పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-404-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యము నిట్టి కుపుత్రునిఁ
ని పరితాపంబుఁ బొందుకంటెను ధరలో
పత్యుం డగు టొప్పును
జాక్షు భజించునట్టి వాఁ డగువాఁడున్.

టీకా:

అనయమున్ = ఎల్లప్పుడు; ఇట్టి = ఇటువంటి; కు = చెడ్డ; పుత్రునిన్ = కొడుకును; కని = పొంది; పరితాపంబున్ = మిక్కిలి బాధను; పొందు = పడుట; కంటెను = కంటె; ధర = భూమి; లోనన్ = అందు; అనపత్యుండు = పిల్లలు లేనివాడు; అగుటన్ = అవుట; ఒప్పును = సరియగును; వనజాక్షున్ = విష్ణుని; భజించున్ = ఆరాధించెడి; అట్టి = అటువంటి; వాడు = వాడు; అగు = అయిన; వాడు = వాడు.

భావము:

“ఇటువంటి చెడ్డ కొడుకును కని దుఃఖించడం కంటే సంతానం లేకుండా ఉండడమే ఎంతో మేలు. అప్పుడు భక్తితో భగవంతుని భజించడానికైనా వీలు కలుగుతుంది”