పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-490-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివయ్య! తత్త్వదర్శనులైన యట్టి స-
న్మునులచే నైహికాముష్మికంబు
లైన ఫలప్రాప్తి ర్థిఁ గృష్యాద్యగ్ని-
హోత్రాద్యుపాయంబు లుర్విమీఁద
దృష్టంబులును నాచరితములు నగుచుఁ దా-
నెనయఁదగు నుపాయ మెవ్వఁ డాచ
రించును వాఁడు ప్రాపించుఁ ద త్ఫలమును-
విద్వాంసుఁ డైనను వెలయ దీని

4-490.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదరింపక తనయంత నాచరించె
నేని నాయాసమే యగుఁ గాని తత్ఫ
మును బొందఁడు బహుళకామునకైన
వినుతగుణశీల! మాటలు వేయునేల?

టీకా:

విను = వినుము; అయ్య = తండ్రి; తత్త్వదర్శనులు = తత్త్వజ్ఞానముకలవారు; సత్ = మంచి; మునుల్ = మునుల; చేన్ = చేత; ఐహిక = ఇహలోకపు; ఆముష్మికంబులు = పరలోకపువి; ఐన = అయిన; = ఫల = ఫలములను; ప్రాప్తి = పొందుట; కిన్ = కై; అర్థిన్ = పూని; కృషి = వ్యవసాయము; ఆది = మొదలగునవి; అగ్నిహోత్ర = నిప్పు; ఆది = మొదలగునవి; ఉపాయంబులున్ = ఉపాయములను; ఉర్వి = భూమి; మీదన్ = పైన; = దృష్టంబులునున్ = నిరూపించబడినవానిలో; ఆచరితంబులున్ = ఆచరింపతగినవి; అగుచున్ = అవుతూ; తాన్ = తను; ఎనయన్ = ఎన్నుకొన; తగున్ = తగినట్టి; ఉపాయమున్ = ఉపాయమును; ఎవ్వడున్ = ఎవరైతే; ఆచరించున్ = ఉపయోగించునో; = వాడున్ = వాడు; ప్రాపించున్ = పొందును; తత్ = ఆ; ఫలమున్ = ప్రయోజనమును; విద్వాంసుడు = పండితుడు; ఐననున్ = అయినప్పటికిని; వెలయన్ = ప్రసిద్ధముగ; దీనిన్ = దీనిని; ఆదరింపక = లక్ష్యపెట్టక.
తనయంతన్ = తనంతతానే; ఆచరించెనేనిన్ = ఆచరించినచో; ఆయాసమే = శ్రమమాత్రమే; అగున్ = అగును; కాని = కాని; తత్ = దాని; ఫలమున్ = ఫలితమును; పొందడు = పొందడు; బహుళ = చిర; కాలమున్ = కాలమున; కిన్ = కి; ఐనన్ = అయినను; వినుత = స్తుతింపబడిన; గుణ = సుగుణములుకల; శీల = స్వభావముకలవాడు; మాటలు = మాటలు, వర్ణనలు; వేయున్ = వెయ్యి (1000), వేయుట; ఏలన్ = ఎందులకు.

భావము:

ఇంకా విను. తత్త్వదర్శనులైన మునులు ఇహపరలలో పురుషులకు ఫలం చేకూర్చే కృషిని, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను అనుష్ఠించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఉపాయాలను లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంత పండితుడైనా అతనికి ఆయాసమే తప్ప ఫలం సిద్ధించదు. వెయ్యి మాటలెందుకు? ఎంతకాలం గడచినా వాని స్థితి అంతే!”