పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-401-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లదళాక్షి పాయసము గౌతుక మొప్ప భుజించి భర్తృ సం
మునఁ జేసి తత్క్షణమ ర్భముఁ దాల్చి కుమారుఁ గాంచె న
క్కొరుఁడు నంత మాతృజనకుం డగు మృత్యువుఁ బోలి తా నధ
ర్మమునఁ జరించుచుండె గుణమండన! వేనుఁ డనంగ నిచ్చలున్

టీకా:

కమలదళాక్షి = స్త్రీ {కమల దళాక్షి - కమల (పద్మముల) దళ (రేకుల) వంటి అక్షి (కన్నులు కలామె), స్త్రీ}; పాయసమున్ = పాయసమును; కౌతుకము = సంతోషము; ఒప్పన్ = చక్కగా; భుజించి = భుజించి; భర్తృ = భర్తతో; సంగమమునన్ = సంయోగము; చేసి = వలన; తత్క్షణమ = వెంటనే; గర్భము = గర్భము; తాల్చి = ధరించి; కుమారున్ = కుమారునికి; కాంచెన్ = జన్మ యిచ్చెను; ఆ = ఆ; కొమరుడున్ = కుమారుడు; అంతన్ = అంతట; మాతృ = తల్లి యొక్క; జనకుడు = తండ్రి; అగు = అయిన; మృత్యువున్ = మృత్యువును; పోలి = పోలి; తాన్ = తను; అధర్మమునన్ = అధర్మమార్గమున; చరించుచున్ = వర్తిస్తూ; ఉండెన్ = ఉండెను; గుణ = సుగుణములచే; మండన = అలంకరింపబడినవాడ; వేనుడు = వేనుడు; అనంగ = అనగా; నిచ్చలున్ = నిత్యము.

భావము:

తామర రేకుల వంటి కన్నులు కల అంగరాజు భార్య సునీథ ఆ పాయసాన్ని ఆనందంతో ఆరగించి, పతి సంయోగం వల్ల వెంటనే గర్భం ధరించి కుమారుణ్ణి కన్నది. వేనుడు అనే ఆ కుమారుడు తన తల్లి తండ్రియైన మృత్యుదేవతను పోలి అధర్మమార్గాన సంచరింపసాగాడు.