పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-413-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివ్యులు వెఱఁగందఁగఁ బృ
థ్వీవ్యోమముల గల భేరి వ్రేయించె “న య
ష్టవ్య మదాతవ్యమహో
వ్యం విప్రా” యనుచు నుదాత్తధ్వనులన్.

టీకా:

దివ్యులు = దేవతలు; వెఱగంద = భయపడునట్లు; పృథ్వీ = భూమి; వ్యోమములు = ఆకాశములు; అగల = పగిలిపోవునట్లు; భేరి = దండోరా; వ్రేయించెన్ = వేయించెను; అ = వద్దు; ఇష్టవ్యము = యజ్ఞములు చేయుట; అ = వద్దు; దాతవ్యము = దానములు చేయుట; అ = వద్దు; హోతవ్యం = హోమములు చేయుట; విప్రః = బ్రాహ్మణులారా; అనుచున్ = అంటూ; ఉదాత్త = పెద్దపెద్ద; ధ్వనులన్ = ధ్వనులతో.

భావము:

దేవతలు భయపడే విధంగా భూమి, ఆకాశం బ్రద్దలయ్యేటట్లు భేరీలను వాయింపజేసి ``భ్రాహ్మణులారా! యజ్ఞాలు చేయవద్దు. దానాలను ఇవ్వవద్దు. అగ్నిలో వ్రేల్చవద్దు’’ అని చాటింపు చేయించాడు.