పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-386-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా కిపు డెఱిఁగింపుము సు
శ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులం
బైకొని జుఱ్ఱియుఁ దనివిం
గైకొనకున్నది మనంబు రుణోపేతా!"

టీకా:

నాకున్ = నాకు; ఇపుడున్ = ఇప్పుడు; ఎఱిగింపుము = తెలుపుము; సుశ్లోకుని = నారాయణుని {సుశ్లోకుడు - మంచిగ కీర్తింపబడువాడు, విష్ణువు}; చరితా = వర్తనములు అనెడి; అమృతంబున్ = అమృతమును; శ్రోత్రా = చెవులు అనెడి; అంజలులన్ = దోషిళ్ళతో; పైకొని = మీఱి, మిక్కిలి; జుఱ్ఱియున్ = జుఱ్ఱినప్పటికిని {జుఱ్ఱుట - జుర్ అని శబ్దము తో పీల్చుకొనుచు ఇష్టముతోకూడిన ఆత్రుత కలిగి తినుట}; తనివి = తృప్తి; కైకొనకున్నది = పొందకున్నది; మనంబున్ = మనసు; కరుణన్ = దయతో; ఉపేత = కూడినవాడ.

భావము:

నాకు ఇప్పుడు వినిపించు. కరుణాత్మా! కీర్తనీయుడైన విష్ణు కథామృతాన్ని చెవులనబడే దోసిళ్ళతో ఎంత జుఱ్ఱుకొని గ్రోలినా తృప్తి కలుగడం లేదు.