పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-403-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మాతామహ దోషంబునం బాపవర్తనుండై చరియించు కొడుకుం జూచి యంగుండు వివిధ శాసనంబుల దండించియు నతని దుశ్చేష్టితంబులు మానుపం జాలక దుఃఖితాత్ముండై మనంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మాతామహ = తల్లి యొక్క తండ్రి వలని; దోషంబునన్ = దోషమువలన; పాప = పాపపు మార్గమున; వర్తనుండు = తిరుగువాడు; ఐ = అయ్యి; చరియించు = నడిచెడి; కొడుకున్ = పుత్రుని; చూచి = చూసి; అంగుండు = అంగుడు; వివిధ = అనేక రకములుగ; శాసనంబులన్ = శిక్షలతో; దండించియున్ = దండించి నప్పటికిని; అతని = అతని యొక్క; దుష్ట = చెడ్డ; చేష్టితంబులు = పనులు; మానుపన్ = మానునట్లు; చాలక = చేయలేక; దుఃఖిత = దుఃఖపడుతున్న; ఆత్ముండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; మనంబునన్ = మనసులో.

భావము:

ఈ విధంగా తాత యొక్క దోషం వల్ల పాపమార్గంలో సంచరిస్తున్న కొడుకును అంగరాజు పెక్కు విధాలుగా దండించి, అతని చెడునడతను మాన్పలేక దుఃఖిస్తూ తన మనస్సులో…