పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-465.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందు విశ్రుతవిక్రముఁ గుచు మిగులఁ
న కథావళి భూ ప్రజాతి నుతింప
క్కడక్కడ వినుచు శౌర్యమున నఖిల
దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుఁడు.

టీకా:

ఒక = ఒక; నాడున్ = దినమున; నిజ = తన; మందిర = గృహముయొక్క; ఉపాంత = సమీపమునందలి; వనమున్ = తోట, అడవి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = దానిలో; సత్ = మంచి; గుణ = గుణములను; శాలి = స్వభావముగ కలవాడు; ఐన = అయిన; ఘనునిన్ = గొప్పవానిని; సనత్కుమారునిన్ = సమత్కుమారుని; కాంచి = దర్శించి; ఆ = ఆ; ముని = మునులలో; వరున్ = శ్రేష్టుని; బ్రహ్మ = బ్రహ్మదేవుని యొక్క; తనయున్ = పుత్రుడు; కాన్ = అగునట్లు; ఎఱిగి = తెలిసి; భక్తిన్ = భక్తితో; పూజించి = సేవించి; విజ్ఞానమును = తత్త్వజ్ఞానమును; పొందున్ = పొందును; అచటన్ = అక్కడ; బ్రహ్మవేత్తలు = బ్రహ్మణులు {బ్రహ్మవేత్తలు - వేద ధర్మములు బాగుగనెరినవారు, బ్రాహ్మణులు}; ముని = సనత్కుమారునిచే; మానిత = మన్నింపబడుటచేత; లబ్ద = లభించిన; విజ్ఞానులు = విజ్ఞానముకలవారు; ఐ = అయ్యి; వర్తింతురు = తిరిగెదరు; ఈ = ఈ; మహారాజు = మహారాజు; మహీ = భూ; తలంబున్ = మండలము; అందున్ = లో.
విశ్రుత = మిక్కిలిగవినబడెడి, ప్రసిద్ధమైన; విక్రముడు = పరాక్రమము కలవాడు; అగుచున్ = అవుతూ; మిగులన్ = ఎక్కువగ; తన = తనయొక్క; కథా = కథల; ఆవళిన్ = సమూహమును; భూ = భూమియందలి; ప్రజా = ప్రజల; తతిన్ = సమూహములు; నుతింపన్ = స్తోత్రముచేయుచుండ; అక్కడక్కడ = అక్కడక్కడ; వినుచున్ = వింటూ; శౌర్యమునన్ = పరాక్రమముతో; అఖిల = సర్వ; దిక్కులనున్ = దిక్కులను; గెల్చి = గెలిచి; వర్తించున్ = తిరుగును; ధీర = బుద్ధిబలము; యశుడు = కీర్తియుకలవాడు.

భావము:

ఒకనాడు ఈయన రాజభవనానికి సమీపంలో ఉపవనానికి వెళ్ళి అక్కడ బ్రహ్మ మానసపుత్రుడు, పవిత్ర చరిత్రుడు అయిన సనత్కుమారుణ్ణి సందర్శించి, భక్తితో పూజిస్తాడు. ఆయన వల్ల ఉత్తమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అక్కడ ఉన్న బ్రహ్మవేత్తలందరూ ఆ సనత్కుమారుని ఉపదేశం వల్ల తత్త్వజ్ఞానులై ప్రవర్తిస్తారు. ఈ మహారాజు మహీమండలంలో సుప్రసిద్ధ వీరుడై తన వీరగాథలను లోకులు వినుతింపగా వీనుల విందుగా వింటాడు. శౌర్యాతిశయంతో సర్వదిక్కులను జయించి శాశ్వతమైన యశస్సును గడిస్తాడు.