పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-445.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిద్ధములు గాన సన్నుతి చేయుఁ డజుని
తని బహువిధ భావంబు భినుతింప
లవి గాకయె యండుదు; దియుఁ గాక;
తుర మతులార! మాగధ నములార!

టీకా:

వంది = వంది; మాగధ = మాగధులు; సూత = సూతులు యందు; వరులారా = ఉత్తములారా; నా = నా; అందున్ = అందు; కమనీయ = చూడదగ్గ; గుణములు = సుగుణములు; కలిగినేని = ఉంటే; అర్హంబున్ = తగును; నుతిచేయన్ = స్తోత్రముచేయగ; అవి = అవి; లేవు = లేవు; నా = నా; అందున్ = అందు; అదిగాన = అందుచేత; మీ = మీ యొక్క; నుతి = స్తోత్రము; వ్యర్థము = పనికిరానిది; అయ్యె = అయినది; ఇటమీద = ఇకపై; గుణములన్ = సుగుణములు; ఏపారి = అతిశయించి; ఉండిన = ఉన్నచో; అపుడు = అప్పుడు; నుతించెదరు = స్తుతించెదరు; అగుటన్ = ఉండుటను; మీరు = మీరు; సభ్య = సభలోనివారిచేత; నియుక్తులు = నియమింపబడినవారు; ఐ = అయ్యి; చతురతన్ = చమత్కారములతో; ఉత్తమశ్లోకుని = విష్ణుమూర్తి యొక్క {ఉత్తమశ్లోకుడు - ఉత్తములచే కీర్తింపబడువాడు, విష్ణువు}; గుణములన్ = గుణములను; అస్తోక = సమస్తమైన; భూ = భూమియందును; ప్రసిద్ధములు = ఖ్యాతికెక్కినవి; కాన = కనుక.
సత్ = మంచిగ; నుతి = స్తోత్రము; చేయుడు = చేయండి; అజుని = విష్ణుమూర్తి {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; అతని = అతని; బహు = అనేక; విధ = రకములైన; భావంబుల = స్వభావములను; నుతింపన్ = స్తోత్రముచేయగ; అలవి = శక్యము; కాకయె = కాకుండగనె; ఉండుదురు = ఉంటారు; అదియున్ = అంతే; కాక = కాకుండ; చతుర = చమత్కార; మతులార = బుద్దికలవారా; మగధజనములార = మాగధులూ.

భావము:

“ఓ వందిమాగధులారా! నాలో సద్గుణాలు ఉన్నట్లయితే మీరు పొగడవచ్చు. కాని అటువంటివి ఏవీ నాలో లేవు. కాబట్టి మీ పొగడ్త వ్యర్థం. ఇకముందు నాయందు సద్గుణాలు సమృద్ధిగా కనిపిస్తే అప్పుడు మీరు ఎక్కువగా పొగుడుదురు గాని. విష్ణుదేవుని సుగుణాలు సర్వలోకాలలో సుప్రసిద్ధాలు కనుక ఇప్పుడు మీరు సభ్యుల అనుజ్ఞను పొంది ఆయన గుణాలను అభివర్ణించండి. విష్ణుదేవుని అనంత కళ్యాణ గుణగణాలను పొగడటానికి అసాధ్యమే. అయినా మీరు నేర్పరులు కాబట్టి కొనియాడటానికి ఉపక్రమించండి.