పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువయక్షుల యుద్ధము

  •  
  •  
  •  

4-359-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కైకొని శుద్ధంబు తమత్సరంబును-
మలంబు నగు హృదయంబునందు
సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు-
గవంతుఁడును బరబ్రహ్మమయుఁడు
నానందమాత్రుండు వ్యయుఁ డుపపన్న-
కలశక్తియుతుండు గుణుఁడజుఁడు
యిన సర్వేశ్వరునం దుత్తమంబైన-
ద్భక్తిఁ జేయుచు మత నొప్పి

4-359.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రూఢి సోహమ్మమేతి ప్రరూఢ మగుచు
నత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు
ద్రెంచివైచితి; కావున ధీవరేణ్య!
ర్వశుభహాని యైన రోషంబు వలదు.

టీకా:

కైకొని = చేపట్టి; శుద్ధంబు = పరిశుద్ధమైనది; గత = పోయిన; మత్సరంబును = మత్సరము యైనది; అమలంబును = మలములు లేనివాడు; హృదయంబున్ = హృదయము; అందు = అందు; సొలయక = అలసిపోకుండగ; అన్వేషించుచున్ = వెదకికొనుచు; ప్రత్యగాత్ముండు = హరి {ప్రత్యగాత్ముడు - ఎదురుగకనబడువాడు, విష్ణువు}; భగవంతుడును = హరి {భగవంతుడు - ఐశ్వర్యవంతుడు, విష్ణువు}; పరబ్రహ్మమయుడున్ = హరి {పరబ్రహ్మమయుడు - పరబ్రహ్మముయైనవాడు, విష్ణువు}; ఆనందమాత్రుండున్ = హరి {ఆనందమాత్రుండు - ఆనందము తానే ఐన వాడు, విష్ణువు}; అవ్యయుడు = హరి {అవ్యయుడు - తరుగుటలేనివాడు, అనంతుడు, విష్ణువు}; ఉపపన్నసకలశక్తియుతుండు = హరి {ఉపపన్నసకలశక్తియుతుండు - ఉపపన్న (ఎదుట సిద్ధమైన) సకల (సమస్తమైన) శక్తులు కలవాడు, విష్ణువు}; = సగుణుడు = హరి {సగుణుడు - దివ్యగుణములు కలవాడు, విష్ణువు}; అజుడు = హరి {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; అయిన = అయిన; సర్వేశ్వరున్ = హరి {సర్వేశ్వరుడు - సర్వులకును (అందరికీ) ఈశ్వరుడు, విష్ణువు}; అందున్ = ఎడల; ఉత్తమంబు = ఉత్తమమైనది; ఐన = అయిన; సత్ = మంచి; భక్తిన్ = భక్తితో; చేయుచున్ = చేస్తూ; సమతన్ = సమత్వముతో; ఒప్పి = ఒప్పియుండి.
రూఢిన్ = నిశ్చయముగ; సోzహమ్మమేతి = భేదభావములతో {సోzహమ్మమేతి - సోzహం (వాడు నేను) మమ (నాది) ఇతి (అనెడి), భేదభావము}; ప్రరూఢమున్ = మిక్కిలి ప్రసిద్ధమైనది; అగుచున్ = అవుతూ; ఘనతన్ = పేరుపొందినట్టి; అవిద్యన్ = అవిద్య; అన్ = అనెడి; గ్రంథిన్ = పీటముడిని, బంధనమును; నీవు = నీవు; త్రెంచివైతివి = తెంపేసికొన్నావు; కావునన్ = అందుచేత; ధీవరేణ్య = బుద్ధిబలముకలవాడ; సర్వ = సకల; శుభ = శౌభాగ్యమునకు; హాని = నష్టము కలిగించునది; ఐన = అయిన; రోషంబున్ = రోషము; వలదు = వద్ధు.

భావము:

పవిత్రమైన, పగను వీడిన నిష్కల్మషమైన మనస్సుతో అలుపు లేకుండా అన్వేషించు. ఈ విధంగా ప్రత్యగాత్ముడు, భగవంతుడు, పరబ్రహ్మ, ఆనందస్వరూపుడు, అనంతుడు, సమస్త శక్తిమంతుడు, సగుణుడు, అజుడు అయిన ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తే వాడు, నేను, నాది అనే అవిద్యారూపమైన పీటముడిని త్రెంచుకొన్నావు. కావున ధీశాలీ! సర్వశుభాలను హరించే కోపాన్ని విడిచిపెట్టు.