పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-549-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“వదా! యీశ్వర! నిను స
త్పురుషుఁడు దేహాభిమాన భోగములకు నై
మెట్లు గోరు నిహసుఖ
ములు నారకుల కైన ఱలవె చెపుమా.

టీకా:

వరదా = వరముల నిచ్చెడివాడ; ఈశ్వర = ప్రభువా; నినున్ = నిన్ను; సత్ = మంచి; పురుషుడు = వాడు; దేహ = దేహముమీది; అభిమాన = మమకారములు; భోగముల్ = భోగములు; కున్ = కోసము; ఐ = అయ్యి; వరమున్ = వరమును; ఎట్లు = ఏ విధముగ; కోరున్ = కోరును; ఇహ = ఈ లోకపు; సుఖ = సౌఖ్యములు; వరములు = ప్రియమైన కోరికలు; నారకుల్ = నరకము నుండెడివారి; కిన్ = కి; ఐనన్ = అయినా; వఱలవె = తీరవా ఏమి; చెపుమా = చెప్పు.

భావము:

“వరదుడవైన ఓ విష్ణుదేవా! సత్పురుషుడైనవాడు దేహాభిమానులు కోరుకునే సుఖాలను ఆశించి నిన్ను వరం ఇమ్మని ఎలా వేడుకుంటాడు? పరమ పాతకులకు సైతం ఈ సుఖాలు లభిస్తాయి కదా!