పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-376-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు "దీన యగు జననిం దిగనాడి యెట్లు వోవుదు?" నని చింతించు వానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢ యై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుం డగుచు.

టీకా:

అట్టి = అటువంటి; సమయంబునన్ = సమయములో; ధ్రువుండు = ధ్రువుడు; దుర్గమంబు = ప్రవేశించుటకు రానిది; అగు = అయిన; త్రివిష్టపంబున్ = స్వర్గము; కున్ = కు; ఏగు = వెళ్ళెడి; వాడు = వాడు; అగుచున్ = అవుతూ; దీన = దీనురాలు; అగు = అయిన; జననిన్ = తల్లిని; దిగనాడి = వదలివేసి; ఎట్లు = ఏ విధముగ; పోవుదును = వెళ్ళుదును; అని = అని; చింతించు = విచారించెడి; వానిన్ = వానిని; పార్షదులు = అనుచరులు; అవలోకించి = చూసి; అగ్ర = ముందు; భాగంబునన్ = ప్రక్క; విమాన = విమానమును; ఆరూఢ = ఎక్కినది; ఐ = అయ్యి; ఏగుచున్న = వెళ్తున్న; జననిన్ = తల్లిని; చూపినన్ = చూపించగా; సంతుష్ట = సంతోషించిన; అంతరంగుడు = మనస్సు కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

అటువంటి సమయంలో ధ్రువుడు ప్రవేశించడానికి సాధ్యం కాని దేవలోకానికి పోతూ "దీనురాలైన కన్నతల్లిని విడిచి ఎలా వెళ్ళను?" అని విచారిస్తుండగా విష్ణుభటులు చూచి, తమ ముందు విమానమెక్కి పోతున్న అతని తల్లిని చూపించగా తృప్తి పడుతూ…