పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-427-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రికించి నను భజింపుఁడు
ణీశుఁడు సర్వదేవతామయుఁ డగు; మ
త్స ముడుగుఁడు; నాకంటెను
బురుషుఁడు మఱియెవ్వఁ డగ్రపూజార్హుఁ డిలన్?

టీకా:

పరికించి = విచారించుకొని; ననున్ = నన్ను; భజింపుడు = ఆరాధించండి; ధరణీశుడు = రాజు {ధరణీశుడు - ధరణి (భూమి)కి ఈశుడు, రాజు}; సర్వ = సమస్తమైన; దేవతా = దేవతలతో; మయుడు = నిండినవాడు; అగు = అయిన; మత్సర = మాత్సర్యము; ఉడుగుడు = మానుడు; నాకు = నాకు; కంటెన్ = కంటెను; పురుషుడు = సమర్థుడు; మఱి = ఇంక; ఎవ్వడు = ఎవడు; అగ్ర = ముఖ్యమైన; పూజా = ఆరాధనకి; అర్హుడు = అర్హతకలవాడు; ఇలన్ = భూమిపైన.

భావము:

బాగా ఆలోచించి నన్ను సేవించండి. రాజును సర్వ దేవతాస్వరూపునిగా భావించండి. అసూయ విడిచిపెట్టండి. అగ్రపూజకు తగినవాడు లోకంలో నాకంటే మరెవ్వరున్నారు?