పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-367.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తి సలుపుచు నఖిల ప్రపంచమందు
లరఁ దనయందు నున్న మహాత్ము హరినిఁ
జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము
నీశ్వరేశ్వరుఁ బొడఁ గనె నిద్ధచరిత!

టీకా:

గణుతింపన్ = ఎంచిచూసిన; భూరి = అత్యధికమైన; దక్షిణలు = దక్షిణలు {దక్షిణ - యజ్ఞాదుల యందు క్రియలు చేసినవారికి ఇచ్చెడు ధనాదులు}; చేన్ = చేత; కడున్ = మిక్కిలి; ఒప్పు = చక్కనైన; యజ్ఞముల్ = యాగములను; చేయన్ = చేయుటలో; ఆ = ఆ; విభుండు = విభుడు; ద్రవ్య = పదార్థములు; క్రియ = యజ్ఞక్రియలు; దేవతా = దేవతలు; ఫల = ఫలితములు; రూప = అనెడి రూపములుగల; సత్ = మంచి; కర్మ = పనుల; ఫల = ఫలితమును; ప్రదాత = చక్కగ ఇచ్చువాడు; అయి = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; పురుషోత్తముని = నారాయణుని; అర్థిన్ = కోరి; పూజించి = పూజించి; మఱియున్ = ఇంకను; సర్వోపాధివర్జితుడు = హరి {సర్వోపాధివర్జితుడు - సమస్తమైన ఉపాధులను (ఆధారములను, జాతి గుణ క్రియా సంజ్ఞా రూపమైనవి) వర్జితుండు (వదలినవాడు), విష్ణువు}; ఉత్తముండు = హరి; = సర్వాత్మకుడు = హరి {సర్వాత్మకుడు - సర్వజీవులకును ఆత్మయైనవాడు, విష్ణువు}; అగు = అయిన; జలజాక్షున్ = హరి {జలజాక్షుడు - జలజము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; అందున్ = ఎడల; తీవ్రంబు = తీవ్రమైనది; ఐ = అయ్యి; ప్రవాహ = పారెడి, నిత్యనూతనమైన; రూపంబునన్ = స్వరూపముకలిగినది; ఐన = అయిన.
భక్తిన్ = భక్తిని; సలుపుచున్ = చేస్తూ; అఖిల = సమస్తమైన; ప్రపంచమున్ = జగత్తు; అందున్ = లోను; అలరన్ = విలసిల్లుతూ; తన = తన; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; మహాత్మున్ = గొప్పవానిని; హరినిన్ = నారాయణుని; చిదచిదానందమయుని = నారాయణుని {చిదచిదానందమయుడు - చిత్ (చైతన్యవంతములు) అచిత్ (జడములు) సర్వములోను మయుడు, విష్ణువు}; లక్ష్మీవరున్ = నారాయణుని {లక్ష్మీవరుడు - లక్ష్మీదేవి భర్త, విష్ణువు}; పరమున్ = నారాయణుని {పరము - సర్వమునకు అతీతమైనవాడు, విష్ణువు}; ఈశ్వరేశ్వరున్ = నారాయణుని {ఈశ్వరేశ్వరుడు - శ్రేష్టమైన ఈశ్వరుడు, విష్ణువు}; పొడగనె = చూడగలిగె, దర్శించెను; ఇద్ధచరిత = ప్రసిద్ధమైన వర్తన కలవాడ.

భావము:

ధ్రువుడు ఎంతో అధికమైన దక్షిణ లిస్తూ లెక్కలేనన్ని యజ్ఞాలు చేసాడు. యజ్ఞవిభుడు, కర్మఫలప్రదాత అయిన పురుషోత్తముణ్ణి పూజించాడు. జాతి గుణ క్రియా సంజ్ఞా రూపాలైన సమస్త ఉపాధులను వదలినవాడు, ఉత్తముడు, సర్వాత్మకుడు, కమలనయనుడు అయిన భగవంతునిపై తీవ్రమైన భక్తిని ప్రవాహరూపంగా ప్రసరింప జేశాడు. తనలోని మహాత్ముడు, చరాచరములన్నింట ఉండేవాడు, లక్ష్మీపతి, పరాత్పరుడు, దేవదేవుడు అయిన హరిని సర్వజీవులయందు సందర్శించాడు.