పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-431.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వొరయ కుండెడుఁ గా కని బుద్ధిలోనఁ
లఁచుచుండఁగఁ బెలుచ నుగ్ర మగుచు
ర్వ దిశలను బాంసువర్షంబు గురిసెఁ;
స్కరులు సర్వజనుల విత్తములు గొనిరి.

టీకా:

ముని = మునులలో; వరేణ్యులు = ఉత్తములు; భక్తిన్ = భక్తి; తనర = అతిశయించగ; సరస్వతీ = సరస్వతీనదీ; సలిలంబులను = నీటిలో; కృత = చేసిన; స్నానులు = స్నానముకలవారు; అగుచున్ = అవతూ; మునుకొని = పూని; తత్ = దాని; తీరమునన్ = గట్టుపైన; అగ్నిహోత్రముల్ = అగ్నిహోత్రములు; విలసిల్ల = ఒప్పియుండగ; నియతిన్ = నియమును; కావించి = చేసికొని; అచటన్ = అక్కడ; తవిలి = పూని; సత్ = మంచి; పురుష = పురుషుల; కథా = కథలనుసంకీర్తనచేసెడి; వినోదంబులు = ఉల్లాసములు; సలుపుచుండగ = చేస్తుండగా; సకల = సమస్తమైన; లోక = లోకములకు; భయదంబులు = భయముగొల్పునవి; అగు = అయిన; మహా = గొప్ప; ఉత్పాతముల్ = దుశ్శకునములు; తోచినన్ = తోచగా; మసలి = కలతపడి; లోకంబులు = లోకములు; అమంగళములు = అశుభములు.
పొరయకుండెడుగాక = కలుగకుండుగాక; అని = అని; బుద్ధి = మనసు; లోనన్ = లో; తలచుచుండగన్ = అనుకొంటుండగ; పెలుచన్ = మిక్కిలి; ఉదగ్రము = చెలరేగినవి; అగుచున్ = అవుతూ; = సర్వ = సకల; దిశలనున్ = దిక్కులందు; పాంసు = ధూళి; వర్షంబులు = వర్షములువలె; కురిసెన్ = కురిసెను; తస్కరులు = దొంగలు; సర్వజనుల = అందరి; విత్తములున్ = ధనములను; కొనిరి = తీసుకుపోయిరి.

భావము:

మునీంద్రులు భక్తితో సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి, ఆ నదీతీరాన యథావిధిగా అగ్నికార్యాలు నిర్వర్తించుకొని ఎంతో ఆసక్తితో సత్పురుషుల కథలు చెప్పుకుంటూ వినోదిస్తున్నారు. అప్పుడు సకల లోకాలకు భయం కలిగించే గొప్ప అపశకునాలు గోచరించాయి. ఆ మహోత్పాతాలను చూచి మునీంద్రులు “లోకాలకు అశుభాలు కలుగకుండు గాక!” అని అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానే ప్రచండంగా దుమారం చెలరేగింది. అన్ని దిక్కులలో ధూళి వర్షం కురిసింది. దొంగలు విజృంభించి ప్రజల సంపదలను దోచుకున్నారు.