పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-451-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేనాంగ సంభవుండవు
శ్రీనాథ కళాంశజుఁడవు చిరతరగుణ స
మ్మానార్హుండ వతర్కిత
మై భవన్మహిమఁ బొగడ లవియె మాకున్.

టీకా:

వేన = వేనుని యొక్క; అంగ = అవయవమునందు; సంభవుండవు = పుట్టినవాడవు; శ్రీనాథ = విష్ణుమూర్తి {శ్రీనాథుడు - శ్రీ (లక్ష్మీదేవే)కి భర్త, విష్ణువు}; కళ = కళ యొక్క; అంశ = అంశతో; జుడవు = పుట్టినవాడవు; చిరతర = బహుమిక్కిలి {చిర - చిరతర - చిరతమ}; గుణ = గుణములచే; సమ్మాన = సన్మానింప; అర్హుండవు = తగినవాడవు; అతర్కితము = ప్రశ్నింపరాని; భవత్ = నీ యొక్క; మహిమన్ = గొప్పదనము; పొగడన్ = పొగడుటకు; అలవియె = శక్యమా కాదు; మాకున్ = మాకు.

భావము:

“మహారాజా! నీవు వేనుని శరీరం నుండి జన్మించావు. శ్రీమన్నారాయణుని అంశతో జన్మించినవాడవు. కనుక నీలోని సుగుణాలు ప్రశంసనీయాలు. ఐనా నీ గొప్పతనాన్ని కొనియాడటం మాకు శక్యం కాదు”