పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-456.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాగ మిళితావలోకన రాజిఁ జేసి
కల జనులకు సంప్రీతి సంభవింపఁ
జేయు సంతతమును గూఢచిత్తుఁ డగుచు
త్రువరుల కసాధ్యుఁడై సంచరించు.

టీకా:

సర్వ = సమస్తమైన; భూతముల = జీవుల; కున్ = కు; సముడును = సమత్వభావముకలవాడు; పరి = మిక్కిలి; అతిక్రమమున = వ్యతిరేకముతో; లోక = లోకమునకు; అపరాధములను = అపరాధములను; అతి = మిక్కలి; కాంతి = శోభతో; సంయుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి; సహించుచున్ = సహిస్తూ; ఆర్తులు = బాధలలో యున్నవారు; అగు = అయిన; వారి = వారి; ఎడ = ఎడల; కృప = దయతో; ఆయత్తుడు = కలిగినవాడు; అగుచున్ = అవుతూ; నర = నరుని; రూప = రూపమును; ధారి = ధరించినవాడు; ఔ = అయినట్టి; హరి = విష్ణువు యొక్క; మూర్తిన్ = స్వరూపమువాడు; కావున = కనుక; ఇంద్రుండు = ఇంద్రుడు; వర్షించి = వర్షము కురిపించి; ఎల్ల = సమస్తమైన; ప్రజల = జనులను; రక్షించు = కాపాడెడి; గతిన్ = విధముగ; తాను = తను; రక్షించున్ = కాపాడును; అమృతాంశు = చంద్రుని; సన్నిభ = సమానమైన; వదన = మోము అనెడి; అబ్జ = పద్మము యొక్క; సస్మిత = చిరునవ్వుకల; అనురాగ = ఆదరముతో.
మిళిత = కూడిన; అవలోకన = చూపుల; రాజిన్ = వరుసల; చేసి = వలన; సకల = సమస్తమైన; జనుల = వారి; కున్ = కి; సంప్రీతి = చక్కటి ప్రియము; సంభవింపన్ = కలుగునట్లు; చేయున్ = చేయును; సంతతమును = ఎల్లప్పుడు; గూఢ = నిగూఢమైన; చిత్తుడు = చిత్తము కలవాడు; అగుచున్ = అవుతూ; శత్రు = శత్రువులలో; వరులు = ఉత్తముల; కున్ = కి; అసాధ్యుడు = అగమ్యుడు; ఐ = అయ్యి; సంచరించు = సంచరించును.

భావము:

ఈ చక్రవర్తి సర్వ ప్రాణులను సమానంగా చూస్తాడు. ప్రజల నేరాలను శాంతంతో సహిస్తాడు. ఆర్తుల యందు దయ చూపిస్తాడు. ఈ మహామహుడు మానవరూపం ధరించిన మహావిష్ణువు. కాబట్టి ఇంద్రుడు వాన కురిపించి ఎల్ల ప్రజలను రక్షించే విధంగా తాను రక్షిస్తాడు. అమృతం చిందే చందమామ వంటి ముఖంతో ఎప్పుడూ చిరునవ్వులు విరజిమ్ముతూ చల్లని దయార్ద్ర వీక్షణాలు వెదజల్లుతూ సర్వజనులకు సంతోషం కలిగిస్తాడు. నిగూఢ చిత్తుడై శత్రువులకు అగమ్యుడై సంచరిస్తాడు”