పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

 •  
 •  
 •  

4-501-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగా-
ర్థించి తమ యింద్రియంబు లందు
నంచితచ్ఛందోమక్షీరమును దేవ-
లు సురరాజు వత్సంబు గాఁగఁ
నక పాత్రము నందుఁ నరు నోజోబల-
వీర్యామృతంబునై వెలయు పయసు
దైత్య దానవులు దైత్యశ్రేష్ఠుఁ డగు గుణ-
శాలిఁ బ్రహ్లాదు వత్సంబుఁ జేసి

4-501.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న సురాసవ రూప దుగ్ధంబు వరుస
ప్సరోజన గంధర్వు లరి యపుడు
ర విశ్వావసువు వత్సమునుగఁ జేసి
ద్మమయ నిర్మితంబైన పాత్రమందు

టీకా:

బలసి = కూడి; ఋషుల్ = ఋషులు; బృహస్పతి = బృహస్పతిని; వత్సకంబున్ = దూడగా; అర్థించి = కోరి; తమ = తమ యొక్క; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; అందున్ = లో; అంచిత = అందమైన; ఛందస్ = ఛందస్సుతో; మయ = నిండిన; క్షీరమున్ = పాలను; దేవతలున్ = దేవతలు; సురరాజున్ = ఇంద్రుని {సురరాజు - సుర (దేవతల)కి రాజు, ఇంద్రుడు}; వత్సంబున్ = దూడ; కాగన్ = అగునట్లు; కనక = బంగారపు; పాత్రమున్ = పాత్ర; అందున్ = లో; ఒజస్ = తేజస్సు; బల = శక్తి; వీర్య = వీర్యము యనురూపమైన; అమృతంబున్ = అమృతము; ఐ = అయ్యి; వెలయు = ప్రసిద్ధమగు; పయసున్ = పాలను; దైత్య = దితిసంతానమైన; దానవులున్ = రాక్షసులు; దైత్య = రాక్షసులలో; శ్రేష్ఠుడు = ఉత్తముడు; అగు = అయిన; గుణ = సుగుణములుకల; శాలిన్ = స్వభావముకలవాడు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; వత్సంబున్ = దూడగా; చేసి = చేసికొని.
ఘన = గొప్ప; సుర = పెద్ద; ఆసవ = మకరందపు, కల్లు; రూప = రూపముకల; దుగ్దంబున్ = పాలను; వరుసన్ = వరుసగా; అప్సరః = అప్సరలుయైన; జన = వారు; గంధర్వులు = గంధర్వులు; అలరి = సంతోషించి; అపుడున్ = అప్పుడు; తనరన్ = అతిశయముతో; విశ్వావసువున్ = విశ్వావసువును; వత్సమునుగన్ = దూడగా; చేసి = చేసి; పద్మ = పద్మముల; మయ = తోనిండుగ; నిర్మితంబున్ = తయారచేయబడినది; ఐన = అయిన; పాత్రమున్ = పాత్ర; అందున్ = లో.

భావము:

ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని, దేవతలు ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్య దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా చేసికొని ఇనుపపాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని, అప్సరసలు గంధర్వులు విశ్వావసువును దూడగా చేసుకొని పద్మమయమైన పాత్రలో…