పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-382-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హితసత్పురుష సమ్మతమును ధన్యంబు-
స్వర్గప్రదంబు యస్కరంబు
నాయుష్కరంబుఁ బుణ్యప్రదాయకమును-
మంగళకర మఘర్షణంబు
సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాప-
రమును ధ్రువపదప్రాపకంబు
నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు-
నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని

4-382.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద
రణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన
వ్యచరితు దినాంత ప్రభాతవేళ
ను సినీవాలి పూర్ణిమ లందు మఱియు.

టీకా:

మహిత = గొప్ప; సత్ = మంచి; పురుష = పురుషుల; సమ్మతమును = అంగీకారము; ధన్యంబున్ = ధన్యమైనది; స్వర్గ = స్వర్గలోక ప్రాప్తిని; ప్రదంబున్ = ఇచ్చునది; యశస్కరంబున్ = కీర్తిని కలుగజేయునది; ఆయుష్కరంబున్ = జీవితకాలమునుపెంచునది; పుణ్యప్రదాయకమును = పుణ్యమునుకలిగించెడిది; = మంగళకరము = శుభకరము; అఘ = పాపములను; మర్షణము = హరించునది; సౌమనస్యము = మంచిమనసుకలిగియుండుట; ప్రశంసా = కీర్తించుటకు; యోగ్యమును = తగినదియిను; పాప = పాపములను; హరమును = హరించుచున్నది; ధ్రువ = ధ్రువుని; పద = స్థానమును; ప్రాపకంబున్ = లభించునదియును; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = ఉపాఖ్యానమున్; తగ = చక్కగ; నీకున్ = నీకు; ఎఱిగించితిని = తెలిపితిని; దీనిన్ = దీన్ని; ఎవ్వడు = ఎవరు; ఏనిన్ = అయినను.
తివుటన్ = కోరి; శ్రద్ధా = శ్రద్ధ; గరిష్టుడు = ఎక్కువగా కలవాడు; ఐ = అయ్యి; తీర్థపాద = విష్ణుమూర్తి యొక్క {తీర్థపాదుడు - పుణ్యతీర్థమునకు స్థానమైన పాదములు కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అనెడి; సరసీరుహ = పద్మముల; ద్వయ = జంటను; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; ఐన = అయిన; భవ్య = దివ్యమైన; చరితున్ = వర్తనకలవానిని; దినాంత = సాయంకాలము; ప్రభాత = ఉదయపు; వేళలను = సమయములందు; సినీవాలీ = చంద్రకళకానవచ్చెడి అమావాస్య; పూర్ణిమల = పౌర్ణమిల; అందున్ = లో; మఱియున్ = ఇంకను.

భావము:

(ధ్రువుని చరిత్ర) సజ్జన సమ్మతం, ధన్యం, స్వర్గప్రదం, కీర్తికరం, ఆయుష్కరం, పుణ్యప్రద, శుభకరం, పాపహరం, సుజనత్వప్రదం, ప్రశంసాయోగ్యం, ధ్రువపదాన్ని కలిగించేది అయిన ధ్రువోపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఎవరైనా దీనిని కోరికతో, శ్రద్ధతో పుణ్యతీర్థాలకు స్థానమైన విష్ణుపాదాలను ఆశ్రయించి, ఉదయ సాయంకాలాలందు, సినీవాలి పూర్ణిమలందు, ఇంకా…