పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-361-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నఘ! నీదు సహోదరహంత లనుచుఁ
బెనఁచి యీ పుణ్యజనులఁ జంపితి కడంగి
రఁగ నిదియె సదాశివ భ్రాత యైన
ర్థవిభునకు నపరాధ య్యెఁ గాన.

టీకా:

అనఘ = పుణ్యుడ; నీదు = నీ యొక్క; సహోదర = సోదరుని; హంతలు = సంహరించినవారు; అనుచున్ = అంటూ; పెనచి = పెనగులాడి; ఈ = ఈ; పుణ్యజనులన్ = యక్షులను; చంపితి = సంహరించితివి; కడగి = పూని; పరగన్ = ప్రసిద్ధముగ; ఇదియె = ఇదె; సదాశివభ్రాత = కుబేరుడు {సదాశివ భ్రాత - సదాశివుని భ్రాత (సోదరుడు), కుబేరుడు}; ఐన = అయిన; అర్థవిభున్ = కుబేరుని {అర్థవిభుడు - అర్థము (ధనము) నకు అధిపతి (ప్రభువు), కుబేరుడు}; కున్ = కి; అపరాధము = అపకారము; అయ్యెన్ = అయ్యెను; కానన్ = కనుక.

భావము:

పుణ్యాత్మా! నీ తమ్ముని చంపినవాళ్ళు అని ఈ యక్షులను చంపావు. ఇది శివుని సోదరుడైన కుబేరుని పట్ల నీవు చేసిన అపరాధం. కావున…