చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట
- ఉపకరణాలు:
తనకంటె నితర మొక టెఱుఁ
గని కతమున సార్వభౌమకశ్రీఁ బొందన్
మనమునఁ గోరక యుండుటఁ
గని కులవృద్ధులును మంత్రిగణములు నంతన్.
టీకా:
తన = తన; కంటెన్ = కంటె; ఇతరమున్ = వేరైనది; ఒకటిన్ = ఏమియును; ఎఱుగని = తెలియని; కతమునన్ = కారణముచేత; సార్వభౌమక = సార్వభౌమత్వము; శ్రీ = సంపదను; పొందన్ = పొందుటకు; మనమునన్ = మనసులో; కోరక = కోరుకొనకుండగ; ఉండుట = ఉండుట; కని = చూసి; కుల = వంశము నందలి; వృద్ధులును = పెద్దవారు; మంత్రి = మంత్రుల; గణములున్ = సమూహములు; అంతన్ = అంతట.
భావము:
తనకంటే ఇతర పదార్థాన్ని ఎరుగక సార్వభౌమ పదాన్ని కోరకపోవడంతో కులవృద్ధులు, మంత్రులు...