పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-500-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువును దూడఁ జేసి గరిమన్ నిజపాణితలంబు లీల దో
ముగఁ జేసి యందు సకలౌషధులం బిదికెం గ్రమంబునం
రఁగఁ దద్విధంబునను త్పృథు వత్సలయైన భూమియం
యము వారువారును బ్రియంబగు కోర్కులు వొంది రున్నతిన్.

టీకా:

మనువునున్ = మనువుని; దూడన్ = దూడగా; చేసి = చేసికొని; గరిమన్ = గొప్పగా; నిజ = తన యొక్క; పాణితలంబున్ = అరచేతిని; లీలన్ = లీలగా; దోహనమున్ = పాలు పితికెడి పాత్రగా; చేసి = చేసి; అందున్ = దానిలో; సకల = సమస్తమైన; ఔషధులనున్ = ధాన్యాదులను; పిదికెదన్ = పితికెను; క్రమంబునన్ = క్రమముగా; తనరన్ = విలసిల్లునట్లుగ; తత్ = ఆ; విధంబుననున్ = విధముగ; తత్ = ఆ; పృథు = పృథుచక్రవర్తిచే; వత్సల = వాత్సల్యము పొందినది; ఐన = అయిన; భూమి = భూదేవి; అందున్ = నుండి; అనయమున్ = అవశ్యము; వారువారునున్ = వారందరును; ప్రియంబున్ = ఇష్టము; అగు = అయిన; కోర్కులున్ = కోరికలను; ఒందిరిన్ = పొందిరి; ఉన్నతిన్ = అభివృద్దితో, ఔన్నత్యముతో.

భావము:

పృథు చక్రవర్తి మనువును గోవత్సంగాను, తన చేతిని పాత్రగాను చేసి తాను దోగ్ధయై భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా అతనిపై వాత్సల్యం కలిగిన గోరూప ధారియైన భూమినుండి ఇతరులు కూడా తమ కోరికలను తీర్చుకున్నారు.