పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-439-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇతండు నారాయణాంశ సంభూతుండు నితని యంగన రమాంశ సంభూతయుం గానోపుదు; రని తలంచి యయ్యవసరంబున బ్రహ్మవాదు లగు బ్రాహ్మణోత్తము లతనికి విధ్యుక్తప్రకారంబున రాజ్యాభిషేకంబు గావించిరి; తదనంతరంబ.

టీకా:

ఇతండు = ఇతడు; నారాయణ = విష్ణుని; అంశ = అంశతో; సంభూతుండున్ = చక్కగ పుట్టిన వాడు; ఇతనిన్ = ఇతని; అంగన = భార్య; రమ = లక్ష్మీదేవి యొక్క; అంశ = అంశతో; సంభూతయున్ = చక్కగ పుట్టినామె; కానోపుదురు = అయ్యుంటారు; అని = అని; తలంచి = అనుకొని; ఆ = ఆ; అవసరంబున = సమయమున; బ్రహ్మవాదులు = వేదధర్మ మందు నిష్ఠ కలవారు; అగు = అయిన; బ్రాహ్మణ = బ్రాహ్మణులలో; ఉత్తములు = ఉత్తములు; అతని = అతని; కిన్ = కి; విధి = వేదవిధులలో; ఉక్త = చెప్పబడిన; ప్రకారంబునన్ = విధముగ; రాజ్యాభిషేకంబున్ = రాజ్యమునకు పట్టాభిషేకము; కావించిరి = చేసిరి; తదనంతరంబ = తరువాత.

భావము:

‘ఈ పృథువు నారాయణాంశతో, ఇతని భార్య లక్ష్మీదేవి అంశతో జన్మించారు కాబోలు’ అని భావించారు. అప్పుడు బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములు పృథువుకు యథాశాస్త్రంగా రాజ్యాభిషేకం చేశారు. ఆ తరువాత…