పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-433-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న కాక కృష్ణ సంకాశ వర్ణుండును-
హ్రస్వావయవుఁడు మహాహనుండు
హ్రస్వబాహుండును హ్రస్వపాదుండును-
నిమ్న నాసాగ్రుండు నెఱయ రక్త
యనుండుఁ దామ్రవర్ణశ్మశ్రుకేశుండు-
తి దీన వదనుండు నైన యట్టి
యొక్క నిషాదకుం డుదయించి యేమి చే-
యుదు నని పలుకుచునున్నఁ జూచి

4-433.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమునులు నిషీద యనుచుఁ లుకుటయును
దాన వాఁడు నిషాదాభిదానుఁ డయ్యె;
తని వంశ్యులు గిరికాననాళి వేను
ల్మషముఁ దెల్పుచుండిరి డఁక మఱియు.

టీకా:

ఘన = మిక్కలి; కాక = కాకి; కృష్ణ = నలుపుకి; సంకాశ = సమానమైన; వర్ణుండును = రంగుకలవాడు; హ్రస్వ = పొట్టి; అవయవుడు = అవయవములుకలవాడు; మహా = పెద్ద; హనుండు = చెక్కిళ్ళుకలవాడు; హ్రస్వ = కురచ; బాహుండును = చేతులుకలవాడు; హ్రస్వ = కురచ; పాదుండును = కాళ్ళుకలవాడు; నిమ్న = తప్పటి, ఎత్తులేని; నాసాగ్రుండును = ముక్కుకలవాడు; నెఱయన్ = నిండా; రక్త = ఎర్రని; నయనుండున్ = కన్నులుకలవాడు; తామ్ర = రాగి; వర్ణ = రంగుకల; శ్మశ్రు = మీసములు; కేశుండు = శిరోజములు కలవాడు; అతి = మిక్కిలి; దీన = దీనమైన; వదనుండును = ముఖము కలవాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; ఒక్క = ఒక; నిషాదకుండు = అడవిమనిషి; ఉదయించి = పుట్టి; ఏమి = ఏమిటి; చేయుదున్ = చేసెదను; అని = అని; పలుకుచునున్నన్ = అడుగుతున్న; చూచి = చూసి.
వర = శ్రేష్టమైన; మునులు = మునులు; నిషీద = కూర్చో; అనుచున్ = అంటూ; పలుకుటయును = అనిరి; దానన్ = దానివలన; వాడు = అతడు; నిషాద = నిషాదుడు అనెడి; అభిదానుడు = పేరుకలవాడు; అయ్యెన్ = అయ్యెను; అతని = అతని యొక్క; వంశ్యులు = వంశమువారు; గిరి = కొండలు; కానన = అడవి; ఆళిన్ = సమూహములందు; వేనున్ = వేనుని; కల్మషమున్ = పాపమును; తెల్పుచున్ = తెలియజేయుతూ; ఉండిరి = ఉన్నారు; కడకన్ = చివరకి; మఱియున్ = ఇంకను.

భావము:

ఒక బోయవాడు పుట్టాడు. వాడు కాకివలె నల్లగా ఉన్నాడు. పొట్టిగా ఉన్నాడు. పెద్ద పెద్ద చెక్కిళ్ళు, కురుచ చేతులు, కురుచ కాళ్ళు, చిట్టిముక్కు, ఎర్రని కళ్ళు, రాగి మీసాలు, రాగి గడ్డం, రాగి తల వెండ్రుకలు గల ఆ మరుగుజ్జువాడు దీనమైన ముఖంతో “నేను చేయవలసిన పని ఏమిటి?” అని ప్రశ్నించాడు. అప్పుడు మునులు “నిషీద (కూర్చుండు)” అన్నారు. అందుచేత వాని పేరు నిషాదుడు అయింది. అతని కులంలో పుట్టినవాళ్ళంతా నిషాదులై పర్వతాలలో అడవులలో సంచరిస్తూ వేనుని దుష్కీర్తిని వెల్లడిస్తున్నారు.