పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : భూమిని బితుకుట

  •  
  •  
  •  

4-467-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మి నిమిత్తమై భూమి గోరూపిణి-
య్యె? దానికి వత్స య్యె నెద్ది?
గొనకొని దోహనమునకు నర్హంబైన-
పాత్ర మెయ్యది? దలఁపంగ దోగ్ధ
యైన యా పృథువే పదార్థముల్ పిదికెను?-
రికింప నవని స్వభావమునను
విషమమై యుండియు వెలయంగ నే రీతి-
మగతిఁ జెందెను జంభవైరి?

4-467.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రతుహయంబును గొనిపోవఁ గార్య మెద్ది?
ధీనిధి యైన బ్రహ్మకుమారు వలనఁ
లిత విజ్ఞానుఁ డగుచు నే తినిఁ బొందె?
నఘచారిత్ర! మైత్రేయ! దియుఁగాక.

టీకా:

ఏమి = ఏమి; నిమిత్తము = కారణము; ఐ = వలన; భూమి = భూదేవి; గో = గోవు, ఆవు; రూపిణి = రూపముధరించినది; అయ్యెన్ = అయినది; దాని = దాని; కిన్ = కి; వత్సము = దూడ; అయ్యెన్ = అయినది; ఎద్ది = ఏది; కొనకొని = పూని; దోహనమున్ = పాలుపితుకుట; కున్ = కు; అర్హంబున్ = తగినది; ఐన = అయిన; పాత్రము = గిన్నె; ఎయ్యది = ఏది; తలపంగన్ = పరిశీలించిచూసిన; దోగ్ద = పితికెడివాడు; ఐన = అయిన; ఆ = ఆ; పృథువు = పృథువు; ఏ = ఏఏ; పదార్థముల్ = వస్తువులను; పిదికెను = పితికెను; పరికింపన్ = పరిశీలించిచూసిన; అవని = భూమి; స్వభావమునను = సహజ స్వభావము ప్రకారము; విషమము = ఎగుడుదిగుడైనది; ఐ = అయ్యి; ఉండియున్ = ఉండినప్పటకిని; వెలయంగన్ = ప్రసన్నమగునట్లు; ఏరీతిన్ = ఏవిధముగ; సమగతిన్ = ఎగుడుదిగుడులులేనివిధమును; చెందెను = చెందినది; జంభవైరి = ఇంద్రుడు {జంభవైరి - జంభాసురునికి శత్రువు, ఇంద్రుడు}.
క్రతు = యాగ; హయంబున్ = అశ్వమును; కొనిపోవన్ = తీసుపోవలసిన; కార్యము = పని, కారణము; ఎద్ది = ఏమి; ధీరనిధి = బుద్ధిబలమునకునిధివంటివాడు; ఐన = అయిన; బ్రహ్మకుమారు = సనత్కుమారుని {బ్రహ్మకుమారుడు - బ్రహ్మదేవుని పుత్రుడు, సనత్కుమారుడు}; వలనన్ = నుండి; కలిత = పొందిన; విజ్ఞానుడు = విజ్ఞానము కలవాడు; అగుచున్ = అవుతూ; ఏగతిన్ = ఎటువంటి సుగతిని; పొందెన్ = పొందెను; అనఘచారిత్ర = పుణ్యవర్తనుడా; మైత్రేయ = మైత్రేయడా; అదియున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

“పుణ్యచరిత్రా! మైత్రేయా! భూమి ఎందుకు గోరూపం ధరించింది? దానికి ఏది దూడ అయింది? పిదుకుటకు తగిన పాత్ర ఏది? దోగ్ధయైన పృథుచక్రవర్తి ఏ పదార్థాలను పిదికాడు? భూమి సహజంగా మిట్ట పల్లాలతో విషమంగా ఉంటుంది కదా! అది సమరూపాన్ని ఎలా పొందింది? ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని ఎందుకు దొంగిలించాడు? అంతేకాక సనత్కుమారుని వల్ల విజ్ఞానాన్ని పొందిన పృథువు ఎటువంటి సుగతిని పొందాడు?

4-468-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియుఁ; బరబ్రహ్మంబును, భగవంతుండును, బుణ్యశ్రవణ కీర్తనుండును, సర్వనియామకుండును నగు కృష్ణుని యవతారాంతరాశ్రయం బగు దివ్యకథలను భగవంతుం డైన పుండరీకాక్షుండు పృథ్వవతారంబు ధరియించి గోరూపిణి యగు పృథివిం బిదికినది మొదలగు కథ లన్నియు నీకు నథోక్షజునకు దాసుండ నయిన నాకు నెఱింగింపు;” మనిన వాసుదేవ కథా సంప్రీత చేతస్కుం డగు విదురుం బ్రశంసించి మైత్రేయుం డిట్లనియె “నట్లు బ్రాహ్మణ జనంబులచేత రాజ్యంబు నందభిషిక్తుం డగుచు సకలప్రజాపాలన నియుక్తుండై పృథువు రాజ్యంబు చేయుచుండు నంత నీరస యగు ధరిత్రియం దన్నరహితు లగుచుం బ్రజలు క్షుత్పీడాక్షీణ దేహులై వైన్యునిం జూచి యిట్లనిరి.

టీకా:

మఱియున్ = ఇంకను; పరబ్రహ్మంబునున్ = కృష్ణుని {పరబ్రహ్మంబు – పరబ్రహ్మ స్వరూపుడు, కృష్ణుడు}; భగవంతుడునున్ = కృష్ణుని {భగవంతుడు - మహిమాన్వితుడు, కృష్ణుడు}; పుణ్యశ్రవణకీర్తనుండును = కృష్ణుని {పుణ్య శ్రవణ కీర్తనుండు - పుణ్యవంతమై వినదగ్గ కీర్తనలు కలవాడు, కృష్ణుడు}; సర్వనియామకుండునున్ = కృష్ణుని {సర్వ నియామకుండును - సర్వులను నియమించువాడు, కృష్ణుడు}; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని; అవతార = అవతారము; అంతర = అందులో; ఆశ్రయంబున్ = ఆధారము కలవి; అగు = అయిన; దివ్య = దివ్యమైన; కథలను = కథలను; భగవంతుండునున్ = విష్ణువు {భగవంతుడు - వీర్యవంతుడు, విష్ణువు}; ఐన = అయిన; పుండరీకాక్షుండు = విష్ణువు {పుండరీకాక్షుడు - పుండరీకము (పద్మము)లవంటి కన్నులు కలవాడు, విష్ణువు}; పృథు = పృథునిగా; అవతారంబున్ = అవతారమును; ధరియించి = తాల్చి; గో = గోవు, ఆవు; రూపిణి = రూపము ధరించినది; అగు = అయిన; పృథివిన్ = భూమిని; పిదికినది = పితుకుట; మొదలగు = మొదలైన; కథలు = కథలు; అన్నియున్ = అన్నిటిని; నీకున్ = నీకు; అథోక్షజున్ = విష్ణుమూర్తి; కున్ = కిని; దాసుండన్ = సేవకుడను; అయిన = అయిన; నాకున్ = నాకు; ఎఱింగింపుము = తెలుపుము; అనినన్ = అనగా; వాసుదేవ = విష్ణుమూర్తి; కథా = కథలచే; సంప్రీత = మిక్కిలి కూర్మి గల; చేతస్కుండు = చిత్తము కలవాడు; అగు = అయిన; విదురున్ = విదురుని; ప్రశంసించి = పొగిడి; మైత్రేయుండు = మైత్రేయుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆవిధముగ; బ్రాహ్మణ = బ్రాహ్మణులైన; జనంబుల్ = వారి; చేతన్ = చేత; రాజ్యంబున్ = రాజ్యమును ఏలుట; అందున్ = కొరకు; అభిషిక్తుండు = పట్టము కట్టబడినవాడు; అగుచున్ = అగుచూ; సకల = సమస్తమైన; ప్రజా = ప్రజలను; పాలన = పాలించుట యందు; నియుక్తుండు = నియమింపబడినవాడు; ఐ = అయ్యి; పృథువు = పృథువు; రాజ్యంబున్ = రాజ్యపాలన; చేయుచుండున్ = చేస్తున్న; అంతన్ = సమయములో; నీరస = సారము లేనిది; అగు = అయిన; ధరిత్రిన్ = భూమి; అందున్ = వలన; అన్న = అన్నము, ఆహారము; రహితులున్ = లేనివారు; అగుచున్ = అవుతూ; ప్రజలు = జనులు; క్షుత్ = ఆకలిచే కలిగిన; పీడా = బాధవలన; క్షీణ = క్షీణించిన; దేహులు = శరీరములు కలవారు; ఐ = అయ్యి; వైన్యునిన్ = పృథుచక్రవర్తిని {వైన్యుడు - వేనుని పుత్రుడు, పృథువు}; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

పరబ్రహ్మ స్వరూపుడు, పుణ్య శ్రవణ కీర్తనుడు, సర్వేశ్వరుడు, భగవంతుడైన కృష్ణుని ఇతర అవతార పుణ్యకథలను, పుండరీకాక్షుడు పృథుచక్రవర్తి అవతారాన్ని ధరించి గోరూపాన్ని పొందిన భూమిని పిదకడం మొదలైన కథల నన్నింటిని నీవు, విష్ణుదేవునకు భక్తుడనైన నాకు వివరంగా చెప్పు’’ అని విదురుడు ప్రశ్నించాడు. వాసుదేవుని కథలయందు ఆసక్తి కల విదురుని కొనియాడుతూ మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు. “ఆ విధంగా బ్రాహ్మణుల చేత పట్టాభిషిక్తుడై ప్రజాపరిపాలనా కార్యంలో నియుక్తుడైన పృథుచక్రవర్తి రాజ్యం చేస్తుండగా సారహీనమైన భూమినుండి అన్నం లభింపక పోవడం చేత ఆకలి బాధతో ప్రజలు కృశించిపోయి పృథుచక్రవర్తి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు.

4-469-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అయఁగ నేము బుభుక్షా
రిపీడం బడితి మయ్య! పై కొని తరు కో
జనిత వహ్నిచేతను
రికొను వృక్షములుఁ బోలె రణీనాథా!

టీకా:

అరయగన్ = పరికించినచో; ఏము = మేము; బుబుక్షా = ఆకలిచేత; పరి = మిక్కిలి; పీడంబడితిమి = బాధింపబడితిమి; అయ్య = తండ్రీ; పైకొని = పూనుకొని; తరు = చెట్టు; కోటరన్ = తొఱ్ఱలో; జనిత = పుట్టిన; వహ్ని = నిప్పు; చేతనున్ = వలన; దరికొను = కాలిపోవు; వృక్షములున్ = చెట్లు; పొలెన్ = వలె; ధరణీనాథా = రాజా {ధరణీనాథుడు - ధరణి (భూమి)కి నాథుడు, రాజు}.

భావము:

“రాజా! చెట్టు తొఱ్ఱలో పుట్టిన అగ్నిచేత దహింపబడే చెట్టువలె మేము ఆకలితో బాధపడుతున్నాము.

4-470-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణ శరణ్యుఁడ వగు నిను
ణము వేఁడెదము; మాకు త్కృప నన్నం
సి కృపచేసి ప్రోవుము
నాయక!” యనుచుఁ బ్రజలు తులై పలుకన్.

టీకా:

శరణ = రక్షణ కోరెడివారికి; శరణ్యుడవు = అభయము నిచ్చెడి వాడవు; అగు = అయిన; నినున్ = నిన్ను; శరణము = రక్షణము; వేడెదము = కోరుతున్నాము; మాకున్ = మాకు; సత్ = మంచి; కృపన్ = దయతో; అన్నంబున్ = ఆహారము దొరకు ఉపాయము; అరసి = విచారించి; కృపన్ = దయతో; చేసి = చూపి; ప్రోవుము = కాపాడుము; నరనాయక = రాజ {నర నాయకుడు - నరుల (మానవుల)కు నాయకుడు, రాజు}; అనుచున్ = అంటూ; ప్రజలు = జనులు; నతులు = వినయముతో వంగినవారు; ఐ = అయ్యి; పలుకన్ = ప్రార్థించగా.

భావము:

రక్షణ కోరేవారికి అభయమిచ్చే నిన్ను శరణు వేడుకుంటున్నాము. రాజా! దయతో మాకు అన్నం పెట్టి రక్షించు’’ అని వినయంతో వంగి నమస్కరించి ప్రార్థించగా…

4-471-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విని దానికి సదుపాయము
నాయకుఁ డాత్మఁ దలఁచి క్రోధుండై
నువున బాణముఁ దొడిగెను
రౌద్రుండైన త్రిపుర స్మరు పగిదిన్.

టీకా:

విని = విని; దానిన్ = దాని; కిన్ = కి; సదుపాయమున్ = సౌకర్యమును {సదుపాయము -సత్ (మంచి) ఉపాయము (ఏర్పాటు, ఉపాయము) సౌకర్యము}; జననాయకుడు = రాజు; ఆత్మన్ = మనసున; తలచి = ఆలోచించుకొని; సక్రోధుండు = కోపము కలవాడు; ఐ = అయ్యి; ధనువునన్ = వింటికి; బాణమున్ = బాణమును; తొడిగెను = సంధించెను; ఘన = బహు మిక్కిలి; రౌద్రుండు = రౌద్రము కలవాడు; ఐన = అయిన; త్రిపురఘస్మరున్ = శివుని {త్రిపుర ఘస్మరుడు - త్రిపురములను భస్మము చేసినవాడు, శివుడు}; పగిదిన్ = వలె.

భావము:

పృథుచక్రవర్తి వారి దీనాలాపాలను విని దానికి తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. వెంటనే త్రిపుర సంహారకుడైన శివుని వలె రౌద్రమూర్తియై వింట బాణాన్ని సంధించాడు.

4-472-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దొడిగిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; తోడగినన్ = సంధించగా.

భావము:

ఈ విధంగా బాణాన్ని సంధించినట్టి…

4-473-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హిపతి నప్పుడు గనుఁగొని
హి గోరూపమునఁ గంప్యమానయు నగుచున్
గుకుం డగు లుబ్దకుఁ గని
నంబునఁ బాఱు హరిణికైవడిఁ బాఱెన్.

టీకా:

మహిపతిన్ = రాజును {మహిపతి - మహి (భూమి)కి పతి, రాజు}; అప్పుడు = అప్పుడు; కనుగొని = చూసి; మహి = భూదేవి; గో = గోవు, ఆవు; రూపమునన్ = రూపములో; కంప్యమానయున్ = వణికిపోవుచున్నది; అగుచున్ = అవుతూ; కుహకుండు = కపటవృత్తి గలవాడు; అగు = అయిన; లుబ్దకున్ = వేటగానినన్; కని = చూసి; గహనంబునన్ = అడవిలోనికి; పాఱున్ = పారిపోవు; హరిణిన్ = లేడి; కైవడిన్ = వలె; పాఱెన్ = పరుగెత్తెను.

భావము:

పృథుచక్రవర్తిని చూచి భూమి గోరూపాన్ని ధరించి వణికిపోతూ కుటిలుడైన వేటగానిని చూచి అడవిలోనికి పారిపోయే లేడివలె పరుగెత్తింధి.

4-474-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ధరణి పాఱిన నతండు కుపితారుణేక్షణుండై వెంటం దగిలి దిక్కులను విదిక్కులను భూభాగ నభోభాగంబుల నెక్కడఁ జనియె, నక్కడికి వెనుదగిలి యుద్యతాయుధుండై చనుచుండ నవ్వైన్యునిం గని మృత్యుగ్రస్తులగు ప్రజల చందంబున ననన్యశరణ్యయై యతిభయంబునం బరితప్యమానహృదయ యగుచు “వైన్యా! ధర్మవత్సలుండవును, నాపన్నరక్షకుండవును, మహాత్ముండవును, సకలప్రాణి పరిపాలనావస్థితుండవును నయిన నీ వీ దీనయుం బాపరహితయుం గామినియు నగు నన్ను వధియింపం బూని యేల వెనుదగులుచున్న వాఁడవు? ధర్మతత్త్వం బెఱుంగువారు సతీజనంబులు గృతాపరాధ లైనం దీనవత్సలతం జేసి వధింప" రని పలికి మఱియు నా ధరణీదేవి పృథుచక్రవర్తి కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ధరణి = భూదేవి; పాఱినన్ = పరుగెట్టగా; అతండు = అతడు; కుపిత = కోపముచే; అరుణ = ఎఱ్ఱబడ్డ; ఈక్షణుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; వెంటందగిలి = వెన్నంటి; దిక్కులను = దిక్కులకి; విదిక్కులను = మూలలకి; భూభాగ = భూమ్మీది ప్రదేశములు; నభోభాగంబులన్ = ఆకాశమందలి ప్రదేశములలోనికి; ఎక్కడన్ = ఎక్కడకు; చనియెన్ = వెళ్ళితే; అక్కడన్ = ఆ ప్రదేశమున; కిన్ = కు; వెనుదగిలి = వెన్నంటి; ఉద్యత్ = ఎత్తిపట్టిన; ఆయుధుండు = ఆయుధము కలవాడు; ఐ = అయ్యి; చనుచుండన్ = వెళుతుండగా; ఆ = ఆ; వైన్యునిన్ = పృథుచక్రవర్తిని; కని = చూసి; మృత్యు = మరణము; గ్రస్తులు = కమ్మిన, చే పట్టుకొనబడిన; ప్రజలన్ = జనులు; చందంబునన్ = వలె; అనన్యశరణ్య = శరణ జొచ్చుట కింకొకరు లేనిది; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; భయంబునన్ = భయముచేత; పరి = మిక్కిలి; తప్యమాన = తాపముచెందిన; హృదయ = హృదయము కలది; అగుచున్ = అవుతూ; వైన్యా = పృథుచక్రవర్తి; ధర్మ = ధర్మము యెడల; వత్సలుండవునున్ = వాత్సల్యము కలవాడవు {వాత్సల్యము - వత్స (సంతానము) ఎడల నుండెడి లాంటి కూర్మి}; ఆపన్న = ఆపద చెందిన వానిని; రక్షకుండవునున్ = రక్షించెడివాడవును; మహాత్ముండవునున్ = గొప్ప ఆత్మ కలవాడవును; సకల = సమస్తమైన; ప్రాణి = జీవుల; పరిపాలనా = పరిపాలించుటయందు; అవస్థితుండవు = నియమితుడవు; అయిన = అయిన; నీవున్ = నీవు; ఈ = ఈ; దీనయున్ = దీనురాలను; పాప = పాపము; రహితయున్ = లేనిదానను; కామినియున్ = ఆడదానిని; అగు = అయిన; నన్నున్ = నన్ను; వధియింపన్ = సంహరించెడి; పూని = నిశ్ఛయముతో; ఏలన్ = ఎందులకు; వెనుదగులుచున్ = వెన్నంటుతూ; ఉన్నవాడవు = ఉన్నావు; ధర్మ = ధర్మము యొక్క; తత్త్వంబున్ = లక్షణమును; ఎఱుంగువారు = తెలిసినవారు; సతీజనంబులున్ = ఆడువారిని; కృత = చేసిన; అపరాధలన్ = తప్పులు చేసినవారు; ఐనన్ = అయినప్పటికిని; దీన = దీనుల యెడ చూపెడి; వత్సలతన్ = వాత్సల్యము; చేసి = వలన; వధింపరు = సంహరించరు; అని = అని; పలికి = పలికి; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; ధరణీదేవి = భూదేవి; పృథుచక్రవర్తి = పృథువు; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా గోరూపాన్ని ధరించి భూమి పరుగెత్తగా పృథుచక్రవర్తి కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో దానిని వెంబడించాడు. అది దశదిశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపట్టి దానిని వెంటాడాడు. అప్పుడు మరొక దిక్కు లేక మృత్యువుకు భయపడే ప్రజల వలె భయపడుతూ పరితపిస్తూ భూదేవి పృథువుతో ఇలా అన్నది. “వేనపుత్రా! నీవు ధర్మం తెలిసినవాడవు. ఆపదలో నున్న వారిని ఆదుకొనేవాడవు. మహానుభావుడవు. సకల ప్రాణులను రక్షించడానికి నియమింపబడినవాడవు. అటువంటి నీవు ఆడదాననైన నన్ను చంపడానికి ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కు లేనిదాన్ని. ఏ తప్పూ చేయనిదాన్ని. నావెంట ఎందుకు పడ్డావు? ధర్మరహస్యం తెలిసినవాళ్ళు స్త్రీలు తప్పు చేసినా దీనవాత్సల్యంతో చంపరుకదా!” అని చెప్పి భూదేవి పృథుచక్రవర్తితో మళ్ళీ ఇలా అన్నది.

4-475-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“జనాథచంద్ర! యీ భూ
కోటికి యాన పాత్ర దృశస్థితితో
దృఢశరీర యగు నే
యము నాధారభూత గుచుఁ జరింతున్.

టీకా:

జననాథ = రాజులలో; చంద్ర = చంద్రునివంటివాడ; ఈ = ఈ; భూజన = మానవ; కోటి = సమూహమున; కిన్ = కు; యానపాత్ర = నౌకవంటి; సదృశ = సమానమైన; స్థితిన్ = పరిస్థితి; తోన్ = కలిగి; ఘన = బహుమిక్కిలి; దృఢ = గట్టిదియైన; శరీర = దేహము కలదానను; అగు = అయిన; నేన్ = నేను; అనయమున్ = ఎల్లప్పుడును; ఆధారభూతమున్ = ఆధారముగ ఉండెడిదానను; అగుచున్ = అవుతూ; చరింతున్ = వర్తింతును;

భావము:

“రాజచంద్రా! నేను మిక్కిలి దృఢశరీరం కలిగి సమస్త భూజనులకు నావ వలె ఎప్పుడూ ఆధారభూతనై ఉంటాను.

4-476-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి నన్నుఁ గృపామతి యెడలి యిటు వి
పాటనము చేసి త్రుంచెదు? ప్రజలు నీట
మునుఁగకుండంగ నే రీతి ఘచరిత!
రసి రక్షింతు” వన నతం వని కనియె.

టీకా:

ఇట్టి = ఇటువంటి; నన్నున్ = నన్ను; కృపా = దయగల; మతిన్ = మనసు; ఎడలి = వదలి; ఇటు = ఈ విధముగ; విపాటనము = చీల్చుట; చేసి = చేసి; త్రుంచెదవు = చెండాడెదవు; ప్రజలున్ = జనులను; నీటన్ = నీటిలో; మునుగకుండగన్ = మునిగిపోకుండా; ఏరీతిన్ = ఏ విధముగ; అనఘచరిత్ర = పుణ్యవర్తన; అరసి = పరికించి; రక్షింతువు = కాపాడెదవు; అనన్ = అనగా; అతండు = అతడు; అవని = భూదేవి; కిన్ = కి; అనియెన్ = పలికెను.

భావము:

ఇటువంటి నన్ను దయమాలి ఖండఖండాలు చేసి చంపుతానంటున్నావు. పుణ్యచరిత్రా! నామీద ఉన్న ప్రజలను నీటిలో మునిగిపోకుండా ఎలా కాపాడుతావు?” అని భూదేవి పలుకగా రాజు ఇలా అన్నాడు.

4-477-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ధరిత్రీ! మదీయాజ్ఞోల్లంఘనంబు చేయుచున్న దాన; వదియునుం గాక, నీవు యజ్ఞంబు లందు హవిర్భాగంబుల ననుభవించుచు ధాన్యాదికంబుల విస్తరింపం జేయక గోరూపంబు ధరియించి యనయంబుఁ దృణభక్షణంబు చేయుచుఁ బాలం బిదుకక నీ యంద యడంచికొంటివి; నీ యందున్న యోషధీ బీజంబులు బ్రహ్మచేతం బూర్వంబునందె కల్పింపంబడిన యవి; వానిని నీ దేహంబునంద యడంచికొని యిప్పు డీయక మూఢహృదయవు, మందమతివియు నై యపరాధంబు చేసిన దురాత్మురాల వగు; నిను నా బాణంబులచే జర్జరీ భూతశరీరం జేసి వధియించి నీ మేని మాంసంబునం జేసి క్షుద్బాధితులు దీనులు నగు నీ ప్రజల యార్తి నివారించెద; నీవు కామిని నంటివి; స్త్రీ పురుష నపుంసకులలో నెవ్వరేని భూతదయ లేక స్వమాత్ర పోషకు లగుచు నిరనుక్రోశంబుగ భూతద్రోహులై వర్తింతురు; వారిని రాజులు వధించినన్ వధంబు గాదు; గాన దానఁ బాపంబు వొరయదు; నీవు కామిని వైనను దుర్మదవు స్తబ్దవు నగుచు మాయాగోరూపంబునం బాఱిపోవుచున్న నిన్నుఁ దిలలంతల ఖండంబులు చేసి నా యోగమహిమం బ్రాణికోటి నుద్ధరించెద;"నని పలికి రోషభీషణాకారంబు ధరియించి దండధరుని వడువున వర్తించు పృథునిం జూచి వడంకుచు మేదిని ప్రాంజలియై యిట్లని నుతియింపం దొడంగె.

టీకా:

ధరిత్రీ = భూదేవీ; మదీయ = నా యొక్క; ఆజ్ఞన్ = ఆజ్ఞను; ఉల్లంఘనంబున్ = దాటుట; చేయుచున్ = చేస్తూ; ఉన్నదానవు = ఉన్నావు; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; నీవున్ = నీవు; యజ్ఞముల్ = యజ్ఞముల; అందున్ = లో; హవిర్భాగంబులన్ = హవిస్సు నందలి భాగమును; అనుభవించుచున్ = అనుభవిస్తూ; ధాన్య = ధాన్యములు; ఆదికంబులున్ = మొదలైనవానిని; విస్తరింపన్ = పెరుగునట్లు; చేయక = చేయకుండా; గో = గోవు యొక్క; రూపంబున్ = రూపమును; ధరియించి = తాల్చి; అనయంబున్ = ఎల్లప్పుడును; తృణ = గడ్డిని; భక్షణంబున్ = తినుటలు; చేయుచున్ = చేస్తూ; పాలన్ = పాలను; పితుకక = ఇయ్యకుండగ; నీ = నీ; అందన్ = లోనే; అణచికొంటివి = అణచేసుకొన్నావు; నీ = నీ; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; ఓషధీ = ధాన్యముల; బీజంబులున్ = విత్తనములు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = వలన; పూర్వంబున్ = పూర్వకాలము; అందె = లోనే; కల్పింపబడినయవి = సృష్టింపబడినవి; వానిని = వాటిని; నీ = నీ; దేహంబున్ = దేహము; అందన్ = లోనే; అడంచికొని = అణచేసుకొని; ఇప్పుడు = ఇప్పుడు; ఈయక = ఇవ్వకుండగ; మూఢ = మూర్ఖపు; హృదయవున్ = హృదయము కలదానవు; మందమతియున్ = తెలివితక్కువదానివి; ఐ = అయ్యి; అపరాధంబున్ = అపరాధము; చేసిన = చేసినట్టి; దురాత్మురాలవు = దుష్ట స్వభావము కలదానవు; అగు = అయిన; నినున్ = నిన్ను; నా = నా యొక్క; బాణంబుల్ = బాణముల; చేన్ = తో; జర్జరీభూత = ముక్కలు ముక్క లయిన; శరీరన్ = దేహము కల దానిని; చేసి = చేసి; వధియించి = సంహరించి; నీ = నీ; మేని = శరీర మందలి; మాసంబునన్ = మాంసము; చేసి = వలన; క్షుత్ = ఆకలిచే; బాధితులున్ = బాధపడుతున్నవారు; దీనులున్ = దీనులును; అగున్ = అయిన; ఈ = ఈ; ప్రజల = జనుల యొక్క; ఆర్తిన్ = బాధను; నివారించెదన్ = పోగొట్టెదను; నీవున్ = నీవు; కామినిన్ = స్త్రీని; అంటివి = అన్నావు; స్త్రీ = స్త్రీలు; పురుష = పురుషులు; నపుంసకుల = నపుంసకులు; లోనన్ = లోను; ఎవ్వరేని = ఎవరైనాసరే; భూత = జీవుల యెడ; దయ = కృప; లేక = లేకుండగ; స్వమాత్ర = తనకు మాత్రమే; పోషకులు = పోషించుకొనెడివారు; అగుచున్ = అవుతూ; నిరనుక్రోశంబుగన్ = జాలి లేకుండగ; భూత = జీవుల యెడ; ద్రోహులు = అన్యాయము చేయువారు; ఐ = అయ్యి; వర్తింతురు = తిరిగెదరో; వారినిన్ = వారిని; రాజులు = రాజులు; వధించినన్ = సంహరించినను; వధంబున్ = సంహారము; కాదు = కాదు; కాన = కావున; దానన్ = దానివలన; పాపంబున్ = పాపము; ఒరయదు = పొరయదు, కలుగదు; నీవున్ = నీవు; కామినివి = స్త్రీవి; ఐననున్ = అయినప్పటికిని; దుర్ = చెడ్డ; మదవు = గర్వము కలదానవు; స్తబ్దవు = చేష్టా రహితవు; అగుచున్ = అవుతూ; మాయా = మాయ; గో = గోవు యొక్క; రూపంబునన్ = రూపములో; పాఱిపోవుచున్న = పారిపోతున్న; నిన్నున్ = నిన్ను; తిలలు = నువ్వుగింజలు; అంతల = అంతేసి; ఖండంబులున్ = ముక్కలుగ; చేసి = చేసి; నా = నా యొక్క; యోగ = యోగము యొక్క; మహిమన్ = గొప్పదనముతో; ప్రాణి = జీవ; కోటిన్ = జాలమును; ఉద్దరించెదను = కాపాడెదను; అని = అని; పలికి = పలికి; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆకారంబున్ = ఆకారము; ధరియించి = తాల్చి; దండధరునిన్ = యముని; వడువునన్ = వలె; వర్తించు = ప్రవర్తించెడి; పృథునిన్ = పృథుచక్రవర్తిని; చూచి = చూసి; వడంకుచున్ = వణికిపోతూ; మేదిని = భూదేవి; ప్రాంజలి = అంజలి ఘటించినది; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అని = అని; నుతియింపన్ = స్తుతింప; తొడంగెన్ = మొదలిడెను.

భావము:

“ఓ భూదేవీ! నీవు నా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. అంతేకాదు, యజ్ఞాలలో హవిర్భాగాలను అందుకొంటూ ధాన్యం మొదలైన వానిని పెంపొందింపకుండా ఉన్నావు. గోరూపం ధరించి తృణభక్షణం చేస్తూ పాలు ఇవ్వకుండా నీలోనే దాచి ఉంచుకున్నావు. పూర్వం బ్రహ్మదేవుడు నీలో సృజించిన ఓషధీ బీజాలను నీ దేహమందే అణచి పెట్టుకొని వెలుపలకు వెలుపలకు రానీయకుండా ఉన్నావు. నీవు మూర్ఖురాలవు. మందబుద్ధివి. ఈ విధంగా తప్పు చేసిన నీ శరీరాన్ని నా బాణాలతో తూట్లు పొడిచి నిన్ను వధిస్తాను. నీ మాంసంతో ఆకలితో మలమల మాడుతున్న ఈ ప్రజల ఆర్తిని తొలగిస్తాను. స్త్రీ వధ దోషం కదా అని అన్నావు. స్త్రీ పురుష నపుంసకులలో భూతదయ లేకుండా తమ పొట్టలు మాత్రమే నింపుకొనే ఎవ్వరినైనా సరే రాజులు చంపవచ్చు. అది వధ కాదు. కాబట్టి దానివల్ల పాపం రాదు. నీవు స్త్రీవైనా గర్వాంధురాలవై కొయ్యబారి ఉన్నావు. మాయా గోరూపం ధరించి పారిపోతున్న నిన్ను నువ్వుగింజలంత ముక్కలుగా నరికి నా యోగప్రభావంతో జీవులను రక్షిస్తాను’’ అంటూ యమునివలె రోష భీషణాకారుడైన పృథుచక్రవర్తిని చూసి భూమి వణికిపోతూ దోసిలి ఒగ్గి ఈ విధంగా ప్రార్థింపసాగింది.

4-478-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ఓనాథ! పరమపురుషుఁడ
వై నిజమాయా గుణంబు లందిన కతనన్
నానావిధ దేహములం
బూనుదు సగుణండ వగుచు బుధనుతచరితా!

టీకా:

ఓ = ఓ; నాథ = ప్రభువ; పరమపురుషుడవు = విష్ణుమూర్తివి {పరమపురుషుడు - అత్యుత్తమ పురుషుడు, నారాయణుడు}; ఐ = అయ్యి; నిజ = స్వంత; మాయా = మాయ యొక్క; గుణంబుల్ = లక్షణములను; అందినన్ = చెందిన; కతనన్ = కారణముచేత; నానా = అనేక; విధ = రకముల; దేహములన్ = దేహములను; పూనుదు = ధరించెదవు; సగుణుండవు = గుణములతో కూడిన వాడవు; అగుచున్ = అవుతూ; బుధ = జ్ఞానులచే; నుత = కీర్తింపబడెడి; చరితా = నడవడిక కలవాడ.

భావము:

“ఓ భూపతీ! నీవు సాక్షాత్తుగా భగవంతుడవు. స్వకీయమైన మాయాగుణం చేత నానావిధాలైన శరీరాలను ధరించి సగుణుడవుగా కనిపిస్తావు. నీ చరిత్ర సంస్తవనీయమైనది.

4-479-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి నీవు.

టీకా:

అట్టి = అటువంటి; నీవున్ = నీవు.

భావము:

అటువంటి నీవు…

4-480-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను సకల జీవతతికిని
మును నీ వాధారభూతముగ నిర్మింపన్
విను నా యందుఁ జతుర్విధ
భూతవిసర్గ మర్థిఁ గైకొన వలసెన్.

టీకా:

ననున్ = నన్ను; సకల = సమస్తమైన; జీవ = ప్రాణి; తతి = సమూహమున; కిన్ = కిని; మును = పూర్వము; నీవ = నీవే; ఆధారభూతముగన్ = ఆధారమైనదిగా; నిర్మింపన్ = సృష్టింపగా; విను = వినుము; నా = నా; అందున్ = అందు; చతుః = నాలుగు {చతుర్విధ భూత సృష్టి – 1 అండజములు – గ్రుడ్డు నుండి పుట్టునవి, పక్షులు, పాములు మున్నగునవి; 2 స్వేదజములు స్వేదముల (ఉక్క మొదలగునవి) వలన కలుగునవి పురుగులు మున్నగునవి; 4 ఉద్భిజములు – నేలను పగుల్చుకుని పొడమునవి, చెట్లు, తీగెలు మొ. 4 జరాయుజములు – (తల్లి గర్భకోశము నందలి) మావి నుండి జనించునవి, జంతువులు, మానవులు ము.}; విధ = రకముల; ఘన = గొప్ప; భూత = జీవజాలము; విసర్గమున్ = సృష్టిని; అర్థిన్ = కోరి; కైకొనవలసెన్ = చేపట్టవలసి వచ్చినది.

భావము:

నన్ను సకల ప్రాణికోటికి ఆధారంగా పూర్వం సృజించావు. అందువల్లనే నేను నానావిధాలైన ప్రాణికోటిని భరిస్తున్నాను.

4-481-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్లయి యుండ.

టీకా:

అట్లు = ఆవిధముగ; అయి = అయ్యి; ఉండన్ = ఉండగా.

భావము:

అది అలా ఉండగా…

4-482-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నుద్యతాయుధుఁడవై
నుజేంద్ర! వధింపఁ బూని సలెదు; నీకం
టెను నన్యుని నెవ్వని నే
ముగ శరణంబు జొత్తుఁ రుణాభరణా!

టీకా:

ననున్ = నన్ను; ఉద్యత్ = ఎత్తబడిన; ఆయుధవుండవు = ఆయుధము ధరించినవాడవు; ఐ = అయ్యి; మనుజేంద్ర = రాజా {మనుజేంద్రుడు - మనుజులకు ప్రభువు, రాజు}; వధింపన్ = సంహరింప; పూని = పూనుకొని; మసలెదు = తిరిగెదవు; నీ = నీ; కంటెన్ = కంటే; అన్యునిన్ = ఇతరుని; ఎవ్వని = ఎవరిని; నేన్ = నేను; ఘనముగ = గొప్పగ; శరణంబున్ = రక్షించమని; చొత్తున్ = వేడెదను; కరుణాభరణా = దయని ఆభరణముగకలవాడ.

భావము:

రాజా! నన్ను నీవే ఆయుధమెత్తి చంపడానికి పూనుకున్నావు. కరుణాసముద్రా! ఇంక నేను ఎవరిని శరణు వేడుకొనాలి?

4-483-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

అంతే కాక…

4-484-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! స్వకీయంబునై యతర్కితమునై-
హిమ నొప్పిన భవన్మాయచేత
కల చరాచర ర్గంబు నిర్మించి-
ర్మార్థపరుఁడవై నరు దీశ!
నీవిక్రమము నవనీరజలోచన!-
కల లోకులకు దుర్జయము; దలఁపఁ
గు నట్టి నీవు స్వతంత్రుఁడ వగుటను-
బ్రహ్మఁ బుట్టించి యా బ్రహ్మచేత

4-484.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కల జగములఁ జేయింతు మతఁ బేర్చి;
యేక మయ్యు మహాత్మ! యనేక విధము
గుచు వెలుగొందు చుందు వీ ఖిలమందుఁ
జారుతరమూర్తి! యో! పృథుక్రవర్తి!

టీకా:

అనఘ = పుణ్యుడ; స్వకీయంబున్ = తనది; ఐ = అయ్యి; అతర్కితము = తర్కమునకందనిది; ఐ = అయ్యి; మహిమన్ = గొప్పదనముతో; ఒప్పిన = ఒప్పుతున్న; భవత్ = నీ యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; సకల = సమస్తమైన; చర = చలనముకలిగిన; అచర = చలనములేని; సర్గంబున్ = సృష్టిని; నిర్మించి = సృష్టించి; ధర్మ = ధర్మము; అర్థ = రక్షించెడి; పరుడవు = దీక్షకలవాడవు; ఐ = అయ్యి; తనరుదు = విలసిల్లెదవు; ఈశ = ప్రభువ; నీ = నీ యొక్క; విక్రమమున్ = పరాక్రమము; నవనీరజలోచన = తాజాపద్మములవంటి కన్నులుకలవాడ; సకల = సమస్తమైన; లోకుల్ = ప్రజల; కున్ = కు; దుర్జయమున్ = జయింపరానిది; తలపన్ = అనుకొనుటకు; తగున్ = తగిన; అట్టి = అటువంటి; నీవున్ = నీవు; స్వతంత్రుడవు = స్వతంత్రుడవు; అగుటనున్ = అగుటచేత; బ్రహ్మన్ = బ్రహ్మదేవుని; పుట్టించి = సృష్టించి; ఆ = ఆ; బ్రహ్మ = బ్రహ్మదేవుని; చేతన్ = చేత.
సకల = సమస్తమైన; జగములన్ = లోకములను; చేయింతు = సృష్టింపజేసెదవు; సమతన్ = మిక్కిలి; పేర్చి = అతిశయించి; ఏకము = ఒక్కడవే; అయ్యున్ = అయినప్పటికిని; మహాత్మ = గొప్పవాడ; అనేక = అనేకమైన; విధములున్ = విధములుగా; అగుచున్ = అవుతూ; వెలుగొందుచుందువు = ప్రకాశించెదవు; ఈ = ఈ; అఖిలము = సమస్తము; అందున్ = లోను; చారుతరమూర్తి = అత్యంతఅందమైనరూపముకలవాడ {చారు - చారుతర - చారుతమ}; ఓ = ఓ; పృథుచక్రవర్తి = పృథువు అనెడి చక్రవర్తి.

భావము:

ఓ పుణ్యపురుషా! ఊహింపరాని మహిమతో కూడిన నీ మాయచేత ఈ చరాచర ప్రపంచాన్ని సృజించావు. నీవు ధర్మరక్షకుడవు. కొత్త తామరల వంటి కన్నులు కల ఓ ప్రభూ! నీ మాయను లోకులెవ్వరూ జయింపలేరు. నీవు స్వతంత్రుడవు. బ్రహ్మను పుట్టించావు. ఆ బ్రహ్మచేత సకల లోకాలను సృజింప జేశావు. సౌందర్యమూర్తివైన ఓ పృథు చక్రవర్తీ! నీవు ఒక్కడవే అయినా పెక్కు విధాలుగా సమస్తమందూ వెలుగొందుతావు.

4-485-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు మహాభూతేంద్రియ కారక చేతనాహంకారంబులను శక్తులం జేసి యీ జగంబుల కుత్పత్తి స్థితి లయంబులఁ గావించుచు సముత్కట విరుద్ధ శక్తులు గల పురుషునకు నమస్కరించెద; నట్టి పరమ పురుషుండ వయిన నీవు నిజనిర్మితంబును భూతేంద్రియాంతఃకరణాత్మకంబును నైన యీ విశ్వంబు సంస్థాపింపం బూని.

టీకా:

మఱియున్ = ఇంకను; మహాభూత = పంచమహాభూతములు {పంచ మహా భూతములు - 1గగనము 2వాయువు 3తేజస్సు 4జలము 5భూమి}; ఇంద్రియ = పంచేంద్రియములు {పంచేంద్రియములు - పంచ జ్ఞానేంద్రియములు, 1కన్ను 2చెవులు 3ముక్కు 4నాలిక 5చర్మము}; కారక = పంచ కర్మేంద్రియములు {పంచకర్మేంద్రియములు - 1కాళ్ళు 2చేతులు 3నోరు 4గుదము 5మర్మావయవము}; చేతన = చిత్తము; అహంకారంబులు = అహంకారములు; అను = అనెడి; శక్తులున్ = శక్తుల; చేసి = వలన; ఈ = ఈ; జగంబుల్ = లోకముల; కున్ = కు; ఉత్పత్తిన్ = సృష్టి; స్థితిన్ = స్థితి; లయంబున్ = లయములను; కావించుచున్ = ఏర్పరుస్తూ; సమ = మిక్కిలి; ఉత్కటన్ = విజృంభించిన; విరుద్ధ = పరస్పర ఘర్షణ చెందెడి; శక్తులున్ = శక్తులు; కల = కలిగిన; పురుషున్ = పురుషుని; కున్ = కి; నమస్కరించెదన్ = నమస్కరించెదను; అట్టి = అటువంటి; పరమపురుషుడవు = నారాయణుడవు; అయిన = అయిన; నీవున్ = నీవు; నిజ = స్వంత; నిర్మితంబునున్ = సృష్టి యైన; భూత = పంచభూతములు; ఇంద్రియ = పంచేంద్రియములు; అంతఃకరణ = అంతఃకరణ; ఆత్మకంబు = కలిగినది; ఐన = అయిన; ఈ = ఈ; విశ్వంబున్ = జగము; సంస్థాపింపన్ = చక్కగా స్థాపించుటకు; పూని = పూనుకొని.

భావము:

ఇంకా మహాభూతాలు, ఇంద్రియాలు, బుద్ధి, అహంకార అనే శక్తుల చేత ఈ లోకాలను సృజించి, పెంచి, త్రుంచుతున్నవు. విరుద్ధాలైన శక్తులతో నిండి ఉండే నీకు నమస్కారం చేస్తున్నాను. అటువంటి భగవంతుడవైన నీచేత నిర్మింపబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకొని…

4-486-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివరాహంబవై యా రసాతల-
తనైన నన్ను నక్కటికతోడ
నుద్ధరించితి; వట్టి యుదకాగ్ర భాగంబు-
నం దర్థి నున్న నే నెఁడి నావ
యందున్న నిఖిల ప్రజావళి రక్షింపఁ-
గోరి యీ పృథురూపధారి వైతి;
ట్టి భూభరణుండ వైన నీ విపుడు ప-
యో నిమిత్తంబుగా నుగ్రచరుఁడ

4-486.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గుచు నన్ను వధించెద నుచు బుద్ధిఁ
లఁచుచున్నాఁడ; విది విచిత్రంబుగాదె?
విశ్వసంపాద్య! నిరవద్య! వేదవేద్య!
వ్యగుణసాంద్ర! వైన్య భూపాలచంద్ర!

టీకా:

ఆదివరాహంబవు = వరాహాతారుడవు; ఐ = అయ్యి; ఆ = ఆ; రసాతల = పాతాళమున; గత = ఉన్నది; ఐన = అయిన; నన్నున్ = నన్ను; అక్కటిక = జాలి; తోడన్ = తోటి; ఉద్ధరించితివి = కాపాడితివి; అట్టి = అటువంటి; ఉదక = నీటి; అగ్ర = పై; భాగంబున్ = భాగము; అందున్ = అందు; అర్థిన్ = కోరి; ఉన్న = ఉన్నట్టి; నేను = నేను; అనెడి = అనెడి; నావన్ = నౌక; అందున్ = అందు; ఉన్న = ఉన్నట్టి; నిఖిల = సమస్తమైన; ప్రజా = ప్రజల; ఆవళిన్ = సమూహమును; రక్షింపన్ = కాపాడవలెనని; కోరి = ఆకాక్షించి; ఈ = ఈ; పృథు = పృథుచక్రవర్తి; రూప = రూపమును; ధారివి = ధరించినవాడవు; ఐతి = అయితివి; భూ = భూమిని; భరణుండవు = భరించెడివాడవు; ఐన = అయిన; నీవున్ = నీవు; ఇపుడున్ = ఇప్పుడు; పయస్ = పాలు; నిమిత్తంబుగన్ = కొరకు; ఉగ్ర = భీకరముగ; చరుడవు = తిరుగుతున్నవాడవు; అగుచున్ = అవుతూ;
నన్నున్ = నన్ను; వధించెదన్ = సంహరించెదను; అనుచున్ = అంటూ; బుద్ధిన్ = మనసులో; తలచుచున్నాడవు = సంకల్పిస్తున్నావు; ఇది = ఇది; విచిత్రంబున్ = విచిత్రము; కాదె = కాదా, ఏమి; విశ్వసంపాద్య = విశ్వాధిపత్యమును సంపాదించిన వాడా; నిరవద్య = వంకపెట్టుటకులేనివాడా; వేదవేద్య = జ్ఞానముచేతెలియబడువాడా; భవ్యగుణసాంద్ర = దివ్యమైనగుణములుదట్టముగకలవాడా; వైన్య = వేనునిపుత్రుడైన (పృథువుఅనెడి); భూపాల = భూమిని పరిపాలించెడి రాజులలో; చంద్ర = చంద్రునివంటివాడా.

భావము:

ఆదివరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తి మహాజలాలపైన నావ వలె నన్ను నిలిపావు. నాపైన ప్రాణులను నిలిపావు. నాపై నున్న ప్రజలను రక్షించటం కోసం పృథు రూపాన్ని ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నీవు కేవల పాలకోసం నన్ను సంహరించాలని భావిస్తున్నావు. రాజచంద్రా! పుణ్యగుణ సాంద్రా! అనద్యుడవు, వేదవేద్యుడవు, విశ్వరక్షకుడవు అయిన నీకిది విచిత్రంగా లేదూ?

4-487-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీశ్వరగుణ సర్గరూపంబైన మాయచే మోహితాంతఃకరణుల మైన మా వంటి వారలచేత హరిభక్తుల చేష్టితం బెఱుంగఁబడదన్న హరి చేష్టితం బెట్లెఱుంగంబడు? నట్టి జితేంద్రియ యశస్కరు లయిన వారలకు నమస్కరింతు” ననుచు నివ్విధంబునం గోపప్రస్ఫురితాధరుం డైన పృథుని నభినుతించి ధైర్యం బవలంబించి వెండియు నిట్లనియె.

టీకా:

కావునన్ = అందుచేత; ఈశ్వర = భగవంతుని; గుణ = గుణముల; సర్గ = స్వభావముల, సృష్టించెడి; రూపంబునన్ = స్వరూపము; ఐన = అయిన; మాయ = మాయ; చేన్ = చేత; మోహిత = మోహములోపడిన; అంతఃకరణులము = అంతకరణములు కలవారము; ఐన = అయిన; మా = మా; వంటి = వంటి; వారల = వారి; చేతన్ = చేత; హరి = విష్ణుని; భక్తుల = భక్తులు; చేష్టితంబున్ = చేసెడి పని; ఎఱుంగబడదు = తెలిసికొన లేనిది; అన్నన్ = అనినచో; హరి = విష్ణుమూర్తి; చేష్టితంబున్ = చేసెడిపని; ఎట్లు = ఏ విధముగ; ఎఱుంగంబడు = తెలిసికొనబడును; అట్టి = అటువంటి; జిత్ = జయించిన; ఇంద్రియ = ఇంద్రియములు కల వారనెడి; యశస్ = ప్రసిద్ధి; కరులున్ = పొందినవారు; అయిన = అయిన; వారలన్ = వారి; కున్ = కి; నమస్కరింతున్ = నమస్కరించెదను; అనుచున్ = అంటూ; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కోప = రోషముచేత; ప్రస్పురిత = అదురుతున్న; అధరుండు = పెదవి కలవాడు; ఐన = అయిన; పృథునిన్ = పృథుచక్రవర్తిని; అభినుతించి = స్తోత్రముచేసి; ధైర్యంబున్ = ధైర్యమును; అవలంభించి = చేపట్టి; వెండియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

భగవంతుని మహిమోపేతమైన మాయచేత మోహం పొందిన మనస్సు కలిగిన మావంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవటం శక్యం కాదు. ఇక శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకొనగలం? అటువంటి యశోనిధులైన జితేంద్రియులకు, మహాత్ములకు మొక్కుతున్నాను” అని ఈ విధంగా కోపంతో పెదవులు అదురుతున్న పృథుచక్రవర్తిని సంస్తుతించి ధైర్యం తెచ్చుకొని భూమి మళ్ళీ ఇలా అన్నది.

4-488-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలాత్మ! నాకు నభయము
కూరెడు నట్లుగాఁగ న్మతి నీ క్రో
ము నుపశమించి కరుణిం
పుము; నా విన్నపము వినుము పురుషనిధానా!

టీకా:

విమలాత్మ = నిర్మలమైన ఆత్మకలవాడ; నాకున్ = నాకు; అభయమున్ = శరణము; సమకూరెడున్ = కలుగెడి; అట్లుగాగ = విధముగ; సత్ = మంచి; మతిన్ = మనసుతో; నీ = నీ యొక్క; క్రోధమున్ = కోపమును; ఉపశమించి = శాంతింపజేసి; కరుణింపుము = కాపాడుము; నా = నా యొక్క; విన్నపమున్ = విజ్ఞాపనను; వినుము = వినుము; పురుష = పౌరుషమునకు; నిధానా = నిధియైనవాడ.

భావము:

“నిర్మలమైన మనస్సు కల ఓ రాజా! గొప్ప పౌరుషము కలవాడ! నాకు అభయం ప్రసాధించు. ఆగ్రహాన్ని చాలించు. నన్ను మన్నించి దయతో నా విన్నపం ఆలించు.

4-489-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విరులు గందకుండఁగ
సగతిం బూవుఁదేనెఁ విగొను నిందిం
దివిభు కైవడి బుధుఁడగు
పురుషుఁడు సారాంశ మాత్మఁబూని గ్రహించున్.

టీకా:

ధరన్ = ప్రపంచములో; విరులున్ = పూవులు; కందకుండగ = కందిపోకుండా; సరస = సున్నితమైన; గతిన్ = విధముగ; పూవుదేనెన్ = మకరందమును; చవిగొనున్ = తాగెడి; ఇందిందిరవిభున్ = గండుతుమ్మెద; కైవడిన్ = వలె; బుధుడు = జ్ఞాని; అగు = అయిన; పురుషుడు = మానవుడు; సారాంశమున్ = అవసరమైనదానిని; ఆత్మన్ = మనసున; పూని = పూనుకొని; గ్రహించున్ = సంపాదించుకొనును.

భావము:

పువ్వులు కందకుండా లోపలి తేనెను మృదువుగా తాగే తేనెటీగ మాదిరి సుజ్ఞాని దేనిని నొప్పించకుండా సారాంశాన్ని, కావలసిన దానిని నేర్పుగా గ్రహిస్తాడు.
క్రోధంతో కాదు ఉపాయంగా కావలసినవి సాధించాలి అంటు పృథు చక్రవర్తితో భూదేవి చెప్తోంది

4-490-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వివయ్య! తత్త్వదర్శనులైన యట్టి స-
న్మునులచే నైహికాముష్మికంబు
లైన ఫలప్రాప్తి ర్థిఁ గృష్యాద్యగ్ని-
హోత్రాద్యుపాయంబు లుర్విమీఁద
దృష్టంబులును నాచరితములు నగుచుఁ దా-
నెనయఁదగు నుపాయ మెవ్వఁ డాచ
రించును వాఁడు ప్రాపించుఁ ద త్ఫలమును-
విద్వాంసుఁ డైనను వెలయ దీని

4-490.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాదరింపక తనయంత నాచరించె
నేని నాయాసమే యగుఁ గాని తత్ఫ
మును బొందఁడు బహుళకామునకైన
వినుతగుణశీల! మాటలు వేయునేల?

టీకా:

విను = వినుము; అయ్య = తండ్రి; తత్త్వదర్శనులు = తత్త్వజ్ఞానముకలవారు; సత్ = మంచి; మునుల్ = మునుల; చేన్ = చేత; ఐహిక = ఇహలోకపు; ఆముష్మికంబులు = పరలోకపువి; ఐన = అయిన; = ఫల = ఫలములను; ప్రాప్తి = పొందుట; కిన్ = కై; అర్థిన్ = పూని; కృషి = వ్యవసాయము; ఆది = మొదలగునవి; అగ్నిహోత్ర = నిప్పు; ఆది = మొదలగునవి; ఉపాయంబులున్ = ఉపాయములను; ఉర్వి = భూమి; మీదన్ = పైన; = దృష్టంబులునున్ = నిరూపించబడినవానిలో; ఆచరితంబులున్ = ఆచరింపతగినవి; అగుచున్ = అవుతూ; తాన్ = తను; ఎనయన్ = ఎన్నుకొన; తగున్ = తగినట్టి; ఉపాయమున్ = ఉపాయమును; ఎవ్వడున్ = ఎవరైతే; ఆచరించున్ = ఉపయోగించునో; = వాడున్ = వాడు; ప్రాపించున్ = పొందును; తత్ = ఆ; ఫలమున్ = ప్రయోజనమును; విద్వాంసుడు = పండితుడు; ఐననున్ = అయినప్పటికిని; వెలయన్ = ప్రసిద్ధముగ; దీనిన్ = దీనిని; ఆదరింపక = లక్ష్యపెట్టక.
తనయంతన్ = తనంతతానే; ఆచరించెనేనిన్ = ఆచరించినచో; ఆయాసమే = శ్రమమాత్రమే; అగున్ = అగును; కాని = కాని; తత్ = దాని; ఫలమున్ = ఫలితమును; పొందడు = పొందడు; బహుళ = చిర; కాలమున్ = కాలమున; కిన్ = కి; ఐనన్ = అయినను; వినుత = స్తుతింపబడిన; గుణ = సుగుణములుకల; శీల = స్వభావముకలవాడు; మాటలు = మాటలు, వర్ణనలు; వేయున్ = వెయ్యి (1000), వేయుట; ఏలన్ = ఎందులకు.

భావము:

ఇంకా విను. తత్త్వదర్శనులైన మునులు ఇహపరలలో పురుషులకు ఫలం చేకూర్చే కృషిని, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలను దర్శించి ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలను అనుష్ఠించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఉపాయాలను లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంత పండితుడైనా అతనికి ఆయాసమే తప్ప ఫలం సిద్ధించదు. వెయ్యి మాటలెందుకు? ఎంతకాలం గడచినా వాని స్థితి అంతే!”

4-491-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియు మహి యిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకనూ; మహి = భూదేవి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అని చెప్పి భూమి మళ్ళీ ఇలా అన్నది.

4-492-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుహగర్భుచేత మును చాల సృజింపఁగఁబడ్డ యోషధుల్
లుషమతిన్ ధృతవ్రతులుగాని యసజ్జనభుజ్యమానమై
వెయుటఁ జూచి యే నృపతివీరులు మాన్పమిఁ జోరబాధలన్
లుమఱుఁ బొంది యే నపరిపాలితనై కృశియించి వెండియున్.

టీకా:

జలరుహగర్భు = బ్రహ్మదేవునిచే {జలరుహగర్భుడు - జలరుహము (నీట పుట్టినది, పద్మము)న గర్భుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; మును = పూర్వము; చాలన్ = మిక్కిలిగ; సృజింపగబడ్డ = సృష్టింపబడిన; ఓషధుల్ = ధాన్యములు; కలుష = పాపపు; మతిన్ = బుద్ధితో; ధృతవ్రతులు = దీక్ష కలవారు; కాని = కానట్టి; అసజ్జన = దుర్జనములచే; భుజ్యమానమున్ = అనుభవింపబడినవి; ఐ = అయ్యి; వెలయుటన్ = ప్రసిద్దమగుటను; చూచి = చూసి; ఏ = ఎట్టి; నృపతి = రాజులు; వీరులున్ = శూరులును; మాన్పమిన్ = మానిపించకపోవుటచే; చోర = దొంగల; బాధలన్ = బాధలను; పలుమఱు = అనేకమార్లు; పొంది = పొంది; ఏన్ = నేను; అపరిపాలితను = పరిపాలించెడివారు లేని దానను; ఐ = అయ్యి; కృశియించి = చిక్కిపోయి; వెండియున్ = ఇంకను.

భావము:

"పూర్వం బ్రహ్మదేవుడు సృష్టించిన ఓషధులను కలుషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు భుజించటం చూసి కూడా రాజులు వారిని అడ్డగింపలేదు. అందువల్ల నేను పెక్కుసార్లు దొంగల బాధకు గురియై రక్షణ లేనిదాననై క్రుంగి కృశించిపోయాను.

4-493-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమ మఖకర్మక్రియ
యము లేకుంట నే ననాదృత నగుచున్
నాయక! యీ లోకము
చోరీభూత మగుటఁ నుఁగొని యంతన్.

టీకా:

అనుపమ = సాటిలేని; మఖకర్మ = యజ్ఞకర్మలు; క్రియలున్ = చేయుటలు; అనయమున్ = అవశ్యము; లేకుంటన్ = లేకపోవుటచేతను; నేన్ = నేను; అనాదృతన్ = ఆదరింపబడని దానను; అగుచున్ = అవుతూ; జననాయక = రాజా; ఈ = ఈ; లోకమున్ = లోకము; ఘన = పెద్ద; చోరీభూతము = దొంగిలింప బడుతున్నది, దొంగతనాలతో నిండినది; అగుటన్ = అగుటను; కనుగొని = చూసి; అంతన్ = అంతట.

భావము:

మహారాజా! సాటిలేని యజ్ఞకర్మలు లేకపోవడంతో నేను ఆదరాన్ని కోల్పోయాను. లోకమంతా దొంగలతో నిండిపోగా నేను చూచి…

4-494-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నాది సిద్ధి కొఱకై
విలి తదీయౌషధీ వితులను ధరణీ
! యే నపుడు గ్రసించితి
వియును నా యందు జీర్ణయ్యెఁ గడంకన్.

టీకా:

సవన = యాగము; ఆది = మొదలైనవి; సిద్ధి = ఫలించుటకు; కొఱకై = కోసమైన; తవిలి = పూని; తదీయ = ఆ యొక్క; ఓషధీ = ధాన్యముల; వితతులను = సమూహమును; ధరణీధవ = రాజా {ధరణీధవుడు - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు}; ఏన్ = నేను; అపుడున్ = అప్పుడు; గ్రసించితిన్ = మ్రింగితిని; అవియునున్ = అవి కూడ; నా = నా; అందున్ = లో; జీర్ణము = కలిసి; అయ్యెన్ = పోయినవి; కడంకన్ = చివరకు.

భావము:

యజ్ఞాలు మొదలైన సత్కర్మలకు ఉపయోగపడే ఆ ఓషధులను చోరులు దొంగిలించకుండా వాటిని మ్రింగినాను. రాజా! అవి నాలో జీర్ణమైపోయాయి.

4-495-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను వాని నొక యుపాయం
బునఁ గ్రమ్మఱఁ బడయవచ్చు భూవరచంద్రా!
విను మది యెఱిఁగించెద నీ
కును వత్సలురాల నగుట గురుతరచరితా!

టీకా:

విను = వినుము; వానిన్ = వాటిని; ఒక = ఒక; ఉపాయంబునన్ = ఉపాయముతో; క్రమ్మఱన్ = మరల; పడయన్ = పొంద; వచ్చును = వీలగును; భూవర = రాజులలో; చంద్ర = చంద్రుని వంటివాడ; వినుము = వినుము; అదిన్ = దానిని; ఎఱిగించెదన్ = తెలిపెదను; నీ = నీ; కును = కు; వత్సలురాలను = వాత్సల్యము పొందిన దానను; అగుటన్ = అగుటచేత; గురుతర = మిక్కిలి గొప్ప {గురు – గురుతరము – గురుతమము}; చరితా = నడవడిక కలవాడ.

భావము:

రాజేంద్రా! విను. ఆ ఓషధులను ఒక ఉపాయంచేత మళ్ళీ పొందవచ్చు. ఓ సుచరిత్రా! నీమీద ఉండే ప్రేమచేత ఆ ఉపాయాన్ని నీకు తెలియజేస్తాను.

4-496-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యము నా కొక వత్సము
నురూప సుదోహనమ్ము నురూపక దో
గ్ధను గల్పింపుమ యట్లయి
ను నీ భూతముల కవనినాయక! దానన్.

టీకా:

అనయమున్ = అవశ్యము, తప్పక; నా = నా (దోగ్ధ్రి – పితుకనిచ్చునది, ఫలదాయని); కున్ = కు; ఒక = ఒక; వత్సము = దూడను (తగిన ఉత్ప్రేరకమును, కారకమును); అనురూప = అనుకూలమైన, అనుగుణమగు; సు = మంచి; దోహనమ్మున్ = పాలు పితికెడి పాత్రను (తగిన ఫల గ్రహణమును); అనురూపక = అనుకూలమైన; దోగ్ధనున్ = పాలు పితికెడి వాడను ( దోగాదము (పాలు పితుకుట) చేయువాడు, తగిన చేసేవాడిని, కార్యకర్తను); కల్పింపుము = ఏర్పరుచుము; అట్లు = ఆ విధముగ; అయినను = అయినచో; ఈ = ఈ; భూతముల్ = జీవుల; కున్ = కి; అవనినాయక = రాజా; దానన్ = దానివలన.

భావము:

రాజా! నీవు నాకు తగిన దూడను, తగిన పాత్రను, తగిన దోగ్ధను (పాలు పితికే నేర్పరిని) సమకూర్చు. అలా నీవు సమకూర్చినట్లయితే…

4-497-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగ నభీప్సితములు బల
ములు నగు నన్న దుగ్ధ లితము లగు భా
సుకామంబులఁ బిదికెద
నాయకచంద్ర! వినుము నావచనంబుల్.

టీకా:

పరగన్ = ప్రసిద్దముగ; అభీప్సితములున్ = కోరినవాటిని; బలకరములు = బరవర్ధకములు; అగు = అయిన; అన్న = ఆహారమును; దుగ్ధ = పాలుతోను; కలితములు = కూడినవి; అగు = అయిన; భాసుర = గొప్ప; కామంబులన్ = కోరికలను; పిదికెదన్ = ఇచ్చెదను; నరనాయక = రాజులలో; చంద్ర = చంద్రుని వంటివాడ; వినుము = వినుము; నా = నా యొక్; వచనంబుల్ = మాటలను.

భావము:

ఈ ప్రాణులకు ఇష్టమైనవీ, బలకరమైనవీ, దుగ్ధాన్న రూపమైనవీ అయిన కోరికలను ప్రసాదిస్తాను. నా మాటలను గమనించు.

4-498-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజవరేణ్య! యేను విషస్థలినై యిపు డున్నదాన; నొ
య్య జలదాగమోదిత పయః ప్రకరంబు తదాగమంబు వో
యిను దదంబువుల్ పుడమి నింకక యంతట నిల్చునట్లుగా
నునిభ; నన్ను నిప్పుడు సస్థలినై పెనుపొందఁ జేయవే.”

టీకా:

మనుజవరేణ్య = మానవులలోఉత్తముడా; ఏను = నేను; విషమ =ఎగుడుదిగుడు, సమము కాని; స్థలిని = స్థలము కలదానిని; ఐ = అయ్యి; ఇపుడు = ఇప్పుడు; ఉన్నదానన్ = ఉన్నాను; ఒయ్యన్ = చటుక్కున; జలద = మేఘములు, వర్షరుతువు; ఆగమ = రాగా; ఉదిత = పడిన; పయస్ = నీటి; ప్రకరంబున్ = మొత్తములు; తత్ = అలా; ఆగమంబున్ = వచ్చి; పోయిన = పోగా; తత్ = ఆ; అంబువుల్ = నీరు; పుడమిన్ = నేలలోకి; ఇంకక = ఇంకిపోకుండగ; అంతటన్ = అక్కడనే; నిల్చునట్లుగాన్ = నిలబడేటట్లుగా; మనునిభ = మనువుతో సమానమైన వాడ; నన్నున్ = నన్ను; ఇప్పుడున్ = ఇప్పుడు; సమ = సమతలమైన; స్థలిని = స్థలము కలదానిని; ఐ = అయ్యి; పెంపొందన్ = విస్తరించునట్లుగా; చేయవే = చేయుము.

భావము:

మహారాజా! ఇప్పుడు నేను మిట్టపల్లాలతో విషమంగా ఉన్నాను. వానకాలంలో కురిసిన నీరు ఆ వానకాలం గడచిపోయిన తరువాత కూడా భూమిలో ఇంకిపోకుండా అంతటా నిలిచిపోవడానికి వీలుగా నన్ను సమంగా చదును చేయి. మనువుతో సమానమైనవాడా! నా విన్నపం మన్నించు”

4-499-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యివ్విధమున నా భూ
నితామణి పలుకు మధుర చనంబులు దా
విని యనురాగము దన మన
మునఁ గడలుకొనంగ రాజముఖ్యుం డంతన్.

టీకా:

అని = అని; ఈ = ఈ; విధమునన్ = విధముగ; ఆ = ఆ యొక్క; భూవనితామణి = భూదేవి {భూవనితామణి - భూమి అనెడి స్త్రీలలో మణి వంటి యామె, భూదేవి}; పలుకున్ = పలికిన; మధుర = తీయని; వచనంబులున్ = మాటలను; తాన్ = తను; విని = విని; అనురాగమున్ = కూరిమి; తన = తన యొక్క; మనమునన్ = మనసులో; కడలుకొనంగన్ = పొంగిపొర్లగా; రాజముఖ్యండు = మహారాజు; అంతన్ = అంతట.

భావము:

అని ఈ విధంగా భూదేవి పలికిన తియ్యని మాటలను పృథు చక్రవర్తి విని తన మనస్సులో ప్రేమ పొంగులెత్తగా…

4-500-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువును దూడఁ జేసి గరిమన్ నిజపాణితలంబు లీల దో
ముగఁ జేసి యందు సకలౌషధులం బిదికెం గ్రమంబునం
రఁగఁ దద్విధంబునను త్పృథు వత్సలయైన భూమియం
యము వారువారును బ్రియంబగు కోర్కులు వొంది రున్నతిన్.

టీకా:

మనువునున్ = మనువుని; దూడన్ = దూడగా; చేసి = చేసికొని; గరిమన్ = గొప్పగా; నిజ = తన యొక్క; పాణితలంబున్ = అరచేతిని; లీలన్ = లీలగా; దోహనమున్ = పాలు పితికెడి పాత్రగా; చేసి = చేసి; అందున్ = దానిలో; సకల = సమస్తమైన; ఔషధులనున్ = ధాన్యాదులను; పిదికెదన్ = పితికెను; క్రమంబునన్ = క్రమముగా; తనరన్ = విలసిల్లునట్లుగ; తత్ = ఆ; విధంబుననున్ = విధముగ; తత్ = ఆ; పృథు = పృథుచక్రవర్తిచే; వత్సల = వాత్సల్యము పొందినది; ఐన = అయిన; భూమి = భూదేవి; అందున్ = నుండి; అనయమున్ = అవశ్యము; వారువారునున్ = వారందరును; ప్రియంబున్ = ఇష్టము; అగు = అయిన; కోర్కులున్ = కోరికలను; ఒందిరిన్ = పొందిరి; ఉన్నతిన్ = అభివృద్దితో, ఔన్నత్యముతో.

భావము:

పృథు చక్రవర్తి మనువును గోవత్సంగాను, తన చేతిని పాత్రగాను చేసి తాను దోగ్ధయై భూమినుండి సకలమైన ఓషధులను పిదికాడు. ఈ విధంగా అతనిపై వాత్సల్యం కలిగిన గోరూప ధారియైన భూమినుండి ఇతరులు కూడా తమ కోరికలను తీర్చుకున్నారు.

4-501-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లసి ఋషుల్ బృహస్పతి వత్సకంబుగా-
ర్థించి తమ యింద్రియంబు లందు
నంచితచ్ఛందోమక్షీరమును దేవ-
లు సురరాజు వత్సంబు గాఁగఁ
నక పాత్రము నందుఁ నరు నోజోబల-
వీర్యామృతంబునై వెలయు పయసు
దైత్య దానవులు దైత్యశ్రేష్ఠుఁ డగు గుణ-
శాలిఁ బ్రహ్లాదు వత్సంబుఁ జేసి

4-501.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న సురాసవ రూప దుగ్ధంబు వరుస
ప్సరోజన గంధర్వు లరి యపుడు
ర విశ్వావసువు వత్సమునుగఁ జేసి
ద్మమయ నిర్మితంబైన పాత్రమందు

టీకా:

బలసి = కూడి; ఋషుల్ = ఋషులు; బృహస్పతి = బృహస్పతిని; వత్సకంబున్ = దూడగా; అర్థించి = కోరి; తమ = తమ యొక్క; ఇంద్రియంబుల్ = ఇంద్రియముల; అందున్ = లో; అంచిత = అందమైన; ఛందస్ = ఛందస్సుతో; మయ = నిండిన; క్షీరమున్ = పాలను; దేవతలున్ = దేవతలు; సురరాజున్ = ఇంద్రుని {సురరాజు - సుర (దేవతల)కి రాజు, ఇంద్రుడు}; వత్సంబున్ = దూడ; కాగన్ = అగునట్లు; కనక = బంగారపు; పాత్రమున్ = పాత్ర; అందున్ = లో; ఒజస్ = తేజస్సు; బల = శక్తి; వీర్య = వీర్యము యనురూపమైన; అమృతంబున్ = అమృతము; ఐ = అయ్యి; వెలయు = ప్రసిద్ధమగు; పయసున్ = పాలను; దైత్య = దితిసంతానమైన; దానవులున్ = రాక్షసులు; దైత్య = రాక్షసులలో; శ్రేష్ఠుడు = ఉత్తముడు; అగు = అయిన; గుణ = సుగుణములుకల; శాలిన్ = స్వభావముకలవాడు; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; వత్సంబున్ = దూడగా; చేసి = చేసికొని.
ఘన = గొప్ప; సుర = పెద్ద; ఆసవ = మకరందపు, కల్లు; రూప = రూపముకల; దుగ్దంబున్ = పాలను; వరుసన్ = వరుసగా; అప్సరః = అప్సరలుయైన; జన = వారు; గంధర్వులు = గంధర్వులు; అలరి = సంతోషించి; అపుడున్ = అప్పుడు; తనరన్ = అతిశయముతో; విశ్వావసువున్ = విశ్వావసువును; వత్సమునుగన్ = దూడగా; చేసి = చేసి; పద్మ = పద్మముల; మయ = తోనిండుగ; నిర్మితంబున్ = తయారచేయబడినది; ఐన = అయిన; పాత్రమున్ = పాత్ర; అందున్ = లో.

భావము:

ఋషులు బృహస్పతిని దూడగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో వేదమయమైన క్షీరాన్ని, దేవతలు ఇంద్రుని దూడగా చేసుకొని బంగారు పాత్రలో ఓజోబల వీర్యామృతమయమైన క్షీరాన్ని, దైత్య దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా చేసికొని ఇనుపపాత్రలో సురాసవమయమైన క్షీరాన్ని, అప్సరసలు గంధర్వులు విశ్వావసువును దూడగా చేసుకొని పద్మమయమైన పాత్రలో…

4-502-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మాధుర్య సౌందర్య సహిత గాంధర్వక్షీరంబును బిత్రుదేవతలు సూర్య వత్సకంబుగా నామ పాత్రంబునందుఁ గవ్యం బను దుగ్ధంబును, సిద్ధులు గపిల వత్సకంబుగా నాకాశ పాత్రమందు సంకల్పనారూపాణిమాది సిద్ధి యను క్షీరంబును, విద్యాధరాదులు తద్వత్సకంబును దత్పాత్రకంబునుంగా ఖేచరత్వాది వ్యాపారరూప క్షీరంబును, గింపురుషాదులు మయవత్సకంబును నాత్మ పాత్రంబునుంగా సంకల్పమాత్ర ప్రభవంబు నంతర్ధానాద్భుతాత్మ సంబంధియు నగు మాయ యను క్షీరంబును, యక్షరక్షోభూత పిశాచంబులు భూతేశ వత్సకంబుఁ గపాల పాత్రంబునుంగా రుధిరాసవం బను క్షీరంబును, నహిదందశూక సర్ప నాగంబులు దక్షకవత్సంబును బిలపాత్రంబునుంగా విషరూప క్షీరంబును, బశువులు గోవృషవత్సకంబు నరణ్య పాత్రంబునుంగాఁ దృణం బను క్షీరంబును, గ్రవ్యాదమృగంబులు మృగేంద్ర వత్సకంబును నాత్మ కళేబర పాత్రకంబునుంగాఁ గ్రవ్యం బను దుగ్ధంబును, విహంగంబులు సుపర్ణవత్సకంబుగా నిజకాయ పాత్రంబునుంగాఁ గీటకఫలాదికం బను దుగ్ధంబును, వనస్పతులు వటవత్సకంబుగా భిన్నరోహరూప పయస్సును, గిరులు హిమవద్వత్సకంబును నిజసాను పాత్రకంబునుంగా నానాధాతువులను, దుగ్ధంబునుంగా నివ్విధంబున సమస్త చరాచర వర్గంబు స్వముఖ్యవత్సకంబును స్వస్వపాత్రకంబునుంగా భిన్నరూపంబు లైన క్షీరంబులం బిదికె” నని చెప్పి మఱియును.

టీకా:

మాధుర్య = మధురమైన; సౌందర్య = అందముతో; సహిత = కూడినది యైన; గాంధర్వ = సంగీత మనెడి; క్షీరంబునున్ = పాలను; పితృదేవతలు = పితృదేవతలు; సూర్య = సూర్యుని; వత్సకంబుగాన్ = దూడగా; ఆమపాత్రంబున్ = ఆవమున కాల్చని కుండ, పచ్చికుండ; అందున్ = లో; కవ్యంబున్ = కవ్యము {కవ్యము – పితృదేవతల కీయదగిన యన్నము}; అను = అనెడి; దుగ్దంబునున్ = పాలను; సిద్ధులున్ = సిద్ధులు; కపిల = కపిలుని; వత్సకంబుగాన్ = దూడగా; ఆకాశ = అవకాశము అనెడి; పాత్రమున్ = పాత్ర; అందున్ = లో; సంకల్పన = సంకల్ప మనెడి; రూపాణి = రూపముకల; అణిమాది = అణిమాది {అణిమాది అష్ట సిద్ధులు - 1అణిమ (అణువుగ సూక్ష్మత్వము నందుట) 2మహిమ (పెద్దగ అగుట) 3గరిమ (బరు వెక్కుట) 4లఘిమ (తేలికగ నౌట) 5ప్రాప్తి (కోరినది ప్రాప్తించుట) 6ప్రాకామ్యము (కోరిక తీర్చుట) 7ఈశత్వము (ప్రభావము చూపగలుగుట) 8వశిత్వము (వశీకరణము)}; సిద్ధి = సిద్ధించుట; అను = అనెడి; క్షీరంబునున్ = పాలను; విద్యాధర = విద్యాధరులు; ఆదులు = మొదలగువారు; తత్ = అదే (కపిలుడే); వత్సకంబునున్ = దూడను; తత్ = అదే (ఆకాశమే); పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; ఖేచరత్వ = గగనవిహారము; ఆది = మొదలగు; వ్యాపార = ఉద్యోగముల; రూప = రూపము కల; క్షీరంబునున్ = పాలను; కింపురుష = కింపురుషులు; ఆదులున్ = మొదలగువారు; మయ = మయుని; వత్సకంబునున్ = దూడగా; ఆత్మ = తామే; పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; సంకల్ప = సంకల్పించిన; మాత్ర = మాత్రముతోనే; ప్రభవంబున్ = కలిగెడి; అంతర్థాన = మాయ మగుట; ఆది = మొదలైన; అద్భుత = అద్భుతమైనవి; ఆత్మ = ఆత్మకు; సంబంధియున్ = సంబంధించినవి; అగు = అయిన; మాయ = మాయ; అను = అనెడి; క్షీరంబునున్ = పాలను; యక్ష = యక్షులు; రక్షః = రాక్షసులు; భూత = భూతములు; పిశాచంబులున్ = పిశాచములును; భూతేశు = రుద్రుని {భూతేశుడు - సర్వభూతములకు ప్రభువు, శివుడు}; వత్సకంబున్ = దూడగా; కపాల = పుఱ్ఱెని; పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; రుధిర = రక్తము; ఆసవంబున్ = పానము; అను = అనెడి; క్షీరంబునున్ = పాలను; అహి = అహి, పాము; దందశూక = దందశూకము, పాము; సర్ప = సర్పము, పాము; నాగంబులున్ = నాగులు, పాములు; తక్షక = తక్షకుని; వత్సకంబునున్ = దూడగా; బిల = కన్నము; పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; విష = విషము యనెడి; రూప = రూపము కల; క్షీరంబునున్ = పాలను; పశువులున్ = పశువులు; గోవృష = గిత్త (మగదూడ)ను; వత్సకంబున్ = దూడగా; అరణ్య = అరణ్యమును; పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; తృణంబు = గడ్డి; అను = అనెడి; క్షీరంబునున్ = పాలను; క్రవ్యాద = మాంసాహార; మృగంబులున్ = జంతువులు; మృగేంద్ర = సింహమును; వత్సకంబున్ = దూడగా; ఆత్మ = తమ యొక్క; కళేబర = కళేబరము; పాత్రకంబునున్ = పాత్ర; కాన్ = కాగా; క్రవ్యంబున్ = మాంసము; అను = అనెడి; దుగ్దంబునున్ = పాలను; విహంగంబులున్ = పక్షులు; సుపర్ణ = గరుడుని {సుపర్ణుడు - సు (మంచి) పర్ణ (రెక్కలు) కలవాడు, గరుత్మతుడు}; వత్సకంబున్ = దూడగా; కాన్ = కాగా; నిజ = తమ యొక్క; కాయంబున్ = దేహములు; పాత్రంబునున్ = పాత్ర; కాన్ = కాగా; కీటక = కీటకములు; ఫల = ఫలములు; ఆదికంబున్ = మొదలైనవి; అను = అనెడి; దుగ్దంబునున్ = పాలను; వనస్పతులున్ = ఒకరకమైన చెట్లు {వనస్పతులు - రావి మఱ్ఱి అత్తి మొదలగు పూలు పూయకుండగ కాసెడి చెట్లు}; వట = రావిచెట్టు; వత్సకంబుగాన్ = దూడగా; భిన్న = వివిధ రకము లైన; ఆరోహ = ఎత్తులు కలిగిన; రూప = రూపము కల; పయస్సునున్ = పాలను; గిరులు = కొండలు; హిమవత్ = హిమవత పర్వతము; వత్సకంబునున్ = దూడగా; నిజ = తమ యొక్క; సాను = సానువులు; పాత్రకంబునున్ = పాత్ర; కాన్ = కాగా; నానా = రకరకముల; ధాతువులు = ఖనిజములు; అను = అనెడి; దుగ్దంబునున్ = పాలను; కాన్ = కాగా; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; సమస్త = సమస్తమైన; చరాచర = చరించగల చరించలేని ప్రాణుల; వర్గంబున్ = సమూహములును; స్వ = తమలోని; ముఖ్య = ముఖ్యులను; వత్సకంబునున్ = దూడలుగా; స్వస్వ = తమతమ; పాత్రకంబునున్ = పాత్రలు కాగా; భిన్న = వివిధ రకముల; రూపంబులున్ = రూపములు; ఐన = అయినట్టి; క్షీరంబులన్ = క్షీరములను; పిదికెన్ = పితికిరి; అని = అని; చెప్పి = చెప్పి; మఱియునున్ = ఇంకను.

భావము:

మాధుర్య సౌందర్యాలతో కూడిన గాంధర్వమనే క్షీరాన్ని, పితృదేవతలు సూర్యుని దూడగా చేసుకొని ఆమపాత్రలో కవ్యమనే క్షీరాన్ని, సిద్ధులు కపిలుని దూడగా చేసుకొని ఆకాశపాత్రలో సంకల్పనా రూపమైన అణిమాదిసిద్ధి అనే క్షీరాన్ని, విద్యాధరులు మొదలైనవారు కపిలుని దూడగా చేసికొని ఆకాశపాత్రలో ఖేచరత్వాది విద్యామయమైన క్షీరాన్ని, కింపురుషాదులు మయుని దూడగా చేసుకొని ఆత్మపాత్రలో సంకల్పమాత్ర ప్రభవమూ అంతర్ధాన రూపమూ అద్భుతాత్మకమూ అయిన మాయ అనే క్షీరాన్ని, యక్ష రక్షో భూత పిశాచులు రుద్రుని దూడగా చేసికొని కపాలపాత్రలో రుధిరాస్వరూపమైన క్షీరాన్ని, అహి దందశూక సర్ప నాగాలు తక్షకుని దూడగా చేసుకొని బిలపాత్రలో విషరూపమైన క్షీరాన్ని, పశువులు ఆబోతు దూడగా అరణ్యపాత్రలో తృణమనే క్షీరాన్ని, క్రూరమృగాలు సింహాన్ని దూడగా చేసికొని స్వకళేబరపాత్రలో మాంసం అనే క్షీరాన్ని, పక్షులు గరుత్మంతుని దూడగా చేసుకొని స్వదేహపాత్రలో కీటకాలు, ఫలాలు అనే క్షీరాన్ని, వసస్పతులు వటవృక్షాన్ని దూడగా చేసికొని భిన్నరోహ రూపమైన క్షీరాన్ని, పర్వతాలు హిమవంతుని దూడగా చేసికొని సానువులనే పాత్రలో నానాధాతువులు అనే క్షీరాన్ని ఈ విధంగా సమస్త చరాచర ప్రపంచం తమలో శ్రేష్ఠులను దూడలుగా చేసుకొని, తమకు తగిన పాత్రలలో, తమకు తగిన క్షీరాలను భూమినుండి పిండుకున్నారు.

4-503-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమున నిటు పృథ్వాదులు
తమ కామితము లనఁగఁ గు భిన్నక్షీ
ము దోహన వత్సక భే
మునం దగఁ బిదికి; రంత రణీధవుఁడున్.

టీకా:

క్రమమునన్ = వరుసగా; ఇటు = ఇలా; పృథు = పృథుచక్రవర్తి; ఆదులు = మొదలగువారు; తమతమ = తమతమ; కామితంబులు = కోరికలు; అనన్ = అనుటకు; తగిన = తగినట్టి; భిన్న = రకరకముల; క్షీరమున్ = పాలను; దోహన = పితికెడి పాత్రలు; వత్సక = దూడలు యొక్క; భేదమున్ = భేదము; అందగన్ = పొందునట్లుగ; పిదికిరి = పితికిరి; అంతన్ = అంతట; ధరణీధవుడున్ = రాజుకూడ {ధరణీధవుడు - ధరణి (భూమికి) ధవుడు (భర్త), రాజు}.

భావము:

ఆ ప్రకారంగా క్రమక్రమంగా పృథువు మొదలైనవారు వేరువేరు వత్సములను, పాత్రలను కల్పించుకొని తమతమ కోర్కెలనే వేరువేరు క్షీరాలను పిదుకుకున్నారు. అప్పుడు పృథుమహారాజు...

4-504-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముచితానందమును బొంది ర్వకామ
దుఘ యనం దగు భూమిని దుహితఁగాఁగఁ
గోరి కైకొని నిజధనుఃకోటిచేత
భూరిగిరి కూటములఁ జూర్ణములుగఁ జేసి.

టీకా:

సముచిత = చక్కటి; ఆనందమును = ఆనందమును; పొంది = పొంది; సర్వ = సమస్తమైన; కామ = కామితములను; దుఘ = ఇచ్చునది; అనన్ = అనుటకు; తగు = తగినట్టి; భూమినిన్ = భూమిని; దుహిత = కూతురు; కాగన్ = కాగా; కోరి = పూని; కైకొని = చేపట్టి; నిజ = తన; ధనుస్ = విల్లుల; కోటిన్ = సమూహము; చేతన్ = చేత; భూరి = అతిపెద్ద; గిరి = కొండల; కూటములు = వరుసలను; చూర్ణములుగన్ = పిండిపిండిగ; చేసి = చేసి.

భావము:

ఎంతో సంతోషించి అన్ని కోరికలను తీర్చే భూమిని తన పుత్రిగా స్వీకరించాడు. తన వింటికొప్పుతో పెద్ద పెద్ద పర్వతాల శిఖరాలను పొడి పొడి చేసి…

4-505-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చండ దోర్దండలీల భూమండలంబు
మతలంబుగఁ జేసి శశ్వత్ప్రసిద్ధి
నొంది యవ్విభుఁ డీ లోకమందు నెల్ల
ప్రజకుఁ దండ్రియు జీవనప్రదుఁడు నగుచు.

టీకా:

చండ = భయంకరమైన; దోర్దండ = భుజముల; లీలన్ = విలాసములతో; భూమండలంబున్ = భూప్రదేశములను; సమతలంబున్ = ఎగుడు దిగుడు లేని ప్రదేశముగ; చేసి = చేసి; శశ్వత్ = శాశ్వతమైన; ప్రసిద్ధిన్ = కీర్తిని; ఒందెన్ = పొందెను; ఆ = ఆ; విభుడు = ప్రభువు; ఈ = ఈ; లోకము = జగము; అందున్ = లో యున్న; ఎల్ల = అందరు; ప్రజ = జనుల; కున్ = కిని; తండ్రియు = తండ్రి; జీవన = జీవికను, జీవనోపాధిని; ప్రదుడున్ = సమకూర్చువాడు; అగుచున్ = అవుతూ.

భావము:

పృథుచక్రవర్తి తన భుజబలంతో నేలంతా సమతలంగా చేసాడు. ఆ ప్రభువు తండ్రి యై ప్రజలకు బ్రతుకు తెరువు కల్పించాడు, శాశ్వత మైన యశస్సు గడించాడు.

4-506-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్క డక్కడఁ బూర్వంబునందు లేని
గ్రామ పట్టణ దుర్గ ఖర్వట పుళింద
ఖే శబరాలయవ్రజ వా ఘోష
వివిధ నిలయము లర్థిఁ గావించె నంత.

టీకా:

అక్కడక్కడ = అక్కడక్కడ; పూర్వంబున్ = ఇంతకు ముందు కాలము; అందున్ = లో; లేని = లేనట్టి; గ్రామ = గ్రామములు; పట్టణ = పట్టణములు; దుర్గ = కోటలు; ఖర్వట = కొండ పల్లెలు; పుళింద = బోయ గూడెములు; ఖేట = కాపు పేటలు; శబరాలయ = శబరుల గూడెములు; వ్రజ = పశువుల శాలలు; వాట = వీధులు; ఘోష = గొల్ల పల్లెలు; వివిధ = రకరకముల; నిలయములున్ = జనవాసములు; అర్థిన్ = కోరి; కావించెన్ = ఏర్పరచెను.

భావము:

అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు.

4-507-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారును భయవిరహితులై
బోనఁ దత్తన్నివాసముల యందు సుఖ
శ్రీరుచి నొప్పుచు నుండిరి
వాక యా పృథునిఁ బొగడ శమె ధరిత్రిన్?

టీకా:

వారును = వారుకూడ; భయ = భయములు; విరహితులు = ఏమి లేనివారు; ఐ = అయ్యి; బోరనన్ = శ్రీఘ్రమే; తత్తత్త = అయా; నివాసములు = జనవాసముల; అందున్ = లో; సుఖ = సుఖము; శ్రీ = సంపదలుతో; రుచిన్ = ప్రకాశించుతూ; ఒప్పుచున్ = చక్కగా; ఉండిరి = ఉండిర్; వారకన్ = అవశ్యము; ఆ = ఆ; పృథున్ = పృథుచక్రవర్తిని; పొగడన్ = స్తుతించుట; వశమే = సాధ్యమా ఏమి; ధరిత్రిన్ = భూమిపైన.

భావము:

ప్రజలు భయం తొలగి ఆయా నివాసాలలో సుఖసంపదలతో తులతూగుతూ బ్రతుకుతున్నారు. అటువంటి ధర్మమూర్తి అయిన పృథుచక్రవర్తిని కీర్తించడం ఈలోకంలో ఎవరికి శక్యం?