పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-460.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిరుగునెడ సర్వ దిక్పాల సమేత
పార్థివోత్తమ నికర ముపాయనంబు
లిచ్చి తనుఁ జక్రపాణిని నెనయు నాది
రణివిభుఁ డని నుతియించి లఁతు రెదల.

టీకా:

ఉదయాద్రి = పొద్దుపొడుచుకొండ {ఉదయాద్రి - పొద్దుపొడుచుకొండ, తూర్పుదిగంతమునందలిపర్వతము, పురోగమనమునకు సంజ్ఞామాత్రము}; పర్యంతమున్ = వరకు; ఉర్వీతలంబున్ = భూభాగమునకు; ఏక = ఏకైక {ఏకవీరుడు - ఏకైకశూరుడు, మంచినిష్టకలవాడు}; వీరుడు = శూరుడు; ఐ = అయ్యి; రక్షించి = పాలించుతూ; వెలయున్ = ప్రసిద్ధమగు; ఈతడు = ఇతడు; ఒక = ఒక; నాడు = దినమున; విజయ = దిగ్విజయ, జైత్ర {విజయయాత్ర - జైత్రయాత్ర, సాధనపరిపక్వత}; యాత్ర = యాత్ర; ఉత్సవంబున్ = ఉత్సాహము; ఏపారన్ = అతిశయించగా; సన్నద్ధుడు = సంసిద్ధుడు; ఐ = అయ్యి; మణి = మణులుతాపడముచేసిన {మణిసన్నద్ధుడు - అణిమాదిసిద్దుడు}; స్యందనమున్ = రథమును; ఎక్కి = ఎక్కి; చాపమున్ = విల్లును (సూర్యమార్గపథము) {చాపము - విల్లు, సూర్యుడు గమనము చేసెడి మార్గము}; పూని = ధరించి; దిక్కులన్ = సర్వదిక్కులను; సూర్యుని = సూర్యుని; పగిదిన్ = వలె; శత్రు = శత్రువులైన; భూపాల = రాజులనెడి {భూపాల - భూమినిపాలించెడివారు, రాజులు}; తమము = చీకటి {తమము - చీకటి, తమోగుణావరణ}; విరియింతున్ = విడిపింతును, పోగొట్టెదను; అని = అని; చాల = మిక్కిలి; వెలుగొందుచునున్ = ప్రకాశిస్తూ; ధరా = భూమిని {ధరాచక్రప్రదక్షిణశాలి - భూమిచుట్టునుతిరుగుట, దేహసంబంధిలన్నిటిని చుట్టబెట్టుట}; చక్ర = చుట్టును గుండ్రముగా; ప్రదక్షిణశాలి = తిరుగువాడు; అగుచున్ = అవుతూ; తిరుగు = తిరిగెడు; ఎడన్ = సమయములో.
సర్వ = సమస్తమైన; దిక్పాల = దిక్పాలురు {దిక్పాలులు - ఇంద్రాదులు, ఇంద్రియసందోహము}; వర = ఉత్తములు {వర - ఉత్తమ, ఇయ్యబడిన}; సమేత = సహితముగ; పార్థివ = రాజులలో {పార్థివోత్తముడు - ఉత్తమ రాజు, ఉత్తపార్థివశరీరము (తగులములులేని) కలవాడు}; ఉత్తమ = ఉత్తముల; నికరమున్ = సమూహము; ఉపాయనంబుల్ = కానుకలు {ఉపాయనంబులు - కానికలు, సాధనకి ఉపయోగించునవి}; ఇచ్చి = ఇచ్చి; తనున్ = తనను; చక్రపాణినిన్ = విష్ణ్వంశభూతుడుగ {చక్రపాణి - చక్రమును ధరించువాడు, విష్ణువు, భ్రమణమును నియమించువాడు}; ఎనయున్ = ఎంచిచూడ {ఆదిధరణి విభుడు - మొట్టమొదటిరాజు, ఇంద్రియమూలములను నియమించువాడు}; ఆది = మొట్టమొదటి; ధరణి = భూప్రపంచమునకు; విభుడు = ప్రభువు, రాజు; అని = అని; నుతియించి = స్తుతించి; తలతురు = భావించెదరు; ఎదలన్ = మనసులలో.

భావము:

ఈ పృథు చక్రవర్తి ఉదయపర్వతం వరకు సమస్త భూమండలాన్ని ఏకైక తిరుగులేని వీరత్వంతో రక్షిస్తాడు. ఒకనాడు రత్నఖచితమైన రథాన్ని అధిరోహించి విల్లమ్ములు ధరించి జైత్రయాత్రకు బయలుదేరతాడు. దిక్కులందున్న శత్రురాజులనే కారుచీకట్లను సూర్యుని వలె పటాపంచలు చేస్తాడు. దేదీప్యమానంగా వెలుగుతూ భూచక్రమంతా చుట్టి వస్తాడు. ఆ సమయంలో సర్వ దిక్పాలకులు, రాజేంద్రులు ఈయనకు కానుకలు చెల్లిస్తారు. చక్రపాణికి సాటి వచ్చే ఆదిమహారాజుగా భావించి సేవిస్తారు.