పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : వేనుని చరిత్ర

  •  
  •  
  •  

4-397-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

“ననాథా! యిది యిప్పుడు
వొసిన దుష్కృతము గాదు పూర్వభవమునం
రఁగిన దురితం బిది యా
మున నెఱిగింతు మింత న్యచరిత్రా;

టీకా:

నరనాథ = రాజా {నరనాథుడు - నరులకు ప్రభువు, రాజు}; ఇది = ఇది; ఇప్పుడు = ఇప్పుడు; పొరసిన = పొందిన; దుష్కృతము = అపరాధము {దుష్కృతము - దుష్ (పాపపు) కృతము (పని), అపరాథము}; కాదు = కాదు; పూర్వ = పూర్వ; భవమునన్ = జన్మమున; పరగినన్ = జరిగిన; దురితంబున్ = పాపము; ఇది = ఇది; ఆదరమునన్ = మన్ననతో; ఎఱిగింతుము = తెలిపెదము; ఇంతన్ = ఇదంతా; ధన్య = సార్థకమైన; చరిత్రా = నడవడికకలవాడా.

భావము:

“రాజా! ఇది ఈ జన్మలో ఇప్పుడు చేసిన పాపం కాదు. ఇది పూర్వజన్మలో చేసిన పాపం. దానిని తెలియజేస్తాము. విను.