పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-434-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని వార నపత్యుం డగు
నుజేంద్రుని బాహులంత థియించిన నం
ఘం బగు నొక మిథునము
నియించెను సకల జనులు మ్మద మందన్.

టీకా:

కని = చూసి; వారు = వారు; అనపత్యుండు = పిల్లలు లేనివాడు; అగు = అయిన; మనుజేంద్రుని = రాజు యొక్క; బాహులు = భుజములు; అంత = అంతట; మథియించినన్ = మథించగా; అందు = అందులో; అనఘంబు = పవిత్రమైనది; అగు = అయిన; ఒక = ఒక; మిథునము = స్త్రీపురుషుల జంట; జనియించెను = పుట్టినది; సకల = సమస్తమైన; జనులు = వారు; సమ్మదము = సంతోషము; అందన్ = పొందగా.

భావము:

మునులు సంతానహీనుడైన వేనుని హస్తాలను మథించగా ఆ చేతులనుండి ఒక స్త్రీపురుషుల జంట జన్మించింది. అది చూచి సమస్త ప్రజలూ సంతోషించారు.