పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-406.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమక్లేశ భాజనం యిన గృహము
విడుచుఁ గావున నిట్టి వివేకహీనుఁ
గు కుపుత్రు సుపుత్రుఁగా నాత్మఁ దలఁతు
నుచు నా రాజు బహుదుఃఖితాత్ముఁ డగుచు.

టీకా:

జనులకు = మానవులకు; దుష్ = చెడ్డ; పుత్రకుని = కుమారుని; చేతన్ = వలన; అపకీర్తియును = చెడ్డపేరు; అధర్మమునున్ = అధర్మము; సర్వ = సమస్తమైన; జన = జనులతోను; విరోధమును = శతృత్వము; మనోవ్యధయును = మానసికబాధ; అనయమున్ = అవశ్యము; ప్రాపించున్ = కలుగును; అట్టి = అటువంటి; కు = చెడ్డ; పుత్ర = కొడుకుపై; మోహంబున్ = మోహము; విడువన్ = వదల; చాలక = లేకుండగ; బహు = మిక్కిలి; మాన = అభిమానముతో; సంగతిన్ = కూడి; కనున్ = చూచెడివాడు; ఎవ్వడు = ఎవడో; అతని = అతని యొక్క; గేహంబు = గృహము; దుఃఖా = దుఃఖములకు; ఆలయంబున్ = నిలయము; అగును = అవుతుంది; అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈవిధముగ; అనున్ = పలికెను; మనుజుండు = మానవుడు; శోక = శోకమునకు; స్థానము = జన్మస్థానము; అగు = అయిన; పుత్రు = కొడుకు; కతన = కారణము; చేసి = వలన.
అనుపమ = చెప్పరాని, సాటిలేని; క్లేశ = బాధల; భాజనంబున్ = స్థానము; అయిన = అయినట్టి; గృహమున్ = ఇల్లు; విడుచున్ = వదలివేయును; కావునన్ = అందుచేత; ఇట్టి = ఇటువంటి; వివేక = మంచిచెడుతెలియుట; హీనుడు = లేనివాడు; అగు = అయిన; కు = చెడ్డ; పుత్రున్ = కొడుకును; సు = మంచి; పుత్రున్ = కుమారుని; కాన్ = అగునట్లు; ఆత్మన్ = మనసున; తలతు = అనుకొనెదను; అనుచున్ = అంటూ; ఆ = ఆ; రాజు = (అంగ) రాజు; బహు = మిక్కిలి; దుఃఖిత = దుఃఖపడుతున్న; ఆత్ముడు = మనసుకలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

“చెడ్డ కొడుకువల్ల జనులకు అపకీర్తి, అధర్మం, అందరితో విరోధం, మనోవ్యథ కలుగుతాయి. అటువంటి పుత్రునిపై వ్యామోహం విడువలేని వాని ఇల్లు దుఃఖానికి నెల వవుతుంది” అని మళ్ళీ ఇలా అనుకున్నాడు. “శోకాన్ని కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు సంభవిస్తాయి. అప్పుడు కన్నతండ్రి గృహన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుచేత జ్ఞానహీనుడైన చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను” అని ఆ రాజు మిక్కిలి దుఃఖిస్తూ…