పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-362-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తి నుతులచేత నీ విపు
నిఁ బ్రసన్నునిఁగఁ జేయు ని మనువు దయా
తిఁ జెప్పి ధ్రువునిచే స
త్కృతుఁడై నయ మొప్పఁ జనియె షియుక్తుండై.

టీకా:

నతి = నమస్కారములు; నుతుల = స్తోత్రముల; చేతన్ = వలన; నీవు = నీవు; అతనిన్ = అతనిని; ప్రసన్నునిన్ = ప్రసన్నమైనవాని; కాన్ = అగునట్లు; చేయుము = చేయుము; అని = అని; మనువు = మనువు; దయా = కృపగల; మతిన్ = మనసుతో; చెప్పి = చెప్పి; ధ్రువునిన్ = ధ్రువుని; చేన్ = చేత; సత్కృతుడు = సత్కరింపబడినవాడు; ఐ = అయ్యి; నయము = న్యాయము; ఒప్పన్ = ఒప్పునట్లు; చనియెన్ = వెళ్ళెను; ఋషి = ఋషులతో; యుక్తుండు = కూడినవాడు; ఐ = అయ్యి.

భావము:

నమస్కారాల చేత, స్తోత్రాల చేత కుబేరుని ప్రసనుని చేసుకో” అని చెప్పి ధ్రువునిచేత పూజ లందుకొని స్వాయంభువ మనువు ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు.