పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-415-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని కృపాయత్తు లగుచు నిట్లనిరి యిట్టి
రాచోర భయంబు లీ భూనులను
లసి యిరువంకలను బాధ ఱుపఁ జొచ్చె
దారువందుల వహ్ని చంమునఁ బెలుచ.

టీకా:

కని = చూసి; కృప = దయ; ఆయత్తులు = కలిగినవారు; అగుచున్ = అవుతూ; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఇట్టి = ఇటువంటి; రాజ = రాజువలన; చోర = దొంగలవలన; భయంబున్ = భయములు; ఈ = ఈ; భూజనులను = ప్రజలను; బలసి = అతిశయించి; ఇరు = రెండు (2); వంకలను = పక్కలను; బాధ = బాధ; పఱుపన్ = పెట్టుట; చొచ్చెన్ = మొదలెట్టెను; దారువు = కట్టె; అందులన్ = లో; వహ్ని = నిప్పు; చందంబునన్ = వలె; పెలుచన్ = పీడిస్తూ.

భావము:

చూచి మునులు దయామయులై తమలో ఇలా అనుకున్నారు. “రెండు ప్రక్కల అగ్ని అంటుకున్న కట్టె వలె; రాజభయం, చోరభయం రెండు వైపుల ప్రజలు పీడించబడుతున్నారు.