పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-443.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శిఖియు నజగోవిషాణ సంచిత మహాజ
వ మనందగు చాపంబు వనిదేవి
యోగమయమైన పాదుకాయుగము గగన
రులు గీతంబు లిచ్చిరి సంతసమున.

టీకా:

దామోదరుండు = విష్ణుమూర్తి {దామోదరుడు - దామము (పద్మము) ఉదరుడు (ఉదరమునకలవాడు), విష్ణుమూర్తి}; సుదర్శన = సుదర్శనము అనెడి; చక్రంబున్ = చక్రాయుధము; అవ్యాహత = తిరుగులేని; ఐశ్వర్యము = సంపదలను; అబ్జపాణి = లక్ష్మీదేవి {అబ్జపాణి - పద్మమును చేత ధరించినామె, లక్ష్మీదేవి}; = చంద్రార్థధరుడు = శివుడు {చంద్రార్థధరుడు - అర్థచంద్రుని ధరించువాడు, శివుడు}; చంద్రరేఖ = చంద్రవంక; అంకిత = అలంకరించిన; కమనీయ = అందమైన; కోశ = ఒరతో; కలిత = కూడిన; ఖడ్గము = కత్తి; అంబిక = పార్వతీదేవి; శతచంద్రము = శతచంద్రము {శతచంద్రము - నూరుగురు చంద్రుళ్ళుకలది, ఒక డాలు పేరు}; అను = అనెడి; ఫలకము = డాలు; చంద్రుడు = చంద్రుడు; అమృత = అమృతము (అంతులేని శక్తి); మయ = నిండిన; శ్వేత = తెల్లని; హయ = గుర్రముల; చయంబున్ = సమూహమును; త్వష్ట = విశ్వకర్మ {త్వష్ట - విశ్వకర్మ, ద్వాదశాదిత్యులలోనొకడు}; రూప = రూపము, అందము; ఆశ్రయ = ఆశ్రయించిన, కలిగిన; ఉదాత్త = గొప్ప; రథంబును = రథము; భానుండు = సూర్యుడు; ఘృణి = వెలుగులు; మయ = నిండిన; బాణములును = బాణములు.
శిఖియును = అగ్నిదేవుడు; అజ = గొర్రె; గో = ఎద్దుల; విషాణ = కొమ్ములతో; సమంచిత = చక్కగాకూర్చిన; మహాజగవము = మహాజగవము; అనన్ = అనుటకు; తగు = తగిన; చాపంబున్ = విల్లు; అవనిదేవి = భూదేవి; యోగమయము = యోగమయము; ఐన = అయిన; పాదుకా = పాదుకల, కాలిజోళ్ళ; యుగమున్ = జంట; గగనచరులు = ఖేచరులు; గీతంబులు = గీతములు; ఇచ్చిరి = ఇచ్చిరి; సంతసమున = సంతోషముతో.

భావము:

విష్ణువు సుదర్శన చక్రాన్ని, లక్ష్మీదేవి తరిగిపోని సంపదను, పరమేశ్వరుడు అర్ధచంద్రాకారం గల ఒరతో కూడిన కరవాలాన్ని, పార్వతీదేవి శతచంద్రం అనే డాలును, చంద్రుడు అమృతమయాలైన తెల్లని గుఱ్ఱాలను, త్వష్ట అందమైన వెండి రథాన్ని, సూర్యుడు వెలుగులు వెదజల్లే బాణాలను, అగ్ని అజగవం అనే ధనుస్సును, భూదేవి యోగమయాలైన పాదుకలను బహూకరించారు. దేవతలు యశోగీతాలను సంతోషంతో సమర్పించారు.