పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-492-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహగర్భుచేత మును చాల సృజింపఁగఁబడ్డ యోషధుల్
లుషమతిన్ ధృతవ్రతులుగాని యసజ్జనభుజ్యమానమై
వెయుటఁ జూచి యే నృపతివీరులు మాన్పమిఁ జోరబాధలన్
లుమఱుఁ బొంది యే నపరిపాలితనై కృశియించి వెండియున్.

టీకా:

జలరుహగర్భు = బ్రహ్మదేవునిచే {జలరుహగర్భుడు - జలరుహము (నీట పుట్టినది, పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; మును = పూర్వము; చాలన్ = మిక్కిలిగ; సృజింపగబడ్డ = సృష్టింపబడిన; ఓషధుల్ = ధాన్యములు; కలుష = పాపపు; మతిన్ = బుద్ధితో; ధృతవ్రతులు = దీక్ష కలవారు; కాని = కానట్టి; అసజ్జన = దుర్జనములచే; భుజ్యమానమున్ = అనుభవింపబడినవి; ఐ = అయ్యి; వెలయుటన్ = ప్రసిద్దమగుటను; చూచి = చూసి; ఏ = ఎట్టి; నృపతి = రాజులు; వీరులున్ = శూరులును; మాన్పమిన్ = మానిపించకపోవుటచే; చోర = దొంగల; బాధలన్ = బాధలను; పలుమఱు = అనేకమార్లు; పొంది = పొంది; ఏన్ = నేను; అపరిపాలితను = పరిపాలించెడివారు లేని దానను; ఐ = అయ్యి; కృశియించి = చిక్కిపోయి; వెండియున్ = ఇంకను.

భావము:

"పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన ఓషధులను కలుషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు భుజించటం చూసి కూడా రాజులు వారిని అడ్డగింపలేదు. అందువల్ల నేను పెక్కుసార్లు దొంగల బాధకు గురియై రక్షణ లేనిదాననై క్రుంగి కృశించిపోయాను.