగములకు ఈశుడు (ప్రభువు), విష్ణువు}; చింతనుండు = ధ్యానించెడివాడు; ఐన = అయిన; ఆ = ఆ; పృథువు = పృథుచక్రవర్తి; చేన్ = చేత; సత్కారంబులన్ = సత్కారములను; పొంది = పొంది; సమ్మదమునన్ = సంతోషముతో; చనిరి = వెళ్ళిరి; నిజ = తమ; అధివాసముల్ = నివాసముల; కున్ = కు; భగవంతుడు = హరి; ఐన = అయిన; నారాయణుండు = హరి; అచ్యుతుండున్ = హరి; తగన్ = తగినట్లు; ఉపాధ్యాయ = ఉపాధ్యాయులతో {ఉపాధ్యాయుడు - వేదమును చదివించువాడు}; సహితుడు = కూడినవాడు; ఐ = అయ్యి.
తనరు = అతిశయించెడి; పృథుని = పృథుచక్రవర్తిని; విమల = నిర్మలమైన; మతులు = మనసులుకలవారు; అయి = అయ్యి; చూచుచున్ = చూస్తూ; అమర = దేవతా {అమరులు - మరణములేనివారు, దేవతలు}; వరులు = ఉత్తములు; తన్ను = తనను; జయజయ = జయజయ యనెడి శబ్దములుతో; కలిత = కూడిన; శబ్దములన్ = మాటలతో; పొగడన్ = పొగుడుతుండగా; చనియెన్ = వెళ్ళెను; అప్పుడు = అప్పుడు; వైకుంఠ = వైకుఠము యనెడి; సదనమున్ = పురమున; కున్ = కు.

భావము:

నరులు, సిద్ధులు, అారణులు, దేవతలు, మునులు, గంధర్వులు, కిన్నరులు, పితృదేవతలు, సాధ్యులు, పన్నగులు, విష్ణుకింకరులు అందరూ విష్ణుభక్తుడైన పృథుచక్రవర్తి చేసిన సత్కారాలను అందుకొని సంతోషంతో తమ తమ నివాసాలకు వెళ్ళారు. ఋత్విక్కులతో కూడిన పృథుచక్రవర్తిని ఆనందంగా అవలోకిస్తూ దేవతలందరూ తనను జయజయ ధ్వనులతో స్తుతిస్తూ ఉండగా శ్రీహరి వైకుంఠానికి వేంచేశాడు.